అన్వేషించండి

Polytechnic Seats: తొలి విడతలో 20,890 విద్యార్థులకు పాలిటెక్నిక్ సీట్లు, తుది విడత కౌన్సెలింగ్ ఎప్పుడంటే?

POLYCET: తెలంగాణలోని పాలిటెక్నిక్‌ కళాశాలల్లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన కౌన్సెలింగ్‌లో పాల్గొన్న అభ్యర్థులకు సాంకేతిక విద్యాశాఖ మొదటి విడత సీట్లను కేటాయించింది.

Telangana POLYCET Counselling 2024: తెలంగాణలో పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించిన మొదటి విడత సీట్ల కేటాయింపు ప్రక్రియ జూన్ 30న ముగిసింది. కౌన్సెలింగ్ ద్వారా తొలిదశలో 20,890 సీట్లు భర్తీ అయ్యాయి. అభ్యర్థులు వెబ్‌సైట్ ద్వారా సీటు కేటాయింపు పత్రాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ లాగిన్ ఐడీ నెం, పాలిసెట్ హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేదీ తదితర వివరాలు నమోదుచేసి అలాట్‌మెంట్ ఆర్డర్ పొందవచ్చు. సీట్లు పొందిన విద్యార్థులు జులై 4లోగా నిర్ణీత ఫీజు చెల్లించి, సంబంధిత కళాశాలలో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. మొదటి విడతలో సీట్లు దక్కని విద్యార్థులు, కౌన్సెలింగ్‌లో పాల్గొనలేకపోయినవారు తుది విడత కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చు. జులై 15 నుంచి పాలిటెక్నిక్ విద్యార్థులకు విద్యాసంవత్సరం ప్రారంభంకానుంది. జులై 17 వరకు ఓరియంటేషన్ తరగతులు నిర్వహించి, జులై 18 నుంచి తరగతులు ప్రారంభించనున్నారు.

సీటు అలాట్‌మెంట్ ఆర్డర్స్ కోసం క్లిక్ చేయండి..

సీట్ల కేటాయింపు వివరాలు ఇలా..
రాష్ట్రవ్యాప్తంగా 113 పాలిటెక్నిక్‌ కళాశాలలో మొత్తం 28,931 సీట్లు అందుబాటులో ఉన్నాయి. తొలివిడత కౌన్సెలింగ్ ద్వారా 20,890 సీట్లు భర్తీకాగా.. 8,041 సీట్లు మిగిలిపోయాయి. మొత్తం సీట్లలో కేవలం 72.21% మాత్రమే భర్తీ అయ్యాయి. నాలుగు పాలిటెక్నిక్‌ కాలేజీలలో 100 శాతం సీట్లు భర్తీఅయ్యాయి. ఇందులో 3 ప్రభుత్వ కాలేజీలు, ఒకటి ప్రైవేటు కాలేజీ ఉంది. ఇక మిగిలిపోయిన సీట్లలో 57 ప్రభుత్వ కాలేజీలలో 1941 సీట్లు, ప్రైవేటు పాలిటెక్నిక్‌ కాలేజీలో 6,100 సీట్లు మిగిలిపోయాయి. ఈడబ్ల్యూఎస్‌ కోటాలో 658 సీట్లు భర్తీ అయ్యాయి.  

జులై 7 నుంచి రెండో విడత కౌన్సెలింగ్..
ఇక జులై 7 నుంచి 16 మధ్య రెండో విడత పాలిసెట్ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. వెబ్ఆప్షన్ల నమోదుకు జులై 9 నుంచి అవకాశం కల్పించనున్నారు. ఆప్షన్లు నమోదుచేసుకున్నవారికి జులై 13న సీట్లను కేటాయించనున్నారు. సీట్లు పొందినవారు జులై 16లోగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఇక కన్వీనర్ ద్వారా ఇంటర్నల్ స్లైడింగ్‌ చేపట్టాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. జులై 21 నుంచి ఇంటర్నల్ స్లైడింగ్‌ అవకాశం కల్పించనున్నారు. జులై 24లోపు సీట్లను కేటాయించి.. జులై 23న స్పాట్ అడ్మిషన్లకు మార్గదర్శకాలను విడుదల చేయనున్నారు.  

