అన్వేషించండి

DOST Seat Allotment: నేడే 'దోస్త్' మొదటి విడత సీట్ల కేటాయింపు, ఎన్ని గంటలకంటే?

DOST Seat Allotment: తెలంగాణలో 'దోస్త్' మొదటి విడత వెబ్‌ఆప్షన్ల ప్రక్రియ జూన్ 2న ముగియడంతో.. జూన్ 6న సీట్లను కేటాయించేందుకు ఉన్నత విద్యామండలి సన్నద్దమవుతోంది.

DOST Phase-1 Seat Allotment: తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించి 'దోస్త్' మొదటి విడత వెబ్‌ఆప్షన్ల ప్రక్రియ జూన్ 2న ముగియడంతో.. సీట్ల కేటాయింపును ఉన్నత విద్యామండలి సన్నద్ధమవుతోంది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జూన్ 6న 'దోస్త్' ఫేజ్-1 సీట్లను కేటాయించనున్నారు. జూన్ 6న మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఉన్నత విద్యామండలి కార్యాలయంలో నిర్వహించనున్న మీడియా స‌మావేశంలో సీట్ల కేటాయింపు ఫలితాలను ప్రకటించనున్నారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ ప్రిన్సిప‌ల్ సెక్రట‌రీ బుర్రా వెంక‌టేశం, ఉన్నత విద్యా మండ‌లి చైర్మన్ ఆర్ లింబాద్రితో పాటు దోస్త్ క‌న్వీన‌ర్ పాల్గొన‌నున్నారు. దోస్త్ ద్వారా రాష్ట్రంలోని 1066 డిగ్రీ కళాశాలల్లో మొత్తం 4,49,449 సీట్లు అందుబాటులో ఉన్నాయి. మూడు విడతల్లో నిర్వహించే దోస్త్‌ కౌన్సెలింగ్ ద్వారా ఈ సీట్లను భర్తీచేయనున్నారు.

దోస్త్ (డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ-DOST) మొదటి దశ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా మే 6న రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. జూన్ 1 వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించారు. ఇక మే 20 నుంచి జూన్ 2 వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించారు. స్పెషల్ కేటగిరీ విద్యార్థులకు మే 28, 29 తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించారు. ఆప్షన్లు నమోదుచేసుకున్నవారికి జూన్ 6న సీట్లను మొదటి విడత సీట్లను కేటాయించనున్నారు. సీట్లు పొందిన విద్యార్థులు జూన్ 6 నుంచి 12 మధ్య ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.

దోస్త్‌ ద్వారా ప్రవేశాలు కల్పించే ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ, శాతవాహన యూనివర్సిటీల పరిధిలో మొత్తం 1066 డిగ్రీ కాలేజీలుండగా, వాటిలో 136 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, నాన్‌ దోస్త్‌ కాలేజీలు 63 ఉన్నాయి. మిగిలినవి ప్రైవేట్‌ కాలేజీలు ఉన్నాయి. వీటిల్లో మొత్తం 4.49 సీట్లు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీబీఎం, బీసీఏ తదితర కోర్సుల్లోని సీట్లను దోస్త్‌ ద్వారా భర్తీచేస్తారు. 

దోస్త్' రెండో దశ ప్రవేశాలు ఇలా..

➥  రెండో విడత దోస్త్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జూన్ 6 నుంచి 13 వరకు కొనసాగనుంది. (రిజిస్ట్రేషన్ ఫీజు రూ.400)

➥  రెండో విడత వెబ్ ఆప్షన్ల నమోదుకు జూన్ 6 నుంచి 14 వరకు అవకాశం కల్పించనున్నారు.

➥ ఫేజ్-2 స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ (PH/ CAP/NCC ): 13.06.2024.

➥  విద్యార్థులకు జూన్ 18న రెండో విడత డిగ్రీ సీట్లను కేటాయిస్తారు.

➥  సీట్లు పొందిన విద్యార్థులు జూన్ 19 నుంచి 24 మధ్య సంబంధిత కళాశాలలో సెల్ప్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.

'దోస్త్' మూడో విడత ప్రవేశాలు ఇలా..

➥ ఇక చివరగా.. జూన్ 19 నుంచి మూడో విడత రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభంకానుంది.

➥ విద్యార్థులు జూన్ 25 వరకు దరఖాస్తులు సమర్పించాలి.

➥  చివరి విడత వెబ్ ఆప్షన్ల ప్రక్రియను జూన్ 19 నుంచి 26 వరకు నిర్వహించనున్నారు.

➥ ఫేజ్-3 స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ (PH/ CAP/NCC ): 25.06.2024.

➥ విద్యార్థులకు జూన్ 29న మూడో విడత డిగ్రీ సీట్లను కేటాయిస్తారు.

➥ సీట్లు పొందిన విద్యార్థులు జులై 3లోగా సంబంధిత కళాశాలలో సెల్ప్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.

➥ అన్ని విడతల్లో (ఫేజ్-1, ఫేజ్-2, ఫేజ్-3) సీట్లు పొందిన విద్యార్థులు రిపోర్టింగ్ చేయడానికి తేదీలు: 29.06.2024 - 05.07.2024.

➥ కళాశాలలో విద్యార్థులకు ఓరియంటేషన్ తరగతులు: 01.07.2024 - 06.07.2024.

➥  జులై 8 నుంచి కళాశాలల్లో తరగతులు ప్రారంభంకానున్నాయి.

Notification (Telugu)

Notification (English)

DOST Schedule

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి.. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Notices to Allu Arjun : అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
Andhra Pradesh: ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
Manchu Family Issue : విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
CM Chandrababu: 'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Shyam Benegal Passed Away | ఏడుసార్లు జాతీయ అవార్డు పొందిన దర్శకుడి అస్తమయం | ABP DesamMinister Seethakka on Pushpa 2 | పుష్ప సినిమాపై మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు | ABP DesamSchool Children Cold Weather Condition | చలికి ఇబ్బంది చిన్నారులకు ఆపన్న హస్తాలు | ABP Desamట్రాన్స్ జెండర్స్ ఆన్ డ్యూటీ, నేటి నుంచే హైదరాబాద్ రోడ్లపై..

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Notices to Allu Arjun : అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
Andhra Pradesh: ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
Manchu Family Issue : విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
CM Chandrababu: 'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
TG HighCourt: హైకోర్టులో కేసీఆర్, హరీశ్‌రావు క్వాష్ పిటిషన్లు - ఆ నోటీసులను సవాల్ చేస్తూ నిర్ణయం
హైకోర్టులో కేసీఆర్, హరీశ్‌రావు క్వాష్ పిటిషన్లు - ఆ నోటీసులను సవాల్ చేస్తూ నిర్ణయం
AP Weather Report: తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Instagram Reach Tips: ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ టైమ్‌లో పోస్ట్ చేస్తే ఎక్కువ రీచ్ వస్తుంది? - ఇలా చేస్తే సూపర్!
ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ టైమ్‌లో పోస్ట్ చేస్తే ఎక్కువ రీచ్ వస్తుంది? - ఇలా చేస్తే సూపర్!
Anantapur Crime News: స్టాక్ మార్కెట్ పేరుతో ఫ్రెండ్స్ మోసం - కన్నీరు పెట్టిస్తున్న అనంతపురం హెడ్మాస్టర్ సూసైడ్ నోట్
స్టాక్ మార్కెట్ పేరుతో ఫ్రెండ్స్ మోసం - కన్నీరు పెట్టిస్తున్న అనంతపురం హెడ్మాస్టర్ సూసైడ్ నోట్
Embed widget