TG B.Arch. 2024 Admissions: బీఆర్క్ ప్రవేశాలకు షెడ్యూలు విడుదల, కౌన్సెలింగ్ ఎప్పటినుంచంటే?
B.Arch. 2024 Admissions: తెలంగాణలో బీఆర్క్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూలును ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఆగస్టు 1 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభంకానుంది.
TG B.ARCH.-2024 ADMISSIONS COUNSELLING: హైదరాబాద్‌లోని 'జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ'తోపాటు.. దాని పరిధిలోని ప్రైవేట్ కళాశాలల్లో అయిదేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్(B.Arch) కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన షెడ్యూలును ఉన్నత విద్యామండలి ప్రకటించింది. దీనిప్రకారం ఆగస్టు 1 నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభంకానుంది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో జులై 24న ఛైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి ఆధ్వర్యంలో సమావేశమైన ప్రవేశాల కమిటీ రెండు విడతల కౌన్సెలింగ్ షెడ్యూలును విడుదలచేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మెన్లు వి వెంకటరమణ, ఎస్‌కే మహమూద్, కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్, ప్రొఫెసర్ పి రమేష్‌బాబు, బీఆర్క్ ప్రవేశాల కన్వీనర్ ఎస్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఆగస్టు 1 నుంచి కౌన్సెలింగ్..
రాష్ట్రంలో బీఆర్క్-2024 ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ జులై 26న విడుదల కానుంది. ఆగస్టు 1 నుంచి 8 తేదీ వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్, ఆన్‌లైన్‌లో ధ్రువపత్రాల అప్‌లోడింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ప్రత్యేక కేటగిరీ (NCC, CAP, PH, స్పోర్ట్స్) అభ్యర్థులకు ఆగస్టు 9న భౌతికంగా ధ్రవపత్రాల పరిశీలన నిర్వహించనున్నారు. అభ్యర్థులకు ఆగస్టు 16న ర్యాంకులను కేటాయిస్తామని తెలిపారు. ఆ తర్వాత ఆగస్టు 17,18 తేదీల్లో వెబ్‌ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించనున్నారు. ఆప్షన్లు నమోదుచేసుకున్న వారికి ఆగస్టు 21న సీట్లను కేటాయిస్తారు. సీట్లు పొందిన అభ్యర్థులు ఆగస్టు 22,23 తేదీల్లో సంబంధిత కాలేజీల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. మొదటి విడత సీట్ల కేటాయింపు తర్వాత మిగిలిపోయిన సీట్ల వివరాలను ఆగస్టు 24న ఆయా కాలేజీలు కన్వీనర్‌కు పంపిస్తాయని వివరించారు.
ఆగస్టు 25 నుంచి రెండోవిడత కౌన్సెలింగ్..
ఇక రెండో విడత ప్రవేశాలకు సంబంధించి ఆగస్టు 25,26 తేదీల్లో వెబ్‌ఆప్షన్లకు అవకాశం కల్పిస్తారు. వీరికి ఆగస్టు 29న సీట్లు కేటాయించనున్నారు. సీట్లు పొందిన అభ్యర్థులు ఆగస్టు 30,31 తేదీల్లో కేటాయించిన కాలేజీల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది.
కౌన్సెలింగ్ ద్వారా 550 సీట్ల భర్తీ..
రాష్ట్రంలో జేఎన్ఏఎఫ్‌ఏయూతోపాటు, 9 ప్రైవేట్ కాలేజీల పరిధిలో మొత్తం 765 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో 550 సీట్లను కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేయనున్నారు. బీఆర్క్ సీట్లలో 85 శాతం సీట్లను కేవలం తెలంగాణ విద్యార్థులతోనే భర్తీచేయనున్నారు. ఇక ఏపీ విద్యార్థులు 15 శాతం అన్ రిజర్వుడ్ కోటా సీట్లకు పోటీపడొచ్చు. నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఆర్కిటెక్చర్(నాటా) స్కోర్‌కు ఇంటర్ మార్కులను కలిపి రాష్ట్ర ర్యాంకులు కేటాయిస్తారు. వాటి ఆధారంగా సీట్లను భర్తీ చేస్తారు. తొలి విడత కౌన్సెలింగ్ ఆగస్టు 23న ముగుస్తుంది. రెండో విడత ఆగస్టు 25 నుంచి ప్రారంభమవుతుంది.
ALSO READ: న్యాయవిద్యకు నాణ్యమైన మార్గం 'క్లాట్', దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం - పరీక్ష ఎప్పుడంటే?
తొలి విడత కౌన్సెలింగ్ షెడ్యూల్..
➥ నోటిఫికేషన్ విడుదల: 26.07.2024.
➥ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, సర్టిఫికేట్ల అప్‌లోడ్: 01.08.2024 - 08.08.2024.
➥ రాష్ట్ర ర్యాంకుల కేటాయింపు: 16.08.2024.
➥ వెబ్‌ఆప్షన్ల నమోదు: 17.08.2024 - 18.08.2024.
➥ సీట్ల కేటాయింపు: 21.08.2024.
➥ ట్యూషన్ ఫీజు చెల్లింపు, సంబంధిత కళాశాలల్లో ధ్రువపత్రాల సమర్పణ: 22.08.2024 - 23.08.2024.
➥ కళాశాలలవారీగా మిగిలిపోయిన సీట్ల వివరాల వెల్లడి: 24.08.2024.
రెండో విడత కౌన్సెలింగ్ షెడ్యూల్..
➥ వెబ్‌ఆప్షన్ల నమోదు: 25.08.2024 - 26.08.2024.
➥ సీట్ల కేటాయింపు: 29.08.2024.
➥ ట్యూషన్ ఫీజు చెల్లింపు, సంబంధిత కళాశాలల్లో ధ్రువపత్రాల సమర్పణ: 30.08.2024 - 31.08.2024.