కౌన్సెలింగ్ షెడ్యూలు ఇలా..

➥ పాలిసెట్ రెండో విడత కౌన్సెలింగ్ ప్రారంభం: 07.07.2024.

➥ వెబ్‌ ఆప్షన్ల నమోదు: 09.07.2024 నుంచి.

➥ పాలిసెట్ రెండో విడత సీట్ల కేటాయింపు: 13.07.2024.

➥ ఇంటర్నల్ స్లైడింగ్‌: 21.07.2024.

➥ స్పాట్ అడ్మిషన్లకు మార్గదర్శకాలు: 23.07.2024.

పాలిసెట్‌-2024 ప్రవేశ పరీక్ష ర్యాంకు ఆధారంగా రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్‌ కాలేజీలతోపాటు, ప్రొఫెసర్‌ జయశంకర్‌ అగ్రికల్చర్‌ యూనివర్సిటీ, పీవీ నరసింహారావు వెటర్నరీ వర్సిటీ, కొండా లక్ష్మణ్ హార్టికల్చర్‌ యూనివర్సిటీలో ఇంజినీరింగ్‌, నాన్‌-ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సులు‌, అగ్రికల్చర్‌, హార్టికల్చర్‌, యానిమల్‌ హస్బెండరీ, ఫిషరీస్‌ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. 

ఈ ఏడాది మే 24న పాలిసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 259 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు మొత్తం 92,808 వేల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షకు దరఖాస్తు చేసుకున్నవారిలో 82,809 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. గతేడాది 1.05 లక్షల మంది విద్యార్థులు పోటీపడగా.. ఈ సారి 92 వేలకు పైగా విద్యార్థులు పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. పాలిసెట్ పరీక్ష పలితాలను జూన్ 3న విడుదల చేశారు. ఫలితాల్లో మొత్తం 84.20 శాతం ఉత్తీర్ణత నమోదైంది. మొత్తం 69,728  మంది అర్హత సాధించారు. ఎంపీసీ విభాగంలో 84.20 శాతం, ఎమ్ బైపీసీలో 82.48 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. పాలిసెట్ పరీక్షకు 46,319 మంది బాలురు హాజరుకాగా.. 37,269 మంది (80.47 శాతం) అర్హత సాధించారు. ఇక 36,496 మంది బాలికలు పరీక్షకు హాజరుకాగా.. 32,459 మంది (88.94 శాతం) అర్హత సాధించారు.  

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

The Cave Pub Case: కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
Free Sand Scheme: ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
Gudivada News: బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
Hyderabad: మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bobbili Maharaja Vintage Cars and Weapons | ఇలాంటి పాత, ఖరీదైన కార్లు మీకు ఎక్కడా కనిపించవు.! | ABPSingirikona Narasimha Swamy Temple | సింగిరికోన అడవిలో మహిమాన్విత నారసింహుడి ఆలయం చూశారా.! | ABP80 Years Old Man Completes 21 PGs | చదువు మీద ఈ పెద్దాయనకున్న గౌరవం చూస్తుంటే ముచ్చటేస్తుందిCM Chandrababu CM Revanth Reddy Meeting | అందరి కళ్లూ... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపైనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
The Cave Pub Case: కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
Free Sand Scheme: ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
Gudivada News: బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
Hyderabad: మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
Andhra Pradesh: ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
Weather Latest Update: ఏపీ తీరం వద్ద ఆవర్తనం, తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు - ఐఎండీ
ఏపీ తీరం వద్ద ఆవర్తనం, తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు - ఐఎండీ
Revanth Gift to Chandrababu: భేటీలో చంద్రబాబుకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
భేటీలో చంద్రబాబుకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
IND vs ZIM 1st T20I : విశ్వ విజేతలకు తొలి షాక్‌ , భారత్‌కు జింబాబ్వే చెక్‌
విశ్వ విజేతలకు తొలి షాక్‌ , భారత్‌కు జింబాబ్వే చెక్‌
Embed widget