Election Results 2022 Live: గుజరాత్లో వరుసగా ఏడోసారి భాజపా సర్కార్- హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ విజయకేతనం
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కోసం ఈ పేజ్‌ని రిఫ్రెష్ చేయండి.
LIVE
Background
హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కాసేపటి క్రితం ప్రారంభమైంది. రెండు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు 8 గంటలకు ప్రారంభమైంది. హిమాచల్ ప్రదేశ్‌లో నవంబర్ 12న ఒక దశలో, గుజరాత్‌లో డిసెంబర్ 1, 5 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరిగాయి. కౌంటింగ్ కేంద్రాల చుట్టూ విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు.
గుజరాత్లోని 37 కేంద్రాల్లో ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కాగా... బీజేపీ దూసుకెళ్తోంది. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో బీజేపీకి ఆధిక్యం లభించింది. 182 మంది సభ్యుల అసెంబ్లీలో మెజారిటీ మార్కు 92. ఈసారి ఓటింగ్ శాతం 2012 కంటే తక్కువగా ఉంది. 2017లో గుజరాత్‌లో 68.39 శాతం పోలింగ్ జరగ్గా, ఈసారి 64.33 శాతం పోలింగ్ నమోదైంది. ద్రవ్యోల్బణం, రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో నీటి లభ్యత లేకపోవడం, పెద్ద ప్రాజెక్టులకు భూసేకరణ, రైతుల సమస్యలు ఎన్నికలను ప్రభావితం చేశాయి. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఇషుదన్ గధ్వీ, హార్దిక్ పటేల్, జిగ్నేష్ మేవానీ సహా 1,621 మంది అభ్యర్థుల భవితవ్యం ఈ రోజు తేలనుంది.
గత 27 ఏళ్లుగా గుజరాత్‌లో బీజేపీ అధికారంలో ఉంది. రాష్ట్రంలో వరుసగా ఏడోసారి విజయం సాధిస్తామన్న ధీమాతో బీజేపీ ఉంది. గుజరాత్ లో బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య ముక్కోణపు పోటీ నెలకొంది. అయితే ఎగ్జిట్ పోల్స్ మాత్రం గుజరాత్ లో బీజేపీదే విజయం అని అంచనా వేశాయి. గుజరాత్‌లో బీజేపీకి 128-140 సీట్లు, కాంగ్రెస్ 31-43 సీట్లు, ఆప్‌కు 3-11 సీట్లు, ఇతరులకు 2-6 సీట్లు వస్తాయని ఏబీపీ న్యూస్ సీ-వోటర్ ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది.
హిమాచల్ ప్రదేశ్ లో 10 వేల మంది భద్రతా సిబ్బంది, ఎన్నికల అధికారులు, ఇతర సహాయక సిబ్బంది పర్యవేక్షణలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా 68 కేంద్రాల్లో ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. 68 స్థానాలున్న హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి నవంబర్ 12న జరిగిన ఎన్నికల్లో 76.44 శాతం పోలింగ్ నమోదైంది. ప్రస్తుతం రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం ఉంది, కానీ హిమాచల్ ప్రదేశ్ లో ప్రతి ఐదేళ్లకు ఒకసారి ప్రభుత్వాన్ని మార్చే సంప్రదాయం ఉంది.
హిమాచల్ ప్రదేశ్ లో ఎగ్జిట్ పోల్స్ ఎగ్జిట్ పోల్స్ బిజెపి విజయం సాధిస్తుందని అంచనా వేశాయి. అయితే, కాంగ్రెస్ మాత్రం గట్టి పోటీ ఇస్తున్నట్లు కనిపిస్తోంది. హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీకి 33 నుంచి 41 సీట్లు, కాంగ్రెస్ కు 24 నుంచి 32 సీట్లు, ఆమ్ ఆద్మీ పార్టీకి 0-4 సీట్లు, ఇతరులకు 0-4 సీట్లు వస్తాయని ఏబీపీ సర్వే అంచనా వేసింది.
'గుజరాత్లో బీజేపీ తన రికార్డును బద్దలు కొడుతుంది'
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందు గుజరాత్ మంత్రి పూర్ణేష్ మోడీ మాట్లాడుతూ, "గుజరాత్ అంతటా బిజెపి తన రికార్డును బద్దలు కొడుతుంది. బీజేపీకి అత్యధిక శాతం వస్తుంది. ఈ మధ్యాహ్నం నాటికి మాకు ఫలితాలన్నీ తెలుస్తాయి. బీజేపీ పెద్ద ఎత్తున గెలుస్తుంది. బీజేపీ అభివృద్ధి పేరుతో రాజకీయాలు చేస్తోందని అన్నారు.
ఎగ్జిట్ పోల్స్ విఫలం అవుతాయని కాంగ్రెస్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీ అన్నారు.
గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీకి సైలెంట్ వేవ్ ఉందని జిగ్నేష్ మేవానీ అన్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికలు గుజరాత్ కు, దేశానికి కొత్త దిశను ఇస్తాయని, రాష్ట్రంలో మార్పు చాలా ముఖ్యమని ఆయన అన్నారు. ఈ ఎన్నికలు నిరంకుశత్వానికి, నిరుద్యోగానికి, ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా ఉండబోతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఈసారి కాంగ్రెస్ పార్టీకి 120 సీట్లు వస్తాయి. అన్నారు.
ప్రధాని స్పందన
గుజరాత్ ఎన్నికల్లో భాజపా ఘనవిజయం సాధించడంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. పార్టీ కార్యకర్తలకు మోదీ ధన్యవాదాలు తెలిపారు
[quote author= ప్రధాని మోదీ]మా పార్టీకి నిజమైన బలం అయిన మా కార్యకర్తల అసాధారణమైన కృషి లేకుండా ఈ చారిత్రక విజయం ఎప్పటికీ సాధ్యం కాదు. [/quote]
To all hardworking @BJP4Gujarat Karyakartas I want to say - each of you is a champion! This historic win would never be possible without the exceptional hardwork of our Karyakartas, who are the real strength of our Party.
— Narendra Modi (@narendramodi) December 8, 2022
సీఎం రాజీనామా
హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరాం ఠాకూర్ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని గవర్నర్‌కు అందజేశారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ మెజార్టీ మార్కు దాటింది.
సీఎం అభ్యర్థి ఓటమి
ఆమ్‌ఆద్మీ గుజరాత్ సీఎం అభ్యర్థి ఇసుదాన్ గద్వీ 19 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.
కొనసాగుతోన్న కౌంటింగ్
హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ ఇప్పటివరకు 16 స్థానాలను గెలుచుకుని.. 23 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మరోవైపు బీజేపీ 13 స్థానాల్లో విజయం సాధించగా. మరో 13 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
In Himachal Pradesh, Congress wins 16 seats, leading in 23 seats; BJP wins 13 seats & is currently leading in 13 seats as counting continues. pic.twitter.com/fYVC9dF9cZ
— ANI (@ANI) December 8, 2022
సీఎం రాజీనామా
మరికొద్ది సేపట్లో గవర్నర్‌కు రాజీనామా సమర్పించనున్నట్లు హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరాం ఠాకూర్ తెలిపారు.
I will tender my resignation to the Governor in a short while from now: Outgoing Himachal Pradesh CM Jairam Thakur #HimachalElectionResults2022 pic.twitter.com/xiVpoEjYb4
— ANI (@ANI) December 8, 2022