TS EAMCET 2022 Toppers: తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో టాపర్లు వీరే!
ఎంసెట్ పరీక్షలో ఏపీ విద్యార్థులు సత్తాచాటారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్-మెడిసిన్ రెండు విభాగాల్లోనూ టాప్-5లో నలుగురు ఏపీకి చెందినవారే ఉండటం విశేషం.
తెలంగాణ ఎంసెట్-2022 పరీక్ష ఫలితాలు ఆగస్టు 12న వెలువడ్డాయి. మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను వెల్లడించారు. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. ఎంసెట్ ఇంజినీరింగ్ స్ట్రీమ్‌లో 80.41 శాతం, అగ్రికల్చర్ స్ట్రీమ్‌లో 88.34 శాతం ఉత్తీర్ణులయ్యారు. తెలంగాణ ఎంసెట్ పరీక్షలో ఏపీ విద్యార్థులు సత్తాచాటారు. ఇంజినీరింగ్, మెడికల్ రెండు విభాగాల్లోనూ టాప్-5లో నలుగురు ఏపీకి చెందినవారే ఉండటం విశేషం.
తెలంగాణ ఎంసెట్ -2022 ఫలితాల కోసం క్లిక్ చేయండి..
ఇంజినీరింగ్ విభాగంలో టాప్-5 ర్యాంకర్లు..
మొదటి ర్యాంకు: పోలు లక్ష్మీసాయి లోహిత్ రెడ్డి - ఖానామెట్, హైదరాబాద్.
రెండో ర్యాంకు: నక్కా సాయిదీప్తిక- రేగిడి ఆమదాలవలస, శ్రీకాకుళం.
మూడో ర్యాంకు: పొలిశెట్టి కార్తికేయ- తెనాలి, గుంటూరు
నాలుగో ర్యాంకు: పల్లి జలజాక్షి - సంతబొమ్మాళి, శ్రీకాకుళం.
ఐదో ర్యాంకు: మెండ హిమవంశీ - బలగ, శ్రీకాకుళం.
అగ్రికల్చర్ విభాగంలో టాప్-5 ర్యాంకర్లు..
మొదటి ర్యాంకు: జూటూరి నేహ - తెనాలి, గుంటూరు.
రెండో ర్యాంకు: వంటకు రోహిత్ - కోటపాడు, విశాఖపట్నం.
మూడో ర్యాంకు: కల్లం తరుణ్ కుమార్ రెడ్డి- కొమెరపూడి, గుంటూరు.
నాలుగో ర్యాంకు: కొత్తపల్లి మహి అంజన్ - కూకట్‌పల్లి.
ఐదో ర్యాంకు: గుంటుపల్లి శ్రీరామ్- బృందావన్ గార్డెన్స్, గుంటూరు.
Also Read: తెలంగాణ ఈసెట్-2020 ఫలితాల కోసం క్లిక్ చేయండి..
రాష్ట్రంలోని వివిధ ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలకు జులై 18 నుంచి 20 వరకు ఎంసెట్ ఇంజినీరింగ్ విభాగాలకు, అదేవిధంగా జులై 30, 31 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్షలను నిర్వహించిన సంగతి తెలిసిందే. మూడు రోజుల్లో రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించారు. ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షకు సంబంధించి మొత్తం 1,72,243 మంది విద్యార్థులు ఎంసెట్ ఎగ్జామ్ కోసం దరఖాస్తు చేసుకోగా, కేవలం 1,56,812 మంది మాత్రమే హాజరయ్యారు. 9 శాతం విద్యార్థులు పరీక్ష రాయలేదు. ఇక ఎంసెట్ మెడికల్ విభాగానికి మొత్తం 94,476 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. 80,575 (85.3 శాతం) మంది పరీక్షకు హాజరయ్యారు.
ఇప్పటికే ఎంసెట్-2022 పరీక్షకు సంబంధించి ప్రిలిమినరీ కీలను అధికారులు విడుదల చేశారు. కీపై విద్యార్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరించారు. తుది సమాధానాలతో పాటు ఫలితాలను ఎంసెట్ కమిటీ విశ్లేషించి, ఆగస్టు 12న ఫలితాలను విడుదలచేశారు.
వాస్తవానికి ఎంసెట్ పరీక్ష జులై 14, 15 తేదీల్లో నిర్వహించాల్సి ఉండగా.. భారీ వర్షాల కారణంగా జులై 18 నుంచి 20 వరకు రెండు విడతలుగా పరీక్షలను నిర్వహించిన విషయం తెలిసిందే. ఫలితాలు విడుదలైన అనంతరం మొదటి విడత కౌన్సెలింగ్ నిర్వహించే అవకాశం ఉంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఆన్‌లైన్‌లో ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. సర్టిఫికేట్ల వేరిఫికేషన్ అనంతరం వెబ్ ఆఫ్షన్లు ఇస్తారు. అనంతరం సీట్ల కేటాయింపు ఉండనుంది.
ఫలితాల విడుదల అనంతరం అభ్యర్థులు తమ ఫలితాలను ఇలా చెక్ చేసుకోవచ్చు..
Step 1: అభ్యర్థులు మొదటగా https://eamcet.tsche.ac.in/ వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి.
Step 2: అనంతరం హోం పేజీలో EAMCET Results 2022 సంబంధించిన లింక్ కనిపిస్తుంది. ఆ లింక్ పై క్లిక్ చేయాలి.
Step 3: అనంతరం కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఆ పేజీలో అభ్యర్థులు హాల్ టికెట్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ నమోదు చేసి SUBMIT పై క్లిక్ చేయాలి.
Step 4: తర్వాత మీ రిజల్ట్ స్క్రీన్ పై కనిపిస్తుంది. ఆ కాపీని ప్రింట్ తీసుకుని భవిష్యత్ అవసరాల కోసం భద్రపరుచుకోవాలి.