అన్వేషించండి

TS EDCET: టీఎస్ ఎడ్‌సెట్‌-2024 షెడ్యూలు విడుద‌ల‌, పరీక్ష ఎప్పుడంటే?

తెలంగాణలోని బీఎడ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే 'టీఎస్ ఎడ్‌సెట్-2024' ప్రవేశ ప‌రీక్ష షెడ్యూలును ఎడ్‌సెట్ క‌న్వీన‌ర్ ప్రొఫెస‌ర్ టీ మృణాళిని ఫిబ్రవరి 10న ఎడ్‌సెట్ షెడ్యూలును విడుదల చేశారు.

Telangana EDCET 2024 Schedule: తెలంగాణలోని బీఎడ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే 'టీఎస్ ఎడ్‌సెట్-2024' ప్రవేశ ప‌రీక్ష షెడ్యూలు విడుద‌లైంది. ఎడ్‌సెట్ క‌న్వీన‌ర్ ప్రొఫెస‌ర్ టీ మృణాళిని ఫిబ్రవరి 10న ఎడ్‌సెట్ షెడ్యూలును విడుదల చేశారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మార్చి 4న టీఎస్ ఎడ్‌సెట్‌-2024 నోటిఫికేష‌న్‌ విడుద‌ల చేయ‌నున్నట్లు ఆమె వెల్లడించారు. ఎడ్‌సెట్ పరీక్ష కోసం మార్చి 6 నుంచి ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తుల‌ు స్వీక‌రించ‌నున్నారు. అభ్యర్థులు ఎలాంటి ఆల‌స్య రుసుం లేకుండా మే 6 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తుల‌ను స‌మ‌ర్పించవచ్చు. ఇక ఆల‌స్య రుసుంతో మే 13 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. మే 23న కంప్యూట‌ర్ బేస్డ్ విధానంలో రాత‌ప‌రీక్ష నిర్వహించనున్నారు. ఉద‌యం 10 నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు, మ‌ధ్యాహ్నం 2 గంట‌ల నుంచి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు రెండు విడ‌త‌ల్లో రాత‌ప‌రీక్ష నిర్వహించనున్నారు.

టీఎస్ ఎడ్‌సెట్ 2024 షెడ్యూలు..

➥ ఫిబ్రవరి 10న ఎడ్‌సెట్ షెడ్యూలు ప్రకటన

➥ మార్చి 4న టీఎస్ ఎడ్‌సెట్‌-2024 నోటిఫికేష‌న్‌

➥ మార్చి 6 నుంచి ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తుల‌ స్వీక‌రణ

➥ మే 6 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తుల‌ స్వీకరణకు అవకాశం

➥ ఆల‌స్య రుసుంతో మే 13 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అవకాశం.

➥ మే 23న కంప్యూట‌ర్ బేస్డ్ విధానంలో రాత‌ప‌రీక్ష నిర్వహణ.

పరీక్ష సమయం:  ఉద‌యం 10 నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు, మ‌ధ్యాహ్నం 2 గంట‌ల నుంచి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు

ఈసెట్ షెడ్యూలు విడుదల..
బీటెక్‌ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ ప్రవేశాల కోసం నిర్వహించే 'టీఎస్‌ ఈసెట్‌' షెడ్యూలును ఉన్నత విద్యామండలి ఫిబ్రవరి 9న విడుదల చేసింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. ఫిబ్రవరి 14న ఈసెట్ నోటిఫికేషన్‌ విడుదల కానుంది. ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 16 వరకు దరఖాస్తుల స్వీకరించనున్నారు. ఆలస్యరుసుముతో ఏప్రిల్ 28 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఏప్రిల్ 24 నుంచి 28 వరకు దరఖాస్తుల్లో తప్పులుంటే సరిచేసుకునేందుకు అవకాశం ఇచ్చారు.  మే 6న టీఎస్ ఈ సెట్ పరీక్ష నిర్వహించనున్నారు.

