అన్వేషించండి

TGICET 2024: ఐసెట్ ధ్రువపత్రాల పరిశీలన ప్రారంభం, వెబ్‌ఆప్షన్ల నమోదు ఎప్పటినుంచంటే?

TGICET 2024: టీజీఐసెట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ సెప్టెంబరు 3న ప్రారంభమైంది. సహాయక కేంద్రాల్లో సెప్టెంబరు 9 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు.

TGICET 2024 Counselling: తెలంగాణలోని పీజీ కళాశాలల్లో ఎంబీఏ, ఎంసీఏ సీట్ల భర్తీకి సంబంధించిన కౌన్సెలింగ్ ప్రక్రియ సెప్టెంబరు 1న ప్రారంభమైన సంగతి తెలిసిందే. అభ్యర్థులు సెప్టెంబరు 8 వరకు నిర్ణీత ఫీజు చెల్లించి స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజు కింద అభ్యర్థులు రూ1200 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.600 చెల్లిస్తే సరిపోతుంది. అయితే ఇప్పటికే రిజిస్ట్రేషన్ పూర్తిచేసుకున్నవారికి సెప్టెంబరు 3న ధ్రువపత్రాల పరిశీలన ప్రారంభమైంది. స్పెషల్ కేటగిరీ (క్యాప్, స్పోర్ట్స్, ఎన్‌సీసీ, పీహెచ్‌సీ, ఆంగ్లో ఇండియన్) అభ్యర్థులకు హైదరాబాద్, మాసబ్ ట్యాంక్‌ వద్ద ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. మిగతా అభ్యర్థులు తమకు సమీపంలోని సహాయక కేంద్రాల్లో సెప్టెంబరు 9 వరకు ధ్రువపత్రాల పరిశీలన చేయించుకోవచ్చు.

సర్టిఫికేట్ వెరిఫికేషన్ కేంద్రాలు..

Website

మొత్తం 39,791 ఎంబీఏ, ఎంసీఏ సీట్లు..
తెలంగాణలోని ఎంబీఏ, ఎంసీఏ కళాశాలల్లో మొత్తం 39,791 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో 264 ఎంబీఏ కళాశాలల్లో 33,629 సీట్లు ఉన్నాయి. వీటిలో కన్వీనర్ కోటా కింద 23,989 సీట్లున్నాయి. ఇక 65 ఎంసీఏ కళాశాలల్లో మొత్తం 6,162 సీట్లు ఉండగా... ఇందులో కన్వీనర్ కోటా కింద 4,583 సీట్లు ఉన్నాయి. కన్వీనర్ కోటా సీట్లను కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేయనున్నారు. మిగతా సీట్లను స్పాట్ కౌన్సెలింగ్, యాజమాన్య కోటా కింద భర్తీచేస్తారు.

తెలంగాణ ఐసెట్‌ 2024 తొలి విడత కౌన్సెలింగ్ షెడ్యూల్‌..
➥ ఫీజు చెల్లింపు, స్లాట్‌ బుకింగ్‌: 01.09.2024 - 08.09.2024.
➥ ధ్రువపత్రాల పరిశీలన: 03.09.2024 - 09.09.2024.
➥ వెబ్‌ ఆప్షన్ల నమోదు: 04.09.2024 - 11.09.2024.
➥ వెబ్‌ ఆప్షన్ల ఫ్రీజింగ్: 11.09.2024.
➥ సీట్ల కేటాయింపు: 14.09.2024. 
➥ ట్యూషన్‌ ఫీజు చెల్లింపు, ఆన్‌లైన్‌లో సెల్ఫ్‌ రిపోర్టింగ్‌: 14.09.2024 - 17.09.2024.

తెలంగాణ ఐసెట్‌ 2024 తుది విడత కౌన్సెలింగ్ షెడ్యూల్‌..
➥ ఫీజు చెల్లింపు, స్లాట్‌ బుకింగ్‌: 20.09.2024.
➥ ధ్రువపత్రాల పరిశీలన: 21.09.2024. 
➥ వెబ్‌ ఆప్షన్ల నమోదు: 21.09.2024 - 22.09.2024.
➥ వెబ్‌ ఆప్షన్ల ఫ్రీజింగ్: 22.09.2024.
➥ సీట్ల కేటాయింపు: 25.09.2024. 
➥ ట్యూషన్‌ ఫీజు చెల్లింపు, ఆన్‌లైన్‌లో సెల్ఫ్‌ రిపోర్టింగ్‌: 25.09.2024 - 27.09.2024.
➥ సంబంధిత కళాశాలలో చేరడానికి అవకాశం: 25.09.2024 - 28.09.2024.
➥ మిగిలిపోయిన సీట్ల భర్తీకి స్పాట్ కౌన్సెలింగ్: 27.09.2024. 

