అన్వేషించండి

TS SSC Supply Results: తెలంగాణ 'టెన్త్' అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల, 73.03 శాతం ఉత్తీర్ణత నమోదు

TS 10th Results: తెలంగాణలో పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను జూన్ 28న ప్రకటించారు. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు.

Telangana SSC Supplementary Results 2024: తెలంగాణలో పదోతరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు శుక్రవారం (జూన్ 28) వెలువడ్డాయి. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. విద్యార్థులు తమ రోల్ నెంబరు నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు. పదోతరగతి పబ్లిక్ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు జూన్‌ 3 నుంచి జూన్ 13 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే.

స‌ప్లిమెంట‌రీ ఫ‌లితాల్లో 73.03 శాతం ఉత్తీర్ణత న‌మోదైంది. జూన్ 3 నుంచి 13వ తేదీ వ‌ర‌కు నిర్వహించిన సప్లిమెంటరీ ప‌రీక్షల‌కు మొత్తం 51,272 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా.. వీరిలో 46,731 మంది పరీక్షలకు హాజ‌ర‌య్యారు. వీరిలో 34,126 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలురు 71.01 శాతం, బాలిక‌లు 76.37 శాతం ఉత్తీర్ణత సాధించారు.  బాలుర కంటే బాలిక‌లు 5.36 శాతం అధికంగా ఉత్తీర్ణత కావడం విశేషం. ఫలితాల్లో నిర్మల్ జిల్లా 100 శాతం ఉత్తీర్ణత సాధించి ప్రథ‌మ స్థానంలో నిలిచింది. ఇక వికారాబాద్ జిల్లా 42.14 శాతం ఉత్తీర్ణతతో చివ‌రి స్థానంలో నిలిచింది. 

పదోతరగతి సప్లిమెంటరీ ఫలితాల కోసం క్లిక్ చేయండి..

తెలంగాణలో ఈ ఏడాది పదోతరగతి వార్షిక పరీక్షలను మార్చి 18 నుంచి ఏప్రిల్‌ 2 వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 5,08, 385 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో 2,57,952 మంది బాలురు ఉండగా.. 2,50,433 మంది బాలికలు ఉన్నారు. ఈ పరీక్షల ఫలితాలను ఏప్రిల్ 30న విడుద‌ల చేశారు. ఫలితాలకు సంబంధించి మొత్తం 5,05,813 మంది విద్యార్థులు ప‌రీక్ష‌ల‌కు హాజ‌రు కాగా.. 4,91,862 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 91.31 ఉత్తీర్ణ‌త శాతం న‌మోదైంది. ఇందులో బాలిక‌లు 93.23 శాతం ఉత్తీర్ణ‌ులుకాగా, బాలురు 89.42 శాతం ఉత్తీర్ణ‌త సాధించారు. ఇక 3,927 పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణ‌త న‌మోదు కాగా, ఆరు పాఠశాలల్లో జీరో (సున్నా) ఉత్తీర్ణ‌త శాతం న‌మోదైంది. 

వెబ్‌సైట్‌లో ఏపీ 'టెన్త్' సప్లిమెంటరీ విద్యార్థుల మెమోలు..
ఏపీలో పదోతరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు జూన్‌ 26న సాయంత్రం విడుదలైన సంగతి తెలిసిందే. అధికారిక వెబ్‌సైట్‌లో విద్యార్థుల మార్కుల మెమోలను అందుబాటులో ఉంచారు. ఈ ఏడాది సప్లిమెంటరీ పరీక్షలకు మొత్తం 1,61,877 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా..మొత్తం 67,115 మంది (62.21 శాతం) విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలురు 59.99 శాతం ఉత్తీర్ణులుకాగా.. బాలికలు 65.96 శాతం ఉత్తీర్ణులయ్యారు. విద్యార్థులు వ్యక్తిగతంగా తమ రోల్ నెంబరు నమోదుచేసి మార్కుల మెమోలు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు లాగిన్ వివరాలతో స్కూల్ వారీగా మార్కుల మెమోరాండం, మార్క్స్ మెమోలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పదోతరగతి సప్లిమెంటరీ ఫలితాల పట్ల సందేహాలుంటే రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం అవకాశం కల్పించారు. విద్యార్థులు జూన్ 27 నుంచి జులై 1 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రతి సబ్జెక్టు జవాబు పత్రం రీకౌంటింగ్ కోసం రూ.500 చొప్పున విద్యార్థులు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే రీవెరిఫికేషన్ కోసం రూ.1000 ఫీజుగా చెల్లించాలి.
పదోతరగతి మార్కుల మెమోల కోసం క్లిక్ చేయండి..

