అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

DOST 2024 Notification: డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు 'దోస్త్‌' నోటిఫికేషన్ విడుదల, ముఖ్యమైన తేదీలివే!

DOST: తెలంగాణలోని డిగ్రీ కళాశాలల్లో వివిధ కోర్సుల్లో 2024-25 విద్యాసంవత్సరం ప్రవేశాలకు సంబంధించి దోస్త్ నోటిఫికేషన్‌ మే 3న వెలువడింది. మొత్తం మూడు విడతలుగా ప్రవేశాలను కల్పించనున్నారు.

DOST 2024 Notification: తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో వివిధ కోర్సుల్లో 2024-25 విద్యాసంవత్సరం ప్రవేశాలకు సంబంధించి దోస్త్ (DOST - Degree Online Services Telangana) నోటిఫికేషన్‌ మే 3న వెలువడింది. మొత్తం మూడు విడతలుగా ప్రవేశాలను కల్పించనున్నారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. మే 6 నుంచి 25 వరకు మొదటి విడత రిజిస్ట్రేషన్లు నిర్వహించి జూన్ 3న సీట్లను కేటాయించనున్నారు. జూన్ 4 నుంచి 13 వరకు రెండో విడత రిజిస్ట్రేషన్లు నిర్వహించి  జూన్ 18న సీట్లను కేటాయిస్తారు. ఇక చివరి విడత రిజిస్ట్రేషన్ ప్రక్రియను జూన్ 19 నుంచి 25 వరకు నిర్వహించి.. జూన్ 29న సీట్లను కేటాయిస్తారు.

ప్రవేశాల ప్రక్రియ పూర్తయిన తర్వాత జులై 8 నుంచి డిగ్రీ కాలేజీల్లో తరగతులు ప్రారంభంకానున్నాయి. విద్యార్థులు మొదటి విడతలో రూ.200 చెల్లించాలి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది.  రెండు, మూడో విడతలో రూ.400 రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇంటర్ ఉత్తీర్ణులైన విద్యార్థులు డిగ్రీ మొదటి సంవత్సరంలో ప్రవేశాల కోసం 'దోస్త్‌' ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

దోస్త్‌ పరిధిలో రాష్ట్రంలోని ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ, శాతవాహన యూనివర్సిటీల పరిధిలో 1054 డిగ్రీ కాలేజీలుండగా, వాటిలో 136 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, నాన్‌ దోస్త్‌ కాలేజీలు 63 ఉన్నాయి. మిగిలినవి ప్రైవేట్‌ కాలేజీలు ఉన్నాయి. వీటిల్లో మొత్తం 3,86,544 డిగ్రీ సీట్లు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీబీఎం, బీసీఏ తదితర కోర్సుల్లోని సీట్లను దోస్త్‌ ద్వారా భర్తీచేస్తారు. 

దోస్త్ 2024 షెడ్యూలు..

మొత్తం మూడు విడతల్లో డిగ్రీ ప్రవేశాల ప్రక్రియ చేపట్టనున్నారు. 

మొదటి దశ ప్రవేశాలు ఇలా..

➥ మే 6 నుంచి 25 వరకు దోస్త్ మొదటి విడత రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిర్వహించనున్నారు.

➥  రిజిస్ట్రేషన్ పూర్తిచేసిన విద్యార్థులకు మే 15 నుంచి 27 వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించనున్నారు.

➥  విద్యార్థులకు జూన్ 3న మొదటి విడత డిగ్రీ సీట్లను కేటాయించనున్నారు.

➥  సీట్లు పొందిన విద్యార్థులు జూన్ 4 నుంచి 10 మధ్య సంబంధిత కళాశాలలో సెల్ప్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.

రెండో దశ ప్రవేశాలు ఇలా..

➥  రెండో విడత దోస్త్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జూన్ 4 నుంచి 13 వరకు కొనసాగనుంది.

➥  రెండో విడత వెబ్ ఆప్షన్లకు జూన్ 4 నుంచి 14 వరకు అవకాశం కల్పించనున్నారు.

➥  విద్యార్థులకు జూన్ 18న రెండో విడత డిగ్రీ సీట్లను కేటాయిస్తారు.

➥  సీట్లు పొందిన విద్యార్థులు జూన్ 19 నుంచి 24 మధ్య సంబంధిత కళాశాలలో సెల్ప్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.

మూడో విడత ప్రవేశాలు ఇలా..

➥ ఇక చివరగా.. జూన్ 19 నుంచి మూడో విడత రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభంకానుంది.

➥ విద్యార్థులు జూన్ 25 వరకు దరఖాస్తులు సమర్పించాలి.

➥  చివరి విడత వెబ్ ఆప్షన్లకు జూన్ 19 నుంచి 25 వరకు నిర్వహించనున్నారు.

➥ విద్యార్థులకు జూన్ 29న మూడో విడత డిగ్రీ సీట్లను కేటాయిస్తారు.

➥ సీట్లు పొందిన విద్యార్థులు జులై 8లోగా సంబంధిత కళాశాలలో సెల్ప్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.

➥  జులై 8 నుంచి కళాశాలల్లో తరగతులు ప్రారంభంకానున్నాయి.

WEBSITE

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియావయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీమహారాష్ట్రలో బీజేపీ సత్తా! ఏ మ్యాజిక్ పని చేసింది?కుప్పకూలిన ఆసిస్ అదరగొట్టిన భారత బౌలర్లు!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
KA Movie OTT Release Date: కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
TGPSC Group-1 Results: 'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
IND vs AUS 1st Test Highlights: 20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్, ఆసీస్‌లో మొదలైన కంగారు
20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్ భాగస్వామ్యం, ఆసీస్‌లో మొదలైన కంగారు
Embed widget