సర్టిఫికేట్ల పరిశీలనకు ఈ డాక్యుమెంట్లు అవసరం..
✦  ఐసెట్-2024 ర్యాంకు కార్డు
✦  ఐసెట్-2024 హాల్‌టికెట్
✦  ఆధార్ కార్డు
✦  పదోతరగతి లేదా తత్సమాన మార్కుల మెమో
✦  ఇంటర్ లేదా తత్సమాన మార్కుల మెమో కమ్ పాస్ సర్టిఫికేట్
✦  డిగ్రీ మార్కుల మెమో, ప్రొవిజినల్ సర్టిఫికేట్
✦  9వ తరగతి నుంచి డిగ్రీ వరకు స్టడీ, బోనఫైడ్ సర్టిఫికేట్లు
✦  ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ (టీసీ)
✦  ఇన్‌కమ్ సర్టిఫికేట్
✦  ఈడబ్ల్యూఎస్ ఇన్‌కమ్ సర్టిఫికేట్
✦  ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్-క్యాస్ట్ సర్టిఫికేట్(అవసరమైనవారికి)
✦  రెసిడెన్స్ సర్టిఫికేట్
✦  నాన్-లోకల్ సర్టిఫికేట్
✦  రాష్ట్రప్రభుత్వ ఉద్యోగుల పిల్లలైతే, వారి ఎంప్లాయర్ సర్టిఫికేట్
✦  క్యాప్, ఎన్‌సీసీ, స్పోర్ట్స్, ఆంగ్లో ఇండియన్ సర్టిఫికేట్

ఈ ఏడాది జూన్‌ 5, 6 తేదీల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని 116 కేంద్రాల్లో నిర్వహించిన తెలంగాణ ఐసెట్‌ పరీక్ష కోసం మొత్తం 86,156 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 77,942 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 71,647 మంది ఉత్తీర్ణులయ్యారు. ఐసెట్ పరీక్షలో ఉత్తీర్ణత శాతం 91.92 శాతంగా నమోదైంది. పరీక్షలో అర్హత సాధించిన వారికి సెప్టెంబరు 1న కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది.

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Ambati Rambabu Vs Revanth Reddy: రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి
రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి "సోఫా" చేరాలంటూ సోషల్ మీడియా పోస్టు 
Kota Coaching Centres: దివాలా తీసిన
దివాలా తీసిన "కోట ఐఐటీ కోచింగ్" ఫ్యాక్టరీ - కామధేనువును చేజేతులా చంపేసుకున్నారు !
Child In Borewell: 68 గంటలుగా బోరుబావిలోనే చిన్నారి - కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్, ర్యాట్ హోల్ మైనర్స్ విధానంలో..
68 గంటలుగా బోరుబావిలోనే చిన్నారి - కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్, ర్యాట్ హోల్ మైనర్స్ విధానంలో..
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులుసునామీ బీభత్సానికి 20 ఏళ్లు, ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్న మత్స్యకారులుఅయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తతగుంతలమయమైన రోడ్లు, డ్రోన్‌లతో వింత నిరసనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Ambati Rambabu Vs Revanth Reddy: రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి
రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి "సోఫా" చేరాలంటూ సోషల్ మీడియా పోస్టు 
Kota Coaching Centres: దివాలా తీసిన
దివాలా తీసిన "కోట ఐఐటీ కోచింగ్" ఫ్యాక్టరీ - కామధేనువును చేజేతులా చంపేసుకున్నారు !
Child In Borewell: 68 గంటలుగా బోరుబావిలోనే చిన్నారి - కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్, ర్యాట్ హోల్ మైనర్స్ విధానంలో..
68 గంటలుగా బోరుబావిలోనే చిన్నారి - కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్, ర్యాట్ హోల్ మైనర్స్ విధానంలో..
Deed Body Parcel Case Update: ఆస్తి కోసమే డెడ్‌బాడీ పార్శిల్‌! నిందితుడు అనుకున్నదొకటి అయిందొకటి! 
ఆస్తి కోసమే డెడ్‌బాడీ పార్శిల్‌! నిందితుడు అనుకున్నదొకటి అయిందొకటి! 
World's Worst Tsunami: ఆ మహా ప్రళయానికి 20 ఏళ్లు -  మానవాళి మరచిపోలేని పీడకల, రాకాసి అలలు మిగిల్చిన కన్నీళ్లు!
ఆ మహా ప్రళయానికి 20 ఏళ్లు - మానవాళి మరచిపోలేని పీడకల, రాకాసి అలలు మిగిల్చిన కన్నీళ్లు!
Boxing Day Test Live Updates: వివాదంలో చిక్కుకున్న కోహ్లీ.. నిషేధమా..? లేక జరిమానా..? ఐసీసీ రూల్ బుక్ ఏం చెబుతోందంటే..?
వివాదంలో చిక్కుకున్న కోహ్లీ.. నిషేధమా..? లేక జరిమానా..? ఐసీసీ రూల్ బుక్ ఏం చెబుతోందంటే..?
Right to Die: గౌరవంగా చనిపోయే హక్కు కల్పించిన మహారాష్ట్ర - దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం !
గౌరవంగా చనిపోయే హక్కు కల్పించిన మహారాష్ట్ర - దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం !
Embed widget