అన్వేషించండి

Andhra Pradesh Exit Poll : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ దెబ్బకొట్టిందా ? కడప సీటు కూడా అందుకే డౌట్‌లో పడిందా ?

ABP Cvoter Exit Poll 2024 : వైఎస్ఆర్‌సీపీ ని కాంగ్రెస్ , షర్మిల నష్టపరిచినట్లుగా కనిపిస్తోంది. కడప సీటు కూడా డౌట్‌లో పడినట్లుగా ఏబీపీ -సీఓటర్ ఎగ్జిట్ పోల్‌లో వెల్లడి కావడం దీనికి సంకేతం.

Andhra Pradesh Exit Poll :  ఏబీపీ సీఓటర్ ఎగ్జిట్ పోల్‌లో ఆంధ్రప్రదేశ్‌లో కూటమి గాలి వీస్తోందని వెల్లడయింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే బీజేపీ అగ్రనేతలు ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పడు మొత్తం ఇరవై ఐదు సీట్లను స్వీప్ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కూడా అదే చెప్పారు. అయితే చాలా మంది కడప లోక్ సభ సీటులో వైఎస్ఆర్‌సీపీని ఎవరూ ఓడించలేరని భావిస్తున్నారు. కానీ ఏబీపీ-సీఓటర్ ఎగ్జిట్ లో భిన్నమైన ఫలితం వస్తోంది.  

ఏపీలో ఖచ్చితంగా వైసీపీ గెలిచే సీటు లేదని తేల్చిన ఎగ్జిట్ పోల్                                  

కూటమికి 21 నుంచి 25 సీట్లు వస్తాయని ఏబీపీ - సీఓటర్ ఎగ్జిట్ పోల్ తేల్చింది. వైఎస్ఆర్‌సీపీ కి సున్నా నుంచి నాలుగు సీట్లలో చాన్స్ ఉంది. అంటే నాలుగు సీట్లలో మాత్రమే గట్టి పోటీ ఇస్తోంది.ఆ నాలుగు సీట్లలో కడప నియోజకవర్గం కూడా ఉండి ఉండవచ్చు. కడప ఇలా రిస్క్ లో పడటానికి కారణం ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు షర్మిల అని. వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ వారసురాలిగా అడుగు పెట్టిన ఆమె.. ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా బాధ్యతలు తీసుకున్నారు. విస్తృతంగా పర్యటించారు. కడప లోక్ సభకు పోటీ చేశారు. కొంగు చాపి న్యాయం చేయాలని ప్రజల్ని అడిగి సెంటిమెంట్ రాజకీయాలు చేశారు. 

కడపలో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన షర్మిల వల్ల ఎక్కువ నష్టం                                             

షర్మిల దూకుడుగా చేసిన రాజకీయాల వల్ల కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ 3.3 శాతానికి చేరుకుంటుందని స్పష్టమయింది. గత ఎన్నికల్లో ఇది ఒక్క శాతం కూడా లేదు. కాంగ్రెస్‌కు పెరిగిన ప్రతి ఒక్క ఓటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే అవుతుంది. ఎందుకంటే వైసీపీ ఓటు బ్యాంక్ మొత్తం కాంగ్రెస్ పార్టీదే. దళితులు, ముస్లింలు , గిరిజనుల్లో ఈ సారి కొంత కాంగ్రెస్ వైపు మళ్లినట్లుగా కనిపిస్తోంది. ఇది వైసీపీని భారీగా దెబ్బతీస్తున్నట్లుగా చెబుతున్నారు. షర్మిల భర్త అనిల్ కుమార్ కు క్రైస్తవ వర్గాల్లో ఉన్న నెట్ వర్క్ కూడా ఇందుకు ఉపయోగపడిందని అనుకోవచ్చు. 

వైసీపీకి షర్మిల వల్ల కోలుకోలేని నష్టం జరిగిందా ?                     

కడప లోక్ సభ నియోజకవర్గంలో షర్మిల కూడా గట్టి పోటీ ఇచ్చారు. ఆమెకు ఆ లోక్ సభ నియోజకవర్గ పరిధిలో భారీగా ఓట్లు పోలయ్యాయని ఎగ్జిట్ పోల్ అంచనాలను బట్టి అర్థం చేసుకోవచ్చు. షర్మిల గెలవలేకపోవచ్చు కానీ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగా నష్టం చేయడం ఖాయంగా  కనిపిస్తోంది. 

టాప్ హెడ్ లైన్స్

Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Adilabad Spiny Gourd:ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Adilabad Spiny Gourd:ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
Embed widget