అన్వేషించండి

ABP-CVoter Opinion Poll: తమిళనాడులో I.N.D.I.A కూటమి క్లీన్ స్వీప్ - లోక్‌సభలో 3వ అతిపెద్ద పార్టీగా DMK!

Tamil Nadu ABP CVoter Opinion Poll 2024: దక్షిణాది రాష్ట్రం తమిళనాడులో I.N.D.I.A కూటమి మొత్తం 39 సీట్లు గెలుచుకోనుండగా, ఎన్డీఏ, అన్నాడీఎంకేలకు ఒక్క సీటు రాదని ఏబీపీ సీఓటర్ పోల్ వెల్లడించింది.

ABP-CVoter Opinion Poll:  త్వరలో ప్రారంభం కానున్న లోక్‌సభ ఎన్నికలపై ఏబీపీ న్యూస్ సీఓటర్ ప్రజాభిప్రాయాన్ని సేకరించాయి. నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ(BJP) పలు రాష్ట్రాల్లో ప్రభావం చూపుతుండగా, తమిళనాడులో మాత్రం ఎన్డీఏకు ఎదురుగాలి వీచనుంది. ఏబీపీ న్యూస్ సీఓటర్ నిర్వహించిన ఒపీనియల్ పోల్ ప్రకారం.. తమిళనాడులోని మొత్తం 39కి 39 స్థానాలను ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్ (I.N.D.I.A.) కూటమి కైవసం చేసుకోనుంది. ద్రవిడ మున్నేట్ర కజగం (DMK), కాంగ్రెస్ పార్టీలు రాష్ట్రంలోని అన్ని లోక్‌సభ స్థానాల్లో ఘన విజయం సాధించనుందని తాజా సర్వేలో వెల్లడైంది. 

తమిళనాడులో ఎన్డీఏ, అన్నాడీఎంకేకు భారీ షాక్! 
బీజేపీ ఈ ఎన్నికల్లో 400 సీట్లు సాధించి, మరోసారి ఎన్డీఏ ప్రభుత్వం వస్తుందని.. ప్రధానిగా నరేంద్ర మోదీ హ్యాట్రిక్ కొడతారని కాషాయ పార్టీ నేతలు చెబుతున్నారు. కానీ దక్షిణాది రాష్ట్రం తమిళనాడులో మాత్రం బీజేపీ, ఎన్డీఏకు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. I.N.D.I.A కూటమికి 51.8 శాతం ఓట్లు రానుండగా, ఎన్డీఏ కూటమి కేవలం 19 శాతం ఓట్లకు పరిమితం కానుందని ఏబీపీ సీఓటర్ సర్వేలో తేలింది. అన్నాడీఎంకే 23 శాతం ఓట్లతో రెండో స్థానంలో నిలవనుంది. 

బలం పుంజుకున్న డీఎంకే, కాంగ్రెస్ 
తమిళనాడులోని మొత్తం 39 లోక్‌సభ స్థానాలకుగానూ సీఎం స్టాలిన్ కు చెందిన డీఎంకే పార్టీ కూటమి 30 సీట్లు, కాంగ్రెస్ పార్టీ 9 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. తాజా సర్వే గమనిస్తే.. తమిళనాడులో అన్నాడీఎంకే, ఎన్డీఏకి ఒక్క సీటు కూడా వచ్చే ఛాన్స్ లేదట. అధిక స్థానాలు నెగ్గే కూటమిలో డీఎంకే, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు, విడుతలై చిరుతైగల్ కట్చి, ఎండీఎంకే, IUML, కేఎండీకే పార్టీలున్నాయి. తాజా సర్వే నిజమైతే 18వ లోక్‌సభలో బీజేపీ, కాంగ్రెస్ తరువాత డీఎంకే పార్టీ మూడో అతిపెద్ద పార్టీగా అవతరించనుంది. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 293 సీట్లు నెగ్గగా, కాంగ్రెస్ 50, డీఎంకే 20 సీట్లు కైవసం చేసుకున్నాయి. 

