అన్వేషించండి

YSRUHS: బీఎస్సీ నర్సింగ్ ప్రవేశాలకు వెబ్ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభం, ఎప్పటివరకు అవకాశమంటే?

BSc Nursing Admissions: విజయవాడలోని డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య వర్సిటీ రాష్ట్రంలోని నర్సింగ్‌ కళాశాలల్లో బీఎస్సీ నర్సింగ్‌ కోర్సులో ప్రవేశానికి మూడో విడత వెబ్ ఆప్షన్ల ప్రక్రియ నవంబరు 21న ప్రారంభించింది.

YSRUHS BSc Nursing Admissions: విజయవాడలోని డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి రాష్ట్రంలోని నర్సింగ్‌ కళాశాలల్లో బీఎస్సీ నర్సింగ్‌ (BSc Nursing) కోర్సుల్లో ప్రవేశానికి మూడో విడత కౌన్సెలింగ్ ప్రక్రియ నవంబరు 21న ప్రారంభమైంది. రెండో విడత కౌన్సెలింగ్‌ అనంతరం మిగిలిన సీట్ల భర్తీకి మూడో విడత కౌన్సెలింగ్‌‌లో భాగంగా వెబ్‌ఆప్షన్ల (Web Options) నమోదుకు అవకాశం కల్పించారు. అర్హత కల్గిన అభ్యర్థులు నవంబరు 21న ఉదయం 10 గంటల నుంచి నవంబరు 23న సాయంత్రం 5 గంటల వరకు ఆప్షన్లు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రంలో కొత్తగా అనుమతులు వచ్చిన 9 నర్సింగ్‌ కళాశాలల్లో అందుబాటులో ఉన్న 270 సీట్లతో పాటు రెండో విడత కౌన్సెలింగ్‌ అనంతరం భర్తీ కాని దాదాపు రెండు వేలు పైచిలుకు సీట్లను కలిపి మూడో విడత వెబ్‌ ఆథారిత కౌన్సెలింగ్‌లో భర్తీ చేయనున్నారు. 

 గరిష్ఠంగా ఒక్కో అభ్యర్థి ఎన్ని ఆప్షన్లు అయిన నమోదుచేసుకోవచ్చు. ఎలాంటి అవధి లేదు. సీట్లు పొందిన విద్యార్థులు నిర్ణీత గడువులోగా ఫీజు చెల్లించి సంబంధిత కళాశాలలో చేరాల్సి ఉంటుంది. ఒకవేళ చేరని పక్షంలో సీటు కేటాయించరు. రెండు విడతల కౌన్సెలింగ్ తర్వాత మిగిలిపోయిన సీట్ల భర్తీకి తుది విడత కౌన్సెలింగ్ నిర్వహించే అవకాశం ఉంది. మొదటి విడత కౌన్సెలింగ్‌లో భర్తీ కాని 987 సీట్లు, సీటు కేటాయించినా.. చేరని విద్యార్థుల 2,578 సీట్లు, కొత్తగా అనుమతులు వచ్చిన 14 నర్సింగ్ కళాశాలల్లోని 390 సీట్లు కలిపి మొత్తం 3955 సీట్లకు రెండో విడత వెబ్ ఆధారిత కౌన్సెలింగ్ నిర్వహించారు, రెండో విడత కౌన్సెలింగ్ అనంతరం దాదాపు రెండు వేల సీట్లు మిగిలిపోయాయి. ఇప్పుడు మిగిలిపోయిన సీట్లతోపాటు కొత్తగా మంజూరైన 9 నర్సింగ్‌ కళాశాలల్లో 270 సీట్లను భర్తీచేయనున్నారు.

2023-24 విద్యా సంవత్సరానికి వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలో మొత్తం 211 నర్సింగ్ కళాశాలు ఉండగా.. వాటిలో మొత్తం 7,158 బీఎస్సీ నర్సింగ్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే 8978780501 , 7997710168, 9391805238, 9391805239 ఫోన్ నెంబర్లలో, టెక్నికల్ సమస్యల కోసం 7416563063,7416253073, 7013540128 ఫోన్ నెంబర్లలో సంప్రదించవచ్చు.

వివరాలు...

➥ బీఎస్సీ నర్సింగ్ 

కోర్సు వ్యవధి: 4 సంవత్సరాలు

అర్హతలు: ఏపీఈఏపీ సెట్ 2023 ఉత్తీర్ణత ఉండాలి. 

