TS ICET: ఐసెట్ తుది విడత సీట్ల కేటాయింపు పూర్తి, 83 కాలేజీల్లో వంద శాతం సీట్లు భర్తీ!
ఎంబీఏ కోర్సులో మొత్తం 21,983 సీట్లు భర్తీ కాగా, ఎంసీఏ కోర్సులో 2865 సీట్లు భర్తీ అయ్యాయి. ఎంసీఏ సీట్లు వంద శాతం భర్తీకాగా ఎంబీఏ సీట్లు మాత్రం 2295 సీట్లు మిగిలాయి.
టీఎస్ ఐసెట్ తుది విడత సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయ్యింది. ఎంబీఏ కోర్సులో మొత్తం 21,983 సీట్లు భర్తీ కాగా, ఎంసీఏ కోర్సులో 2865 సీట్లు భర్తీ అయ్యాయి. ఎంసీఏ సీట్లు వంద శాతం భర్తీకాగా ఎంబీఏ సీట్లు మాత్రం 2295 సీట్లు మిగిలాయి. 83 కాలేజీల్లో వంద శాతం సీట్లు నిండాయి. అందులో 15 యూనివర్సిటీలు ఉండగా, 68 ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం 254 ఎంబీఏ కాలేజీల్లోని 24278 సీట్లల్లో 21983 సీట్లు భర్తీ అయ్యాయి. 48 ఎంసీఏ కాలేజీల్లోని 2865 సీట్లల్లో వంద శాతం నిండాయి. ఈనెల 31వ తేదీ వరరు సీటు పొందిన అభ్యర్థులు కాలేజీల్లో రిపోర్ట్ చేయాలని అధికారులు తెలిపారు.
కళాశాలలవారీగా సీట్ల కేటాయింపు వివరాల కోసం క్లిక్ చేయండి..
ఈ ఏడాది జులై 27, 28 తేదీల్లో మొత్తం నాలుగు సెషన్లలో ఐసెట్-2022 పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. పరీక్ష కోసం తెలంగాణలో 62, ఆంధ్రప్రదేశ్‌లో 4 మొత్తంగా 66 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పర్యవేక్షణ కోసం 66 మంది చీఫ్ సూపరింటెండెంట్లను, 75 మంది అబ్జర్వర్లను నియమించి వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీ పరీక్షలు నిర్వహించింది.
ఈ పరీక్ష రాసేందుకు తెలంగాణ, ఏపీల్లో కలిపి 90.56 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. పరీక్ష కోసం 75,952 మంది దరఖాస్తు చేసుకోగా 68,781 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 7,171 మంది పరీక్షకు గైర్హాజరయ్యారు. ఐసెట్ పరీక్షకు సంబంధించిన ఆన్సర్ కీని ఆగస్టు 4న విడుదల చేశారు. ఆన్సర్ కీపై ఆగస్టు 8 వరకు అభ్యంతరాలు స్వీకరించారు. తాజాగా ఆగస్టు 27న ఫలితాలను వెల్లడించారు. ఫలితాల్లో 61,613 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఐసెట్ ప్రవేశ పరీక్షలు 89.58 శాతం ఉత్తీర్ణత సాధించారు.
:: ఇవీ చదవండి ::
CAT 2022 Admit Card: 'క్యాట్-2022' అడ్మిట్ కార్డు వచ్చేసింది! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) బెంగళూరు క్యాట్-2022 నవంబరు పరీక్ష హాల్‌టికెట్లను అక్టోబరు 27న సాయంత్రం 5 గంటలకు విడుదల చేసింది. క్యాట్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నవారు తమ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. విద్యార్థులు తమ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. షెడ్యూలు ప్రకారం నవంబరు 27న CAT 2022 పరీక్ష నిర్వహించునున్నారు.
పరీక్ష విధానం, అడ్మిట్ కార్డు లింక్ కోసం క్లిక్ చేయండి..
DOST Counselling: 'దోస్త్' స్పెషల్ కౌన్సెలింగ్, డిగ్రీలో చేరేందుకు మరో అవకాశం!
ఇంజినీరింగ్‌లో సీట్లు పొందలేని వారి కోసం డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ స్పెషల్ డ్రైవ్ ఫేజ్ షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. అక్టోబరు 25 నుంచి అడ్మిషన్ల కౌన్సిలింగ్ ప్రారంభం కానుంది. డిగ్రీ కోర్సుల్లో మొత్తం 4 లక్షలకు పైగా సీట్లుండగా.. ఇప్పటి వరకు 1.5 లక్షల సీట్లు మాత్రమే నిండాయి. మిగిలిన సీట్లను ఈ విడతలో భర్తీచేయనున్నారు. ఇప్పటివరకు దోస్త్ రిజిస్ట్రేషన్ చేసుకోని విద్యార్థులు రూ.400 చెల్లించి తమ పేరు నమోదుచేసుకోవాల్సి ఉంటుంది.
ప్రవేశాలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
AISSEE-2023: సైనిక పాఠశాలల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ - పరీక్ష, ఎంపిక వివరాలు ఇలా!
దేశంలోని సైనిక పాఠశాలల్లో 2023-2024 విద్యా సంవత్సర ప్రవేశాల కోసం 'అఖిల భారత సైనిక పాఠశాలల ప్రవేశ పరీక్ష (AISSEE-2023)' నోటిఫికేషన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. దీనిద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 33 సైనిక పాఠశాలల్లో 6, 9వ తరగతుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఎన్‌జీవోలు/ ప్రైవేట్ పాఠశాలలు/ రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో పనిచేసే 18 కొత్త సైనిక పాఠశాలలకు రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఈ పాఠశాలల్లోనూ 6 తరగతి ప్రవేశాలు ఏఐఎస్‌ఎస్‌ఈఈ-2023 ద్వారా జరుగుతాయి.
ప్రవేశ ప్రకటన, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..