లాసెట్ షెడ్యూల్ విడుద‌ల‌..
తెలంగాణలోని న్యాయకళాశాలల్లో మూడేళ్లు, ఐదేళ్ల లా డిగ్రీ(ఎల్‌ఎల్‌బీ)తో పాటు పీజీ లా (ఎల్‌ఎల్‌ఎం) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్‌లాసెట్, పీజీఎల్‌సెట్ షెడ్యూలును ఉన్నత విద్యామండలి ఫిబ్రవరి 9న విడుదల చేసింది. ప్రాథమిక సమాచారం మేరకు ఫిబ్రవరి 28న లాసెట్/పీజీఎల్‌సెట్ నోటిఫికేషన్‌ విడుదల కానుంది. మార్చి 1 నుంచి ఏప్రిల్ 15 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆల‌స్య రుసుంతో మే 25 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తుల‌ు సమర్పించవచ్చు. తెలంగాణలోని న్యాయకళాశాలల్లో మూడేళ్లు, ఐదేళ్ల లా డిగ్రీ(ఎల్‌ఎల్‌బీ)తో పాటు పీజీ లా (ఎల్‌ఎల్‌ఎం) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్‌లాసెట్, పీజీఎల్‌సెట్ షెడ్యూలును ఉన్నత విద్యామండలి ఫిబ్రవరి 9న విడుదల చేసింది. ప్రాథమిక సమాచారం మేరకు ఫిబ్రవరి 28న లాసెట్/పీజీఎల్‌సెట్ నోటిఫికేషన్‌ విడుదల కానుంది. మార్చి 1 నుంచి ఏప్రిల్ 15 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆల‌స్య రుసుంతో మే 25 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తుల‌ు సమర్పించవచ్చు.

ఇతర ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూలు ఇలా..

➥ టీఎస్ ఈఏపీసెట్ నోటిఫికేషన్  ఫిబ్రవరి 21న వెలువడనుంది. ఫిబ్రవరి 26 నుంచి ఏప్రిల్ 6 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. మే 9 నుంచి 12 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. మే 9 నుంచి 11 వరకు ఎంసెట్ ఇంజినీరింగ్ కోర్సుల‌కు ఎంట్రెన్స్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. అలాగే మే 12న అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ ప్రవేశ పరీక్ష జరగనుంది. 

➥ ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్దేశించిన 'టీఎస్ ఐసెట్' ప్రవేశ పరీక్షను జూన్ 4, 5 తేదీల్లో నిర్వహించ‌నున్నారు. కాకతీయ యూనివర్సిటీ నిర్వహణలో ఈ కామన్ ఎంట్రెన్స్ టెస్టు జర‌గ‌నుంది. 

➥ బీపీఎడ్, డీపీఎడ్ కోర్సుల్లో ప్రవేశాల‌కు నిర్వహించే 'టీఎస్ పీఈసెట్' ప‌రీక్షను జూన్ 10 నుంచి 13 మ‌ధ్య నిర్వహించ‌నున్నారు. శాతవాహ‌న యూనివ‌ర్సిటీ పరీక్ష నిర్వహణ బాధ్యతలు చేపట్టింది. 

➥ ఎంటెక్, ఎంఫార్మసీ కోర్సుల్లో ప్రవేశం కోసం ఉద్దేశించిన టీఎస్ పీజీఈసెట్ పరీక్ష జూన్ 6 నుంచి 8 వరకు నిర్వహించ‌నున్నారు. హైదరాబాద్ జేఎన్టీయూ పరీక్ష నిర్వహించనుంది.

