TS Inter Results 2022 Live Updates: తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్ విడుదల, మళ్లీ బాలికలే టాప్ - వెంటనే ఇలా చెక్ చేస్కోండి
Telangana Inter Results కి సంబంధించిన లైవ్ అప్ డేట్స్ ఇక్కడ చూడొచ్చు. రిజల్ట్స్ విడుదలయ్యాక telugu.abplive.com వెబ్ సైట్ నుంచి ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
LIVE
Background
Telangana Inter Results 2022: తెలంగాణ విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇంటర్ బోర్డ్ ఎగ్జామ్స్ ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. జూన్ 28న తెలంగాణ ఇంటర్ ఫలితాలు (TS Inter Results 2022) ఉదయం 11 గంటలకు విడుదల అవుతాయి. ఈ మేరకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డ్ కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ ఇటీవల తెలిపారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటర్ ఫలితాలను నేటి ఉదయం పదకొండు గంటలకు విడుదల చేయనున్నారు. తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షల ఫలితాలు ఒకేసారి విడుదల కానున్నాయి. విద్యార్థులు ఫలితాలను telugu.abplive.com, tsbie.cgg.gov.in వెబ్ సైట్స్‌లో చెక్ చేసుకోవచ్చు.
9 లక్షల మంది విద్యార్థుల ఫలితాలు
షెడ్యూల్ ప్రకారం మే 6 నుంచి 23 వరకు తెలంగాణలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్, ఇంటర్ సెంకడ్ ఇయర్ పరీక్షలను మే 7 నుంచి 24వ తేదీ వరకు నిర్వహించారు. ఈ ఏడాది తెలంగాణలో ఇంటర్ పరీక్షలకు మొత్తం 9,07,396 మంది హాజరయ్యారు. ఇందులో ఫస్టియర్ పరీక్షలకు 4,64,626 మంది హాజరు కాగా, సెకండియర్ పరీక్షలు 4,42,768 మంది రాశారు. మొత్తం 1,443 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసి 25 వేల మంది ఇన్విజిలేటర్లు, 150 మంది సిట్టింగ్ స్క్వాడ్, 75 మంది ఫ్లయింగ్ స్క్వాడ్‌లతో పరీక్షలు పటిష్టంగా నిర్వహించారు. తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల చేయనున్నారు.
70 శాతం సిలబస్..
కరోనా వ్యాప్తితో గత రెండేళ్లు తెలంగాణ, ఇంటర్ బోర్డ్ ఎగ్జామ్స్ నిర్వహణకు ఆటంకాలు ఏర్పడ్డాయి. కానీ ఈ ఏడాది పరిస్థితులు అనుకూలించడంతో క్లాసులు ఆలస్యంగా నిర్వహించారు. ఈ సారి 30 శాతం సిలబస్ తగ్గించారు. ఇంటర్ పరీక్షలను కేవలం 70 శాతం సిలబస్ నుంచి నిర్వహించారు. అయితే కరోనా వైరస్ వ్యాప్తి విద్యా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపడంతో ఫలితాలు ఎలా రాబోతున్నాయని విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రుల్లోనూ ఉత్కంఠతో పాటు ఆందోళన నెలకొంది.
గత ఏడాది కరోనా పాస్..
ఏడాది కరోనా నేపథ్యంలో గత ఏడాది ఇంటర్ ఫస్టియర్ పరీక్షా ఫలితాల్లో 49 శాతం మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. పరిస్థితులను అర్థం చేసుకున్న ఇంటర్ బోర్డ్, రాష్ట్ర విద్యాశాఖ చివరకు కనీస మార్కులతో అందరినీ పాస్ చేశారు. ఇలాంటి పరిస్థితి మరోసారి రాకూడదని అధికారులు జాగ్రత్తలు తీసుకుని ఈ ఏడాది పరీక్షలు నిర్వహించారు. ఫలితాలు విడుదలయ్యాక కేవలం 15 రోజుల్లోనే అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నారు. తద్వారా ఇంజనీరింగ్, ఎంబీబీఎస్, ఇతర కోర్సుల్లో ప్రవేశాలకు విద్యార్థులకు ఇబ్బంది తలెత్తకూడదని ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ.. ఫలితాల ప్రకటనపై ఇంత వరకు ఇంటర్‌బోర్డు మాత్రం అధికారికంగా ఎలాంటి తేదీ ప్రకటించలేదు.
