అన్వేషించండి

No USA: అమెరికాకు వెళ్లే భారత విద్యార్థుల్లో భారీగా తగ్గుదల - గత ఏడాదితో పోలిస్తే ఏకంగా 80 శాతం - యూరప్ వైపు మొగ్గు !

Indian Students : ట్రంప్ పరిపాలనలో వీసాలే కాదు..వీసా స్లాట్లు కూడా దొరకడం లేదు. యూనివర్శిటీల్లో సీట్లు వచ్చినా వీసాలు ఇవ్వడం లేదు. దాంతో విద్యార్థులు యూరప్ వైపు చూస్తున్నారు.

US Faces 80 Percent Drop In Indian Students: అమెరికాకు చదువు కోసం వెళ్లే విద్యార్థుల సంఖ్య ఎవరూ ఊహించనంతగా పడిపోనుంది. వీసా సంక్షోభం తీవ్రమవుతున్న కొద్దీ అమెరికాకు భారతీయ విద్యార్థుల సంఖ్య 70 నుంచి 80 శాతం వరకూ తగ్గుతుందని అంచనాలు వెలుగులోకి వస్తున్నాయి. 

ఈ ఏడాది అమెరికాలోని   విశ్వవిద్యాలయాలు భారతీయ విద్యార్థుల సంఖ్యలో 80 శాతం వరకూ తగ్గుదలను చూశాయి. ట్రంప్ పరిపాలనా విధానాల కారణంగా అంతర్జాతీయ విద్యార్థులకు ఏర్పడుతున్న ఆటంకాలు దీనికి కారణంత. హైదరాబాద్‌లోని  ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీలు  అవుట్‌బౌండ్ ట్రాఫిక్ 70 శాతం తగ్గిందని నిర్ధారించారు.  వీసా అపాయింట్‌మెంట్ స్లాట్‌లలో   ఫ్రీజ్ , వీసా తిరస్కరణ రేట్లలో అకస్మాత్తుగా పెరుగుదల కారణంగా ఈ తగ్గుదల ఏర్పడింది.

సాధారణంగా ఈ సమయానికి, చాలా మంది విద్యార్థులు తమ వీసా ఇంటర్వ్యూలను పూర్తి చేసి విమాన ప్రయాణానికి సిద్ధమవుతూ ఉండాలి.    కానీ ఇప్పటికి వీసా స్లాట్లు అందుబాటులోకి రావడం లేదు. వీసా స్లాట్‌లను దశలవారీగా విడుదల చేస్తామని యుఎస్ అధికారులు హామీ ఇచ్చారు. కానీ ఈ విషయంలో క్లారిటీ లేదు.  ఇది విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తోంది.  స్లాట్‌లను బుక్ చేసుకోగలిగిన విద్యార్థులు కన్ఫర్మేషన్ పొందలేకపోతున్నారు.  బుకింగ్‌లను నిర్ధారించకుండా స్లాట్‌లు తెరవడంతో కొత్త సమస్యలు వస్తున్నాయి.  
 
అమెరికా విద్య అనిశ్చితంగా మారుతూంటంతో విద్యార్థులు విద్య కోసం ఇతర దేశాలను అన్వేషిస్తున్నారు,  ఒక సంవత్సరం కోల్పోతే..  ఇబ్బంది అవుతుందని కొంత మంది  దరఖాస్తులను ఉపసంహరించుకుంటున్నారు. జర్మనీ సహా ఇతర యూరప్ దేశాల్లో ప్రసిద్ధ యూనివర్శిటీల్లో అవకాశాలను వెదుక్కుంటున్నారు.   రాబోయే కొద్ది రోజుల్లో స్లాట్‌లు విడుదల చేయకపోతే, వేలాది కలలు చెదిరిపోతాయి. మార్చి నాటికి దరఖాస్తు చేసుకుని ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్‌లు పొందిన విద్యార్థులు ఇప్పుడు అసాధారణంగా తిరస్కరణకు గురవుతున్నారు. సాధారణంగా సజావుగా ఆమోదాలు పొందే చాలా మంది విద్యార్థులను తిప్పి పంపుతున్నారు. వారి సోషల్ మీడియా వెట్టింగ్ లో సమస్యలు లేకపోయినా సరే అకారణంగా రిజెక్ట్ చేస్తున్నారు.                          

US ఇమ్మిగ్రేషన్ ,  జాతీయత చట్టంలోని సెక్షన్ 214(b) వీసా తిరస్కరణలకు ఒక సాధారణ కారణం చూపిస్తారు. వారు వీసా గడువు ముగిసిన తర్వాత  దేశానికి తిరిగి వస్తారని నిరూపించుకోలేకపోతే వీసా తిరస్కరిస్తారు.  వీసా దరఖాస్తుదారులు అమెరికాకు లేదా  అమెరికా  ప్రయోజనాలకు హాని కలిగించే ఉద్దేశ్యం లేదని  నిరూపించుకోవాల్సి ఉందని యూఎస్ ఎంబసి అధికారులు చెబుతున్నారు.  గత సంవత్సరం భారతదేశం 3.3 లక్షలకు పైగా విద్యార్థులు  అమెరికాకు వెళ్లారు. ఈ సంఖ్య చైనా కంటే ఎక్కువ. విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) డేటా ప్రకారం, జనవరి 1, 2024 నాటికి, 11.6 లక్షలకు పైగా భారతీయ విద్యార్థులు విదేశాలలో ఉన్నత విద్యా సంస్థలలో చదువుతున్నారు. ఇక నుంచి ఎక్కువ మంది యూరప్ వైపు చూస్తున్నారు.                                 

 

టాప్ హెడ్ లైన్స్

Khudiram Bose:18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
Fact Check: విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
AP DSC Notification 2026: అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
JNVST 2027 Registration: నవోదయ విద్యాలయాల్లో ప్రవేశానికి ఇదే చివరి అవకాశం! ఫారం నింపడానికి నేడే లాస్ట్‌ డేట్! 
నవోదయ విద్యాలయాల్లో ప్రవేశానికి ఇదే చివరి అవకాశం! ఫారం నింపడానికి నేడే లాస్ట్‌ డేట్! 

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Cow Urine Selling: పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
UPI Transaction: మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
Chemical Signaling: మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
Microsoft Alert: హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
Embed widget