Election Results 2022 LIVE: యూపీ, దేశ ప్రజలు డబుల్ ఇంజిన్ పాలనను కోరుకుంటున్నారు : సీఎం యోగి
Assembly Election Results 2022 LIVE Updates: 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సిద్ధమైంది. ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపుర్ ఫలితాలు సాయంత్రానికి వెలువడనున్నాయి.
LIVE

Background
UttarPradesh: యూపీ, దేశ ప్రజలు డబుల్ ఇంజిన్ పాలనను కోరుకుంటున్నారు : సీఎం యోగి
యూపీలో మొదటిసారిగా ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ఉత్తర్ ప్రదేశ్ ప్రజలు బీజేపీకి అద్భుత విజయం కట్టబెట్టినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని మోదీ నాయకత్వంలో బీజేపీ.. యూపీతో పాటు ఉత్తరాఖండ్, మణిపుర్, గోవాలో కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. ప్రధాని మోదీ మార్గనిర్దేశంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. కేంద్రం, రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం అధికారంలో ఉంటే మేలు అని యోగి అన్నారు. యూపీ, దేశ ప్రజలు డబుల్ ఇంజిన్ పాలనను కోరుకుంటున్నారన్నారు.
గోవాలో 20 స్థానాలతో అతిపెద్ద పార్టీగా బీజేపీ
గోవాలో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య జరిగిన హోరాహోరీ పోరులో అధికారం బీజేపీనే వరించింది. తుది ఫలితాల్లో బీజేపీ 20 స్థానాల్లో గెలుపొంది అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్ పార్టీ 12 స్థానాల్లో విజయం సాధించింది. తృణమూల్ కాంగ్రెస్, ఆమ్‌ఆద్మీ పార్టీలు చెరో రెండుచోట్ల గెలుపొందాయి. మరో నాలుగు స్థానాల్లో స్వతంత్రులు విజయం సాధించారు. మొత్తం 40 స్థానాలున్న గోవా అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటుకు 21 స్థానాలు కావాల్సి ఉంది. 20 సీట్లలో గెలుపొందిన బీజేపీ, స్వతంత్ర అభ్యర్థుల మద్దతులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది.
UttarPradesh: యూపీలో మ్యాజిక్ ఫిగర్ ను దాటేసిన బీజేపీ, మరో 65 స్థానాల్లో ఆధిక్యం
ఉత్తర్ ప్రదేశ్ లో బీజేపీ ఘన విజయం సాధించింది. మ్యాజిక్ ఫిగర్(202)ను బీజేపీ దాటేసింది. యూపీలోని మొత్తం 403 అసెంబ్లీ స్థానాలకు 208 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. మరో 65 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఎస్పీ 78 స్థానాల్లో గెలుపొందింది. మరో 46 స్థానాల్లో ఎస్పీ ఆధిక్యంలో ఉంది.
Uttarakhand: ఉత్తరాఖండ్ లో మళ్లీ అధికారం బీజేపీదే, ఓటమిపాలైన సీఎం
ఉత్తరాఖండ్ లో బీజేపీ మళ్లీ అధికారం కైవసం చేసుకుంది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు గానూ మేజిక్ ఫిగర్(36) కన్నా ఎక్కువ చోట్ల గెలుపొందింది. ప్రస్తుతానికి బీజేపీ 36 చోట్ల గెలవగా, మరో 11 చోట్ల ఆధిక్యంలో ఉంది. కానీ ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ అనూహ్యంగా ఓటమి పాలయ్యారు.
Uttarakhand Results: ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ ఓటమి
ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ ఓటమి పాలయ్యారు. ఖతిమా నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి భువన్ చంద్ర చేతిలో 6 వేల ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