ఎల్లుండి తెలంగాణ టెన్త్ ఫలితాలు
ఎల్లుండి(గురువారం) తెలంగాణ పదోతరగతి ఫలితాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేయనున్నారు.
జీడిమెట్ల పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం- 14 లక్షల విలువై ఆస్తి నష్టం
పెయింట్ & కెమికల్స్ కంపెనీలో కెమికల్ ప్రాసెస్ చేస్తుండగా ఒక్కసారిగా మంటలు రావడంతో కంపెనీ తగలపడిపోయిన ఘటన జీడిమెట్ల పారిశ్రామిక వాడలో చోటుచేసుకుంది.
జీడిమెట్ల పారిశ్రామికవాడలో "లక్ష్మి శ్రీనివాస ట్రేడర్స్" అనే పెయింట్ & కెమికల్స్ కంపెనీలో అగ్నిప్రమాదం సంభవించింది. కంపెనీలో పనిచేసే ఇద్దరు కార్మికులు కెమికల్స్ ప్రాసెస్ చేస్తుండగా ఒక్కసారిగా మంటలు రావడంతో పెను ప్రమాదం జరిగింది. అప్రమత్తమైన కార్మికులు అక్కడి నుంచి తప్పించుకోవడంతో పెను ముప్పు తప్పింది.
కంపెనీలోని మిషనరీ, ఇతర సామాగ్రి బూడిదయ్యాయి. పెద్ద ఎత్తున పొగలు రావడంతో స్దానికులు భయపడ్డారు. సమాచారం అందుకున్న ఫైర్ డిపార్ట్‌మెంట్ 2 ఫైర్ ఇంజన్ల సహయంతో మంటలు అదుపులోకి తెచ్చారు. సుమారు 14 లక్షల మేర ఆస్దినష్టం జరిగిందని కంపెనీ ఓనర్ శ్రీనివాస్ తెలిపారు. కంపెనీలో ఎలాంటి సేఫ్టీ పరికరాలు లేకపోవడంతో అగ్ని కీలలు వ్యాపించాయని లేకుంటే వెంటనే మంటలను అదుపులోకి తెచ్చేవారిమని విజయ్ అనే కార్మికుడు తెలిపాడు.
Telangana Inter Results Links: ఇంటర్ రిజల్ట్స్ ఈ లింక్స్ ద్వారా చెక్ చేసుకోండి
తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షల ఫలితాలు ఒకేసారి విడుదల అయ్యాయి. విద్యార్థులు ఫలితాలను telugu.abplive.com, tsbie.cgg.gov.in వెబ్ సైట్స్‌లో చెక్ చేసుకోవచ్చు. కింది లింక్స్ లో కూడా చూడొచ్చు.
Telangana Inter Pass Percentage District wise: ఇంటర్ ఉత్తీర్ణత శాతంలో టాప్ జిల్లాలు ఇవే..
ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో జిల్లాల వారీగా చూస్తే మేడ్చల్ జిల్లా 76 శాతంతో మొదటి స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో హన్మకొండలో 74 శాతం మంది పాసయ్యారు. ఇక సెకండ్ ఇయర్ ఫలితాల్లో మేడ్చల్ 78 శాతంతో తొలిస్థానంలో ఉండగా, రెండో స్థానంలో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా (77 శాతం) ఉంది.
Inter Second Year Results: ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉత్తీర్ణత శాతం ఇలా
ఇంటర్ సెకండ్ ఇయర్ విషయంలో 4,63,370 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 2,95,949 మంది విద్యార్థులు పాసయ్యారు. ఇందులో ఏ గ్రేడ్ సాధించిన వారు 1,59,422 మంది ఉన్నారు. బీ గ్రేడ్ సాధించిన వారు 82,481 మంది ఉన్నారు. మొత్తానికి 67.82 శాతం మంది విద్యార్థులు పాసయ్యారు. అమ్మాయిలు సెకండ్ ఇయర్ లో 2,16,389 మంది పరీక్ష రాయగా.. 1,64,172 మంది (75.86 శాతం) పాసయ్యారు. 2,19,981 మంది పరీక్ష రాయగా.. 1,32,777 మంది (60 శాతం) పాసయ్యారు.