అన్వేషించండి

Lawcet Counselling: తెలంగాణ లాసెట్‌ కౌన్సెలింగ్‌ రిజిస్ట్రేషన్‌ గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?

తెలంగాణలోని లా కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించిన లాసెట్/పీజీఎల్‌సెట్-2023 ప్రవేశపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు నిర్వహించనున్న కౌన్సెలింగ్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ గడువును అధికారులు పొడిగించారు.

TS LAWCET 2023 Counselling Schedule: తెలంగాణలోని లా కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించిన లాసెట్/పీజీఎల్‌సెట్-2023 (LAWCET/PGLCET) ప్రవేశపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు నిర్వహించనున్న కౌన్సెలింగ్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ గడువును అధికారులు పొడిగించారు. మొదట ప్రకటించిన షెడ్యూలు ప్రకారం నవంబరు 21తో రిజిస్ట్రేషన్ గడువు ముగియగా.. నవంబరు 23 వరకు అవకాశం కల్పించారు. కాకతీయ యూనివర్సిటీలో డిగ్రీ విద్యార్థుల బ్యాక్‌లాగ్‌ సబ్జెక్టుల ఫలితాలు వెలువడకపోవడంతో అభ్యర్థుల వినతి మేరకు రెండు రోజులు పెంచినట్లు అధికార వర్గాలు తెలిపాయి. నవంబరు 21 వరకు ఎల్‌ఎల్‌బీ 3, 5 సంవత్సరాలతోపాటు ఎల్‌ఎల్‌ఎం కోర్సుకు సుమారు 13 వేల మంది రిజిస్ట్రేషన్‌ చేసుకున్నట్లు లాసెట్‌ ప్రవేశాల కన్వీనర్‌ ఆచార్య పి.రమేష్‌బాబు ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు నవంబర్‌ 30న సీట్లు కేటాయిస్తారు. డిసెంబరు 4 నుంచి తరగతులు మొదలవుతాయని ఆయన చెప్పారు. ఆ మూడు కోర్సుల్లో సుమారు 8 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి.

Counselling Website

తొలివిడత కౌన్సెలింగ్‌ కొత్త షెడ్యూలు ఇలా.. 

➥ ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్, సర్టిఫికేట్ వెరిఫికేషన్: 23.11.2023 వరకు. 

➥ అర్హులైన అభ్యర్థుల జాబితా వెల్లడి, అభ్యంతరాలు(ఈమెయిల్ ద్వారా) తెలిపేందుకు అవకాశం: 24.11.2023.

➥ వెబ్‌ ఆప్షన్ల నమోదు: 25.11.2023 - 27.11.2023 వరకు.

➥ వెబ్‌ఆప్షన్లలో మార్పులు: 27.11.2023.

➥  సీట్ల కేటాయింపు: 30.11.2023.

➥  సంబంధిత కళాశాలల్లో రిపోర్టింగ్, ఒరిజినల్ ధ్రువపత్రాల పరిశీలన: 01.12.2023 - 06.12.2023

➥ తరగతులు ప్రారంభం: 04.12.2023.

Lawcet Counselling: తెలంగాణ లాసెట్‌ కౌన్సెలింగ్‌ రిజిస్ట్రేషన్‌ గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?

సీట్ల వివరాలు ఇలా..

➥ మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సు పరీక్షలో మొత్తం 20,234 మంది అభ్యర్థులు అర్హత సాధించగా.. రాష్ట్రంలోని 22 కళాశాలల్లో మొత్తం 4,790 సీట్లు అందుబాటులో ఉన్నాయి. 

➥ అయిదేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సు పరీక్షలో మొత్తం 6,039 మంది అభ్యర్థులు అర్హత సాధించగా.. రాష్ట్రంలోని 19 కళాశాలల్లో మొత్తం 2,280 సీట్లు అందుబాటులో ఉన్నాయి. 

