YSRUHS Admissions: పీజీ మెడికల్, డెంటల్ యాజమాన్య సీట్ల ప్రవేశాలకు నోటిఫికేషన్, ముఖ్యమైన తేదీలివే!
ఏపీలోని 17 ప్రైవేటు మెడికల్, 13 డెంటల్ కాలేజీల్లో పీజీ (ఎండీ/ఎంఎస్), ఎండీఎస్ యాజమాన్య కోటా సీట్ల ప్రవేశానికి సంబంధించిన వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ ఆగస్టు 4న నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఏపీలోని 17 ప్రైవేటు మెడికల్, 13 డెంటల్ కాలేజీల్లో పీజీ (ఎండీ/ఎంఎస్), ఎండీఎస్ యాజమాన్య కోటా సీట్ల ప్రవేశానికి సంబంధించిన వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ ఆగస్టు 4న నోటిఫికేషన్ విడుదల చేసింది. నీట్ పీజీ-2023లో అర్హత సాధించిన అభ్యర్థులు ఆగస్టు 5న ఉదయం 11గంటల నుంచి ఆగస్టు 14న సాయంత్రం 5 గంటల వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది, ఇంటర్న్‌షిప్ ఆగస్టు 11లోగా పూర్తి చేసుకున్న ఎంబీబీఎస్ డిగ్రీ విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎండీఎస్‌కు సంబంధించి జూన్ 30లోగా ఇంటర్న్‌షిప్ పూర్తిచేసి ఉండాలి.
వివరాలు..
* యాజమాన్య కోటా పీజీ మెడికల్, డెంటల్ ప్రవేశాలు
1) పీజీ (ఎండీ/ఎంఎస్)
అర్హత: నీట్-పీజీ 2023 అర్హత సాధించి ఉండాలి. ఆగస్టు 11లోగా ఇంటర్న్‌షిప్ పూర్తవుతూ ఉండాలి.
కటాఫ్ మార్కులు: జనరల్(UR,EWS)-50 పర్సంటైల్ (291 స్కోరు), ఎస్సీ-ఎస్టీ-ఓబీసీ-దివ్యాంగులు-40 పర్సంటైల్ (257 స్కోరు), జనరల్(దివ్యాంగులు)-45 పర్సంటైల్ (274 స్కోరు).
2) ఎండీఎస్
అర్హత: నీట్-పీజీ 2023 అర్హత సాధించి ఉండాలి. ఆగస్టు 11లోగా ఇంటర్న్‌షిప్ పూర్తవుతూ ఉండాలి.
కటాఫ్ మార్కులు: జనరల్(UR,EWS)-50 పర్సంటైల్ (272 స్కోరు), ఎస్సీ-ఎస్టీ-ఓబీసీ-దివ్యాంగులు-40 పర్సంటైల్ (238 స్కోరు), జనరల్(దివ్యాంగులు)-45 పర్సంటైల్ (255 స్కోరు).
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: నీట్ పీజీ కటాఫ్ మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా.
రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు..
➥ వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ పరిధి, తిరుపతి స్విమ్స్, జీఐఎంఎస్‌ఆర్-వైజాగ్‌లో ఎంబీబీఎస్, బీడీఎస్ పూర్తిచేసిన విద్యార్థులు రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజుగా రూ.7,080 చెల్లించాలి. ఇందులో రూ.3,500 రిజిస్ట్రేషన్ ఫీజుగా, రూ.2,500 ప్రాసెసింగ్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. దీనికి 18 శాతం (రూ.1080) జీఎస్‌టీ అదనంగా చెల్లించాలి.
➥ ఏపీ, తెలంగాణ వెలుపల ఎంబీబఎస్ డిగ్రీ పూర్తిచేసిన విద్యార్థులు రూ.10,620 చెల్లించాలి. ఇక విదేశాల్లో ఎంబీబీఎస్/బీడీఎస్ చదివిన వారు రూ.15,340 చెల్లించాల్సి ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం: 05.08.2023.
➥ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: 14.08.2023.
ALSO READ:
ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్, వెబ్‌కౌన్సెలింగ్ తేదీలివే
కన్వీనర్ కోటా ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి వరంగల్‌లోని కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ తొలి విడత కౌన్సెలింగ్ నోటిఫికేషన్‌ను ఆగస్టు 3న విడుదల చేసింది. ఎంబీబీఎస్ ప్రవేశాలకు వెబ్‌ఆప్షన్ల నమోదుకు సంబంధించిన వివరాలను నోటిఫికేషన్‌లో వెల్లడించింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఆగస్టు 4 నుంచి 6 వరకు వెబ్‌కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
ఎంపీసీ విద్యార్థులకు 'స్పెషల్ కౌన్సెలింగ్' ద్వారా ఫార్మసీ సీట్ల కేటాయింపు
తెలంగాణలో రెండు విడతల ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ ఆగస్టు 2తో ముగిసిన సంగతి తెలిసిందే. ఆగస్టు 4 నుంచి చివరివిడత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభంకానుంది. ఆ తర్వాత ఆగస్టు 17 నుంచి ప్రత్యేక కౌన్సెలింగ్ మొదలుకానుంది. ఈ కౌన్సెలింగ్ ద్వారా ఇంటర్ ఎంపీసీ విద్యార్థులు బీఫార్మసీ, ఫార్మా-డి కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. సాధారణంగా ఏటా ఎంసెట్ చివరి విడత కౌన్సెలింగ్‌లో వారికి సీట్లు కేటాయిస్తూ వస్తున్నారు. ఈసారి చివరి విడత తర్వాత ప్రత్యేక విడత కౌన్సెలింగ్‌లో అవకాశం ఇచ్చేలా మార్పు చేశారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
ఆగస్టు 4 నుంచి ఎంసెట్ చివరి విడత కౌన్సెలింగ్, పూర్తి షెడ్యూలు ఇలా
తెలంగాణలో ఎంసెట్ చివరి విడత కౌన్సెలింగ్ ఆగస్టు 4 నుంచి ప్రారంభంకానుంది. ఆగస్టు 5న సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. ఆగస్టు 9న విద్యార్థులకు సీట్లను కేటాయిస్తారు. ఈసారి ప్రత్యేక విడత పేరిట కమిటీ నిర్ణయం మేరకు నిర్వహించనున్న మరో కౌన్సెలింగ్ ఆగస్టు 17న ప్రారంభం కానుంది. ఈ కౌన్సెలింగ్ కోసం ఆగస్టు 17న స్లాట్ బుకింగ్, ఆగస్టు 18న ధ్రువపత్రాల పరిశీలన, ఆగస్టు 17 నుంచి 19 వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం ఇవ్వనున్నారు. ఇక ఆగస్టు 23న సీట్లను కేటాయించనున్నారు. సీట్లు పొందిన విద్యార్థులు ఆగస్టు 23 నుంచి 25 వరకు నిర్ణీత ట్యూషన్ ఫీజు చెల్లించి సంబంధిత కళాశాలల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
కౌన్సెలింగ్ పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..