వయోపరిమితి: 31.12.2023 నాటికి 17 సంవత్సరాలు నిండి ఉండాలి.

దరఖాస్తు ఫీజు: కౌన్సెలింగ్‌లో పాల్గొనే అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.2360 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ.1888 చెల్లించాల్సి ఉంటుంది.

BSc (Nursing) Notification

బీఎస్సీ నర్సింగ్ వెబ్ ఆప్షన్ల నమోదుకోసం క్లిక్ చేయండి.. 

ALSO READ:

నిట్‌ వరంగల్‌లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌ - దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ డిసెంబర్‌-2023 సెషన్‌కు సంబంధించి పీహెచ్‌డీ (PhD) ఫుల్‌టైమ్/పార్ట్‌టైమ్ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా ఇంజినీరింగ్ (సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్, కెమికల్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్) విభాగాలతోపాటు  బయోటెక్నాలజీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్, స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ విభాగాల్లో పీహెచ్‌డీ ప్రవేశాలు కల్పించనున్నారు.
పీహెచ్‌డీ ప్రవేశ వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...

టాప్ హెడ్ లైన్స్

Jailer 2 Twitter Review - 'జైలర్ 2' ట్విట్టర్ రివ్యూ: రజనీకాంత్ ట్రేడ్ మార్క్ స్టైల్ సూపర్... మరి సినిమా? అమెరికా ప్రీమియర్స్ టాకేంటి?
'జైలర్ 2' ట్విట్టర్ రివ్యూ: రజనీకాంత్ ట్రేడ్ మార్క్ స్టైల్ సూపర్... మరి సినిమా? అమెరికా ప్రీమియర్స్ టాకేంటి?
AP Sarpanch Elections Schedule: ఏపీలో 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు.. ముఖ్యమైన తేదీలు చెక్ చేసుకోండి
ఏపీలో 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు.. ముఖ్యమైన తేదీలు చెక్ చేసుకోండి
Vangaveeti Radha Joins Jana Sena: జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. విజయవాడ మేయర్ స్థానంపై ఉత్కంఠ
పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. విజయవాడ మేయర్ స్థానంపై ఉత్కంఠ
CM Revanth Reddy: భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి

వీడియోలు

1000-Year History of Bathukamma | వెయ్యేళ్ల చరిత్ర కలిగిన బతుకమ్మ పండుగ.. ఎప్పుడు, ఎలా మొదలైంది?
Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jailer 2 Twitter Review - 'జైలర్ 2' ట్విట్టర్ రివ్యూ: రజనీకాంత్ ట్రేడ్ మార్క్ స్టైల్ సూపర్... మరి సినిమా? అమెరికా ప్రీమియర్స్ టాకేంటి?
'జైలర్ 2' ట్విట్టర్ రివ్యూ: రజనీకాంత్ ట్రేడ్ మార్క్ స్టైల్ సూపర్... మరి సినిమా? అమెరికా ప్రీమియర్స్ టాకేంటి?
AP Sarpanch Elections Schedule: ఏపీలో 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు.. ముఖ్యమైన తేదీలు చెక్ చేసుకోండి
ఏపీలో 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు.. ముఖ్యమైన తేదీలు చెక్ చేసుకోండి
Vangaveeti Radha Joins Jana Sena: జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. విజయవాడ మేయర్ స్థానంపై ఉత్కంఠ
పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. విజయవాడ మేయర్ స్థానంపై ఉత్కంఠ
CM Revanth Reddy: భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
YS Jagan Cases: జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
Dussehra Navratri Day 5 : అమ్మవారికి 5వ రోజు పెట్టాల్సిన నైవేద్యం ఇదే.. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి కోసం పులిహోర, పెసర బూరెలు
అమ్మవారికి 5వ రోజు పెట్టాల్సిన నైవేద్యం ఇదే.. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి కోసం పులిహోర, పెసర బూరెలు
UP Blue Drum Case: మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన!
మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన
మూలా నక్షత్రం రోజు కనకదుర్గమ్మ దర్శనం అందరికీ ఉచితం, ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించనున్న చంద్రబాబు!
మూలా నక్షత్రం రోజు కనకదుర్గమ్మ దర్శనం అందరికీ ఉచితం, ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించనున్న చంద్రబాబు!
Embed widget