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Russia Ukraine War: ట్విన్ టవర్స్ పై అల్‌ఖైదా దాడుల తరహాలో విరుచుకుపడ్డ ఉక్రెయిన్ -రష్యాలో భారీ బిల్డింగులపై ఎటాక్ - వీడియో
ట్విన్ టవర్స్ పై అల్‌ఖైదా దాడుల తరహాలో విరుచుకుపడ్డ ఉక్రెయిన్ -రష్యాలో భారీ బిల్డింగులపై ఎటాక్ - వీడియో
Vizag Human Trafficking Case: విశాఖలో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ముఠా గుట్టురట్టు, 11 మంది బాలికలకు విముక్తి
విశాఖలో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ముఠా గుట్టురట్టు, 11 మంది బాలికలకు విముక్తి
Asifabad Student Dies: ఆసిఫాబాద్ జిల్లాలో మరో హాస్టల్ విద్యార్థిని మృతి, ఆ తల్లి కన్నీళ్లకు బదులిచ్చేది ఎవరు?
ఆసిఫాబాద్ జిల్లాలో మరో హాస్టల్ విద్యార్థిని మృతి, ఆ తల్లి కన్నీళ్లకు బదులిచ్చేది ఎవరు?
Earthquake In Prakasam: 5 తీవ్రతతో ప్రకాశం జిల్లాలో భూకంపం- పరుగులు పెట్టిన జనం
5 తీవ్రతతో ప్రకాశం జిల్లాలో భూకంపం- పరుగులు పెట్టిన జనం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

హైటెక్ సిటీలో పేలుడు, సాఫ్ట్ వేర్ ఉద్యోగులు పరుగో పరుగుAmbani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Russia Ukraine War: ట్విన్ టవర్స్ పై అల్‌ఖైదా దాడుల తరహాలో విరుచుకుపడ్డ ఉక్రెయిన్ -రష్యాలో భారీ బిల్డింగులపై ఎటాక్ - వీడియో
ట్విన్ టవర్స్ పై అల్‌ఖైదా దాడుల తరహాలో విరుచుకుపడ్డ ఉక్రెయిన్ -రష్యాలో భారీ బిల్డింగులపై ఎటాక్ - వీడియో
Vizag Human Trafficking Case: విశాఖలో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ముఠా గుట్టురట్టు, 11 మంది బాలికలకు విముక్తి
విశాఖలో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ముఠా గుట్టురట్టు, 11 మంది బాలికలకు విముక్తి
Asifabad Student Dies: ఆసిఫాబాద్ జిల్లాలో మరో హాస్టల్ విద్యార్థిని మృతి, ఆ తల్లి కన్నీళ్లకు బదులిచ్చేది ఎవరు?
ఆసిఫాబాద్ జిల్లాలో మరో హాస్టల్ విద్యార్థిని మృతి, ఆ తల్లి కన్నీళ్లకు బదులిచ్చేది ఎవరు?
Earthquake In Prakasam: 5 తీవ్రతతో ప్రకాశం జిల్లాలో భూకంపం- పరుగులు పెట్టిన జనం
5 తీవ్రతతో ప్రకాశం జిల్లాలో భూకంపం- పరుగులు పెట్టిన జనం
Agriculture: వ్యవ'సాయం' చేస్తాం, దేశానికి తిండి పెడతాం - తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న రైతుల సంఖ్య
వ్యవ'సాయం' చేస్తాం, దేశానికి తిండి పెడతాం - తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న రైతుల సంఖ్య
Pawan Kalyan Request: నేను మీసం తిప్పితే మీకు రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
నేను మీసం తిప్పితే రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
Virat Kohli News: వారం రోజుల్లో తప్పు సరిదిద్దుకో- కోహ్లీకి నోటీసులు
వారం రోజుల్లో తప్పు సరిదిద్దుకో- కోహ్లీకి నోటీసులు
Coimbatore : రూ.1, రూ.2 నాణేలతో భార్యకు భరణం-షాకైన కోర్టు, ఆ తర్వాతేమైందంటే..
రూ.1, రూ.2 నాణేలతో భార్యకు భరణం-షాకైన కోర్టు, ఆ తర్వాతేమైందంటే..
Embed widget