AP Election Results 2024 Winners LIVE: ఏపీలో కూటమి అభ్యర్థుల ప్రభంజనం - 13 స్థానాల్లో టీడీపీ అభ్యర్థుల గెలుపు
AP Lok Sabha Election Results 2024 Winners LIVE: ఏపీ లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో కూటమి అభ్యర్థులు విజయం దిశగా దూసుకెళ్తున్నారు. మొత్తం 25 స్థానాలకు గాను 16 స్థానాల్లో ముందంజలో ఉన్నారు.

Background
AP Lok Sabha Election Results 2024 Winners LIVE: ఏపీలో లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో కూటమి ఎంపీ అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్నారు. ఇప్పటివరకూ కూటమి అభ్యర్థులు 16 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. వైసీపీ 4, జనసేన 2, బీజేపీ 3 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. ఈ ఫలితాలతో టీడీపీ బీజేపీ జనసేన శ్రేణుల్లో ఫుల్ జోష్ నెలకొంది.
13 ఎంపీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థుల ఘన విజయం
AP Election Results 2024 Winners LIVE: ఏపీ లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయం దిశగా దూసుకెళ్తున్నారు. 25 ఎంపీ స్థానాల్లో టీడీపీ ఎంపీ అభ్యర్థులు 13 స్థానాల్లో విజయం సాధించారు. మరో 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. జనసేన 2 చోట్ల, బీజేపీ 2 చోట్ల విజయం సాధించాయి. వైసీపీ ఒక స్థానంలో విజయం సాధించగా.. మరో 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.
కడపలో ఎంపీ అవినాష్ రెడ్డి హ్యాట్రిక్ విజయం
AP Election Results 2024 Winners LIVE: కడపలో వైసీపీ ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి హ్యాట్రిక్ విజయం అందుకున్నారు. టీడీపీ అభ్యర్థి భూపేశ్ రెడ్డిపై 69,050 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ వైఎస్ షర్మిల 1.34 లక్షల ఓట్లు సాధించి డిపాజిట్ కోల్పోయారు.





















