TSMS Merit List: తెలంగాణ మోడల్ స్కూల్స్ ఫలితాలు విడుదల - మెరిట్ జాబితా, ర్యాంకులు ఇలా చూసుకోండి
TSMS Results: తెలంగాణలోని మోడల్ స్కూల్స్‌లో 6వ తరగతితోపాటు, 7 నుంచి 10వ తరగతి ప్రవేశాలకు నిర్వహించిన ప్రవేశపరీక్ష ఫలితాలు వెలువడ్డాయి. విద్యార్థుల మెరిట్ జాబితాను, ర్యాంకులను అధికారులు విడుదల చేశారు.
TSMS Merit List: తెలంగాణలోని మోడల్ స్కూల్స్‌లో 6వ తరగతితోపాటు, 7 నుంచి 10వ తరగతి ప్రవేశాలకు నిర్వహించిన ప్రవేశపరీక్ష ఫలితాలు వెలువడ్డాయి. ప్రవేశ పరీక్షకు హాజరైన విద్యార్థుల మెరిట్ జాబితాను, ర్యాంకులను విడుదల చేసినట్లు మోడల్ స్కూల్స్ అడిషనల్ సెక్రటరీ రమణ కుమార్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ 7న మండల కేంద్రాల్లో పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 194 మోడల్ స్కూళ్లలో 6వ తరగతిలో 100 సీట్లలో (మొత్తంగా 19,400 సీట్లు) ప్రవేశాలు కల్పించనున్నారు. అలాగే 7-10 తరగతుల్లోని మిగిలిన సీట్లను భర్తీ చేస్తారు. ప్రతి తరగతికి రెండు సెక్షన్లు ఉంటాయి. ఒక్కో సెక్షన్‌లో 50 చొప్పున విద్యార్థులు ఉంటారు. ఎంపికైన విద్యార్థుల జాబితాను మే 25న వెల్లడిస్తారు. ప్రవేశాలు పొందిన విద్యార్థులకు జూన్ 1న లేదా 2023 - 24 అకడమిక్ క్యాలెండర్ ప్రకారం తరగతులు ప్రారంభిస్తారు.
మోడల్ స్కూల్స్ ఫలితాలు ఇలా చూసుకోండి..
➥ ఫలితాల కోసం అభ్యర్థులు మొదటగా అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి- http://telanganams.cgg.gov.in
➥ అక్కడ హోంపేజీలో TSMS VI CLASS - 2024/ TSMS VII TO X CLASS - 2024 సెక్షన్‌లో కనిపించే మెరిట్ జాబితా లింక్ మీద క్లిక్ చేయాలి
➥ క్లిక్ చేయగానే వచ్చే లాగిన్ పేజీలో విద్యార్థులు తమ హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేదీ, వెరిఫికేషన్ కోడ్ వివరాలు నమోదుచేయాలి.
➥ వివరాలు నమోదచేసి ''Get Result'' బటన్ మీద క్లిక్ చేయాలి.
➥ 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు సంబంధించిన మెరిట్ జాబితా, ర్యాంకులు కంప్యూటర్ స్క్రీన్ మీద కనిపిస్తాయి.
➥ విద్యార్థులు తమకు వచ్చిన ర్యాంకు తెలుసుకోవచ్చు. మెరిట్ జాబితా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష ఫలితాల కోసం క్లిక్ చేయండి..
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 194 మోడల్ స్కూళ్లలో 6వ తరగతిలో కొత్తగా ప్రవేశాలు కల్పించడంతో పాటు 7-10 తరగతుల్లోని ఖాళీ సీట్ల భర్తీకి నిర్వహించే ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ జనవరి 12న వెలువడిన సంగతి తెలిసిందే. విద్యార్థుల నుంచి జనవరి 12 నుంచి మార్చి 11 వరకు దరఖాస్తులు స్వీకరించారు. విద్యార్థుల నుంచి పరీక్ష ఫీజు కింద రూ.200 వసూలుచేశారు. ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ విద్యార్థులు రూ.125 వసూలు చేశారు. దరఖాస్తు చేసుకున్నవారికి ఏప్రిల్ 7న ప్రవేశ పరీక్ష నిర్వహించారు.
మోడల్ స్కూల్స్‌లో ప్రవేశాలు ఇలా..
⫸ మోడల్ స్కూల్స్ ప్రవేశ పరీక్ష ద్వారా 6, 7, 8, 9, 10తరగతుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ప్రధానంగా 6వ తరగతిలో పూర్తిస్థాయి, 7 నుంచి 10వ తరగతుల్లో మిగిలిపోయిన ఖాళీలను భర్తీచేస్తారు.
⫸ మోడల్ స్కూల్స్‌లో ప్రవేశాలు కోరే విద్యార్థుల వయసు 6వ తరగతికి-10 సంవత్సరాలు, 7వ తరగతికి-11 సంవత్సరాలు, 8వ తరగతికి-12 సంవత్సరాలు, 9వ తరగతికి-13 సంవత్సరాలు, 10వ తరగతికి-14 సంవత్సరాలు నిండిపోయాలి.
⫸ ప్రవేశ పరీక్ష ఆధారంగా. ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఐఐటీ, జేఈఈ, నీట్, ఎంసెట్, సీఏ, టీపీటీ, సీఎస్ తదితర పోటీపరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తారు.
⫸ మొత్తం 100 ప్రశ్నలకుగాను 100 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు. మొత్తం నాలుగు విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో విభాగానికి 25 మార్కులు కేటాయించారు. 6వ తరగతికి (తెలుగు, మ్యాథమెటిక్స్, సైన్స్&సోషల్(ఈవీఎస్), ఇంగ్లిష్) నుంచి మిగతా తరగతులవారికి (ఇంగ్లిష్,మ్యాథమెటిక్స్, జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్) నుంచి ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం 2 గంటలు.
Notification - TSMS VI CLASS - 2024