అన్వేషించండి

TET Notification: తెలంగాణలో నేడు టెట్ నోటిఫికేషన్ విడుదల, జాబ్ క్యాలెండర్ ప్రకారమే పరీక్ష నిర్వహణ!

TGTET: తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష నవంబరు 2024 నోటిఫికేషన్‌ను పాఠశాల విద్యాశాఖ నవంబరు 4న విడుదల చేయనుంది. ఏడాదిలో రెండోసారి టెట్ నోటిఫికేషన్ వెలువడనుంది.

TG TET 2024 Notification: తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TGTET-2024) నోటిఫికేషన్‌ను పాఠశాల విద్యాశాఖ సోమవారం(నవంబరు 4) విడుదల చేయనుంది. టెట్‌ ప్రకటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయిన నేపథ్యంలో నవంబు 4న నోటిఫికేషన్ జారీకానుంది. రాష్ట్రంలో ఇకపై ఏడాదికి రెండుసార్లు టెట్ నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రథమార్ధానికి సంబంధించి మే 20 నుంచి జూన్ 2 వరకు ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించింది. ఇక ద్వితీయార్ధానికి సంబంధించిన నోటిఫికేషన్‌ను నవంబరు 4న విడుదల చేయనుంది. అయితే జనవరిలో పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆగస్టులో విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌లో ప్రభుత్వం పేర్కొంది. 

సంక్రాంతి లోపా? ఆ తర్వాతా?
రాష్ట్రంలో గత మే నెలలో నిర్వహించిన టెట్ పరీక్షలను దాదాపు 2.35 లక్షల మంది హాజరయ్యారు. అందులో 1.09 లక్షల మంది అభ్యర్థులు అర్హత సాధించారు. అయితే డీఎస్సీ పరీక్షల నిర్వహణ కూడా పూర్తవడంతో.. ఈసారి టెట్ పరీక్ష రాసేవారి సంఖ్య స్వల్పంగా తగ్గే అవకాశం ఉంది. ఆన్‌లైన్ విధానంలో టెట్ పరీక్షలు నిర్వహిస్తుండటంతో..  కనీసం వారం పది రోజులపాటు స్లాట్లు దొరకాల్సి ఉంటుంది. దీంతో టెట్ పరీక్షలను సంక్రాంతి లోపా? ఆ తర్వాతా? అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. 

వీరు అర్హులు..
టెట్ అర్హతలకు సంబంధించి.. పేపర్-1కు డీఎడ్, పేపర్-2కు బీఎడ్ పూర్తయి ఉండాలి. వారు మాత్రమే దరఖాస్తుకు అర్హులు. దీంతోపాటు స్కూల్ అసిస్టెంట్‌గా ప్రమోషన్లకు సైతం టెట్ అర్హతను ప్రామాణికంగా నిర్ణయించడంతో.. వేలాది మంది ఇన్ సర్వీస్ టీచర్లు కూడా పరీక్షకు హాజరుకానున్నారు. టెట్ ప్రవేశపెట్టిన నాటి నుంచి ఇప్పటివరకు తొమ్మిది సార్లు పరీక్షలు నిర్వహించగా...జనవరిలో పదోసారి నిర్వహించనున్నారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత గత మే పరీక్షతో కలుపుకొని ఆరుసార్లు పరీక్షలు జరిపారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే రెండోసారి టెట్‌‌ను నిర్వహిస్తుండటం విశేషం.

గత టెట్‌లో..
టెట్-2024కు సంబంధించి మొత్తం 2,86,381 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో పేపర్-1పరీక్షకు 85,996 అభ్యర్థులు హాజరుకాగా.. 57,725 అభ్యర్థులు అర్హత సాధించారు. ఇక పేపర్-2 పరీక్షకు 1,50,491 అభ్యర్థులు హాజరుకాగా.. 51,443 అభ్యర్థులు అర్హత సాధించారు. పేపర్-1లో అర్హత సాధించిన వారు 67.13% అర్హత నమోదుకాగా.. పేపర్-2లో 34.18 శాతం అభ్యర్థులు అర్హత సాధించారు. టెట్-2023 ఫలితాలతో పోల్చితే పేపర్-1లో 30.24 శాతం, పేపర్-2లో 18.88 శాతం అర్హత పెరగడం గమనార్హం.

అభ్యర్థులకు బంపరాఫర్..
టెట్-2024లో అర్హత సాధించలేకపోయిన అభ్యర్థులకు వచ్చే టెట్‌కు ఉచితంగా దరఖాస్తు చేసుకునే వెలుసుబాటును ప్రభుత్వం కల్పించిన సంగతి తెలిసిందే. అదేవిధంగా టెట్-2024లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఒకసారి ఉచితంగా డీఎస్సీ దరఖాస్తు చేసుకునే వెసులుబాటును రేవంత్ సర్కార్ కల్పించింది .