ALSO READ:

శ్రీకొండా లక్ష్మణ్ హార్టికల్చర్ యూనివర్సిటీలో డిప్లొమా కోర్సు - ప్రవేశాలకు ఇవీ అర్హతలు
 తెలంగాణలోని సిద్ధిపేట జిల్లా ములుగులోని శ్రీకొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యానవన విశ్వవిద్యాలయం ( Telangana Horticultural University) రెండేళ్ల డిప్లొమా కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. దీనిద్వారా మొత్తం 200 సీట్లను భర్తీచేయనున్నారు. ఇందులో యూనివర్సిటీ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో 120 సీట్లు అందుబాటులో ఉండగా.. అనుబంధ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో 80 సీట్లు ఉన్నాయి. అయితే  మొత్తం సీట్లలో 60 శాతం సీట్లను గ్రామీణ విద్యార్థులకే కేటాయించనున్నారు. మిగతా 40 శాతం సీట్లను పట్టణ ప్రాంత విద్యార్థులకు కేటాయిస్తారు. 
కోర్సు వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

టాప్ హెడ్ లైన్స్

Software Engineer Murder: పూజ చేసి బలిచ్చింది! సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను హత్య చేసిన ప్రియురాలు.. ఆమెతో పాటు తల్లి అరెస్ట్
పూజ చేసి బలిచ్చింది! సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను హత్య చేసిన ప్రియురాలు.. ఆమెతో పాటు తల్లి అరెస్ట్
Adilabad Dandari Festival: ఆదిలాబాద్ ఏజెన్సీలో 10 రోజులపాటు ఆదివాసీల దండారీ వేడుకలు.. గుస్సాడి నృత్యాలు
ఆదిలాబాద్ ఏజెన్సీలో 10 రోజులపాటు ఆదివాసీల దండారీ వేడుకలు.. గుస్సాడి నృత్యాలు
AP Fire Accidents: ఒకేరోజు పలుచోట్ల అగ్నిప్రమాదాలపై సీఎం చంద్రబాబు ఆరా, అధికారులకు ఆదేశాలు
AP Fire Accidents: ఒకేరోజు పలుచోట్ల అగ్నిప్రమాదాలపై సీఎం చంద్రబాబు ఆరా, అధికారులకు ఆదేశాలు
Tesla Cybertruck: భారీ అంచనాలతో వచ్చిన సైబర్‌ట్రక్‌కు టాటా.. 2027లో ఉత్పత్తి నిలిపివేయనున్న టెస్లా
ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన కారు.. కొనేవాళ్లు లేక టెస్లా సంచలన నిర్ణయం!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Software Engineer Murder: పూజ చేసి బలిచ్చింది! సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను హత్య చేసిన ప్రియురాలు.. ఆమెతో పాటు తల్లి అరెస్ట్
పూజ చేసి బలిచ్చింది! సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను హత్య చేసిన ప్రియురాలు.. ఆమెతో పాటు తల్లి అరెస్ట్
Adilabad Dandari Festival: ఆదిలాబాద్ ఏజెన్సీలో 10 రోజులపాటు ఆదివాసీల దండారీ వేడుకలు.. గుస్సాడి నృత్యాలు
ఆదిలాబాద్ ఏజెన్సీలో 10 రోజులపాటు ఆదివాసీల దండారీ వేడుకలు.. గుస్సాడి నృత్యాలు
AP Fire Accidents: ఒకేరోజు పలుచోట్ల అగ్నిప్రమాదాలపై సీఎం చంద్రబాబు ఆరా, అధికారులకు ఆదేశాలు
AP Fire Accidents: ఒకేరోజు పలుచోట్ల అగ్నిప్రమాదాలపై సీఎం చంద్రబాబు ఆరా, అధికారులకు ఆదేశాలు
Tesla Cybertruck: భారీ అంచనాలతో వచ్చిన సైబర్‌ట్రక్‌కు టాటా.. 2027లో ఉత్పత్తి నిలిపివేయనున్న టెస్లా
ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన కారు.. కొనేవాళ్లు లేక టెస్లా సంచలన నిర్ణయం!
Nvidia Jensen Huang Affair: చైనా గూఢచారితో రిలేషన్ నిజమే.. సారీ చెప్పిన ఎన్వీడీయా సీఈఓ జెన్సన్ హువాంగ్- స్పందించిన ట్రంప్
చైనా గూఢచారితో రిలేషన్ నిజమే.. సారీ చెప్పిన ఎన్వీడీయా సీఈఓ జెన్సన్ హువాంగ్- స్పందించిన ట్రంప్
Telangana CID Dharani Land Scam : ధరణి అక్రమాలపై సీఐడీ ఉక్కుపాదం - బీఆర్ఎస్ నేతల మెడకు భూ కుంభకోణం చుట్టుకోనుందా?
ధరణి అక్రమాలపై సీఐడీ ఉక్కుపాదం - బీఆర్ఎస్ నేతల మెడకు భూ కుంభకోణం చుట్టుకోనుందా?
Low Fibre Risks : ఫైబర్ ఫుడ్స్ తినకపోతే జీర్ణక్రియ, బరువు తగ్గడంపై ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది? ఏవి తింటే మంచిది?
ఫైబర్ ఫుడ్స్ తినకపోతే జీర్ణక్రియ, బరువు తగ్గడంపై ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది? ఏవి తింటే మంచిది?
Real World Mileage: కొత్త Honda City Hybridలో ఫుల్ ట్యాంక్‌తో 750km ప్రయాణించవచ్చా? రియల్‌ వరల్డ్‌లో ఎంత మైలేజ్ ఇస్తోంది?
2026 హోండా సిటీ హైబ్రిడ్ నిజమైన మైలేజ్ ఎంత? సిటీలో, హైవేపై 'రియల్ టెస్ట్‌'లో తెలిసిన నిజాలు
Embed widget