➥ ఇక రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎం పరీక్షలో మొత్తం 2,776 మంది అభ్యర్థులు అర్హత సాధించగా.. రాష్ట్రంలోని 17 కళాశాలల్లో మొత్తం 930 సీట్లు అందుబాటులో ఉన్నాయి. 

టీఎస్‌ లాసెట్‌, పీజీ లాసెట్‌ ప్రవేశ పరీక్ష మే 25న మూడు సెష‌న్లలో నిర్వహించిన సంగ‌తి తెలిసిందే. మొద‌టి సెష‌న్‌ను ఉద‌యం 9:30 గంట‌ల నుంచి 11 గంట‌ల వ‌ర‌కు, రెండో సెష‌న్‌ను మ‌ధ్యాహ్నం 12:30 నుంచి 2 గంట‌ల వ‌ర‌కు నిర్వహించారు. ఐదేండ్ల లా డిగ్రీ కోర్సు విద్యార్థుల‌కు మూడో సెష‌న్‌లో సాయంత్రం 4 నుంచి 5:30 గంట‌ల వ‌ర‌కు నిర్వహించారు. ఈ ఏడాది మూడేండ్ల లా డిగ్రీ కోర్సుకు 31,485 మంది, ఐదేండ్ల లా డిగ్రీ కోర్సుల‌కు 8,858 మంది, ఎల్ఎల్ఎంకు 3,349 మంది ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్నవారిలో మొత్తం 43,692 మంది హాజ‌రయ్యారు. పరీక్షల ఆన్సర్ కీని మే 29న ఆన్సర్ కీని విడుదల చేశారు. ఆన్సర్ కీపై మే 31 వరకు అభ్యంతరాలు స్వీకరించారు. పరీక్షకు హాజరైనవారిలో లాసెట్‌ (మూడేళ్ల ఎల్ఎల్‌బీ)లో 78.59 శాతం, లాసెట్ (ఐదేండ్ల ఎల్ఎల్‌బీ)లో 80.21 శాతం, పీజీ ఎల్‌సెట్‌(ఎల్ఎల్ఎం)లో 94.36 శాతం ఉత్తీర్ణత సాధించారు.

ALSO READ:

బీఎస్సీ నర్సింగ్ ప్రవేశాలకు వెబ్ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభం, ఎప్పటివరకు అవకాశమంటే?
విజయవాడలోని డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి రాష్ట్రంలోని నర్సింగ్‌ కళాశాలల్లో బీఎస్సీ నర్సింగ్‌ (BSc Nursing) కోర్సుల్లో ప్రవేశానికి మూడో విడత కౌన్సెలింగ్ ప్రక్రియ నవంబరు 21న ప్రారంభమైంది. రెండో విడత కౌన్సెలింగ్‌ అనంతరం మిగిలిన సీట్ల భర్తీకి మూడో విడత కౌన్సెలింగ్‌‌లో భాగంగా వెబ్‌ఆప్షన్ల (Web Options) నమోదుకు అవకాశం కల్పించారు.
వెబ్‌ఆప్షన్ల నమోదు కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP New CS: ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
Numaish: ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్, అసలు నిజాలు చెప్పిన పోలీసులుగవాస్కర్ కాళ్లు మొక్కిన నితీష్ తండ్రి..  ఎమోషనల్ వీడియోసెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP New CS: ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
Numaish: ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
Fake Calls: ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!
ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!
New Year Celebrations: హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
Boxing Day Test Updates: భారత్ నెగ్గాలంటే ఎంసీజీ రికార్డు బద్దలవ్వాల్సిందే - 96 ఏళ్ల కిందట టార్గెట్ ఛేదన, ఆసీస్ ఇన్నింగ్స్ ఎందుకు డిక్లేర్ చేయలేదు!
భారత్ నెగ్గాలంటే ఎంసీజీ రికార్డు బద్దలవ్వాల్సిందే - 96 ఏళ్ల కిందట టార్గెట్ ఛేదన, ఆసీస్ ఇన్నింగ్స్ ఎందుకు డిక్లేర్ చేయలేదు!
Borewell Deaths: పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
Embed widget