ALSO READ
తెలంగాణలో ఒంటిపూట బడులు, సమ్మర్ కాకున్నా ఇప్పుడు ఎందుకంటే!
తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలకు ఒంటిపూట బడులు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయించింది. నవంబర్ 6 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఒంటి పూట బడులు మొదలుకానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్న సమగ్ర కుటుంబ సర్వే కారణంగా కొన్ని రోజులు తెలంగాణలో ఒంటి పూట బడులు నిర్వహించనున్నారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

JD Vance India Visit: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు కేంద్ర మంత్రి ఘన స్వాగతం- సాయంత్రం మోదీతో విందు, ఢిల్లీలో భద్రత పెంపు
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు కేంద్ర మంత్రి ఘన స్వాగతం- సాయంత్రం మోదీతో విందు, ఢిల్లీలో భద్రత పెంపు
Gollapudi Panchayat: ఏపీలోని గొల్లపూడి పంచాయతీకి జాతీయ అవార్డు, ఈ 24న మోదీ ప్రదానం- పవన్ కళ్యాణ్ వద్దే ఆ శాఖ
ఏపీలోని గొల్లపూడి పంచాయతీకి జాతీయ అవార్డు, ఈ 24న మోదీ ప్రదానం- పవన్ కళ్యాణ్ వద్దే ఆ శాఖ
BCCI Retainership: బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ లిస్ట్‌ విడుదల- అయ్యర్, ఇషాన్ కిషన్‌లకు మళ్లీ కాంట్రాక్ట్
బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ లిస్ట్‌ విడుదల- అయ్యర్, ఇషాన్ కిషన్‌లకు మళ్లీ కాంట్రాక్ట్
KTR News: ఈ ఏడాదిలోనే తెలంగాణలో ఉప ఎన్నికలు: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
ఈ ఏడాదిలోనే తెలంగాణలో ఉప ఎన్నికలు: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rohit Sharma Virat Kohli PoTM IPL 2025 | ఒకే రోజు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లు తీసుకున్న రోహిత్ - విరాట్  | ABP DesaAyush Mhatre Batting | MI vs CSK IPL 2025 మ్యాచ్ ద్వారా పుట్టిన మరో కొత్త స్టార్ ఆయుష్ మాత్రేVirat Kohli vs Shreyas Iyer Controversy | IPL 2025 లో కొత్త శత్రువులుగా విరాట్, శ్రేయస్ అయ్యర్Rohit Sharma 76* vs CSK IPL 2025 | హిట్ మ్యాన్ ఫామ్ లోకి వస్తే ఎలా ఉంటుందో చూపించిన రోహిత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
JD Vance India Visit: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు కేంద్ర మంత్రి ఘన స్వాగతం- సాయంత్రం మోదీతో విందు, ఢిల్లీలో భద్రత పెంపు
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు కేంద్ర మంత్రి ఘన స్వాగతం- సాయంత్రం మోదీతో విందు, ఢిల్లీలో భద్రత పెంపు
Gollapudi Panchayat: ఏపీలోని గొల్లపూడి పంచాయతీకి జాతీయ అవార్డు, ఈ 24న మోదీ ప్రదానం- పవన్ కళ్యాణ్ వద్దే ఆ శాఖ
ఏపీలోని గొల్లపూడి పంచాయతీకి జాతీయ అవార్డు, ఈ 24న మోదీ ప్రదానం- పవన్ కళ్యాణ్ వద్దే ఆ శాఖ
BCCI Retainership: బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ లిస్ట్‌ విడుదల- అయ్యర్, ఇషాన్ కిషన్‌లకు మళ్లీ కాంట్రాక్ట్
బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ లిస్ట్‌ విడుదల- అయ్యర్, ఇషాన్ కిషన్‌లకు మళ్లీ కాంట్రాక్ట్
KTR News: ఈ ఏడాదిలోనే తెలంగాణలో ఉప ఎన్నికలు: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
ఈ ఏడాదిలోనే తెలంగాణలో ఉప ఎన్నికలు: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Dhanush D56 Movie: మరోసారి సూపర్ హిట్ కాంబో రిపీట్ - ధనుష్ కొత్త సినిమాకు రెహమాన్ మ్యూజిక్!
మరోసారి సూపర్ హిట్ కాంబో రిపీట్ - ధనుష్ కొత్త సినిమాకు రెహమాన్ మ్యూజిక్!
AP DSC Notification 2025: గతంలో డీఎస్సీకి అప్లై చేసిన అభ్యర్థులు మళ్లీ ఫీజు చెల్లించాలా.. ఇదిగో క్లారిటీ
గతంలో DSCకి అప్లై చేసిన అభ్యర్థులు మళ్లీ ఫీజు చెల్లించాలా.. ఇదిగో క్లారిటీ
Aishwaryarai Bachchan: ఐశ్వర్య రాయ్, అభిషేక్, ఆరాధ్య.. క్యూట్ ఫ్యామిలీ - విడాకుల రూమర్స్‌కు చెక్ పెట్టేశారుగా!
ఐశ్వర్య రాయ్, అభిషేక్, ఆరాధ్య.. క్యూట్ ఫ్యామిలీ - విడాకుల రూమర్స్‌కు చెక్ పెట్టేశారుగా!
Online Betting Case: వైసీపీ నేతపై ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ కేసు నమోదు, స్పెషల్ టీమ్స్‌ ఏర్పాటు చేసి గాలిస్తున్న పోలీసులు
వైసీపీ నేతపై ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ కేసు నమోదు, స్పెషల్ టీమ్స్‌ ఏర్పాటు చేసి గాలిస్తున్న పోలీసులు
Embed widget