ABP-CVoter Opinion Poll: తమిళనాడులో I.N.D.I.A కూటమి క్లీన్ స్వీప్ - లోక్‌సభలో 3వ అతిపెద్ద పార్టీగా DMK!

మరికాసేపట్లో ఏపీ, తెలంగాణ సర్వే ఫలితాలు
ఏపీలోని 25 లోక్‌సభ స్థానాలతో పాటు తెలంగాణలోని 17 ఎంపీ స్థానాలకు మే 13న నాలుగో దశలో ఒకేసారి ఎన్నికలు జరగనున్నాయి. మరో మూడు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుండగా.. ఏబీపీ న్యూస్ సీఓటర్ ప్రజాభిప్రాయాన్ని సేకరించింది. ఓవైపు వైసీపీ మరోసారి ఎన్నికల్లో భారీగా సీట్లు నెగ్గుతుందని ధీమా వ్యక్తం చేస్తోంది. ఫ్యాన్ జోరుకు బ్రేకులు వేసేందుకు టీడీపీ, జనసేన, బీజేపీలతో కూడిన ఎన్డీఏ కూటమి ప్రభంజనం సృష్టిస్తుందని కూటమి నేతలు చెబుతున్నారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సీన్ రిపీట్ చేస్తామని కాంగ్రెస్ ధీమాగా ఉంది. మోదీ హవాతో సగానికి పైగా లోక్‌సభ స్థానాల్లో నెగ్గుతామని బీజేపీ నేతలు చెబుతుండగా, తెలంగాణ కోసం పోరాడాలంటే బీఆర్ఎస్ కు ఎక్కువ సీట్లు ఇవ్వాలని కేసీఆర్ పార్టీ నేతలు ప్రజల్ని కోరుతున్నారు. ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న లోక్‌సభ ఎన్నికల ఒపీనియన్ పోల్  (ABP CVoter Opinion Poll 2024) ఫలితాలు మరికాసేపట్లో విడుదల కానున్నాయి.

(Methodology: Current survey findings and projections are based on CVoter Opinion Poll CATI interviews (Computer Assisted Telephone Interviewing) conducted among 18+ adults statewide, all confirmed voters, details of which are mentioned right below the projections as of today. The data is weighted to the known demographic profile of the States. Sometimes the table figures do not sum to 100 due to the effects of rounding. Our final data file has Socio-Economic profile within +/- 1% of the Demographic profile of the State. We believe this will give the closest possible trends. The sample spread is across all Assembly segments in the poll bound state. MoE is +/- 3% at macro level and +/- 5% at micro level VOTE SHARE projection with 95% Confidence interval.)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Aravind: 'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
Allu Arjun: 'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
Guntur News: హాస్టల్‌లో బిడ్డకు జన్మనిచ్చిన ఫార్మసీ విద్యార్థిని - జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం, అధికారిణి సస్పెండ్
హాస్టల్‌లో బిడ్డకు జన్మనిచ్చిన ఫార్మసీ విద్యార్థిని - జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం, అధికారిణి సస్పెండ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!హైటెన్షన్! మైనర్‌‌ను ఇంట్లో బంధించి అత్యాచారంకరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Aravind: 'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
Allu Arjun: 'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
Guntur News: హాస్టల్‌లో బిడ్డకు జన్మనిచ్చిన ఫార్మసీ విద్యార్థిని - జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం, అధికారిణి సస్పెండ్
హాస్టల్‌లో బిడ్డకు జన్మనిచ్చిన ఫార్మసీ విద్యార్థిని - జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం, అధికారిణి సస్పెండ్
Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Royal Enfield Bullet 350 Vs Hunter 350: రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్, హంటర్ 350ల్లో ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్ బైక్?
రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్, హంటర్ 350ల్లో ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్ బైక్?
Government Banned OTT Apps: 18 ఓటీటీ యాప్స్ బ్యాన్ చేసిన ప్రభుత్వం - ఎందుకో తెలుసా?
18 ఓటీటీ యాప్స్ బ్యాన్ చేసిన ప్రభుత్వం - ఎందుకో తెలుసా?
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Embed widget