News
News
వీడియోలు ఆటలు
X

TS SSC Exams 2022 : తెలంగాణ పదో తరగతి పరీక్షల సమయం పెంపు, అదనంగా 30 నిమిషాలు!

TS SSC Exams 2022 : పదో తరగతి పరీక్షల నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టెన్త్ పరీక్ష సమయాన్ని ప్రతీ పేపర్ కు 30 నిమిషాలు పొడిగించింది.

FOLLOW US: 
Share:

TS SSC Exams 2022 : పదో తరగతి విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పదో తరగతి పరీక్షల సమయాన్ని 30 నిమిషాలు పొడిగించాలని ఎస్ఎస్ఈ బోర్డు నిర్ణయం తీసుకుంది. పదో తరగతి పరీక్షల సమయాన్ని మరో అరగంట పొడిగిస్తున్నట్లు మంత్రి సబిత ఇంద్రా రెడ్డి తెలిపారు. మూడు గంటల పదిహేను నిమిషాలు పరీక్ష సమయం ఉంటుందని అధికారుల సమావేశంలో మంత్రి తెలిపారు.  

మరో 30 నిమిషాలు పెంపు 

 తెలంగాణలో పదో తరగతి పరీక్షలు నిర్వహణపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులతో సమావేశం నిర్వహించారు. అధికారుల సూచనల మేరకు ప్రతీ పరీక్షకు 30 నిమిషాలు పెంచుతున్నట్లు మంత్రి ప్రకటించారు. ఇప్పటి వరకూ 2 గంటల 45 నిమిషాల పాటు ఉండగా, ఇప్పుడు 3 గంటల 15 నిమిషాల పాటు పరీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్రంలో మే 23 నుంచి జూన్‌ 1 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప‌రీక్ష స‌మ‌యాన్ని అదనంగా 30 నిమిషాలు పొడిగించారు. అలాగే 6 పేపర్లతోనే ప‌రీక్షలు నిర్వహిస్తున్నారు. అలాగే 70 శాతం సిల‌బ‌స్ నుంచే ప్రశ్నలు ఇవ్వనున్నట్లు బోర్డు గతంలోనే ప్రకటించింది. క‌రోనా కారణంగా తరగతులు ఆల‌స్యం కావ‌డంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

టెన్త్ పరీక్షల తేదీలు 

  • మే 23 - ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పేపర్ గ్రూప్ ఏ -(ఉదయం 9.30 - మధ్యాహ్నం 12.45 వరకు)
  • మే 23- ఫస్ట్ లాంగ్వేజ్‌ పేపర్-1 - (ఉదయం 9.30 - మధ్యాహ్నం 12.45 వరకు)
  • మే 23- ఫస్ట్ లాంగ్వేజ్‌ పేపర్-2  - (ఉదయం 9.30 - మధ్యాహ్నం 12.45 వరకు)
  • మే 24 - సెకండ్ లాంగ్వేజ్ -(ఉదయం 9.30 - మధ్యాహ్నం 12.45 వరకు)
  • మే 25- థర్డ్ లాంగ్వేజ్‌ (ఇంగ్లిష్‌) - (ఉదయం 9.30 - మధ్యాహ్నం 12.45 వరకు)
  • మే 26- మ్యాథమెటిక్స్‌ - (ఉదయం 9.30 - మధ్యాహ్నం 12.45 వరకు)
  • మే 27- జనరల్‌ సైన్స్‌ పేపర్ (ఫిజికల్‌, బయోలాజికల్‌ సైన్స్‌) - (ఉదయం 9.30 - మధ్యాహ్నం 12.45 వరకు)
  • మే 28- సోషల్‌ స్టడీస్‌ - (ఉదయం 9.30 - మధ్యాహ్నం 12.45 వరకు)
  • మే 30- ఓఎస్‌ఎస్‌సీ మెయిన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌ – 1 (సంస్కృతం, అరబిక్‌)- (ఉదయం 9.30 - మధ్యాహ్నం 12.45 వరకు)
  • మే 31- ఓఎస్‌ఎస్‌సీ మెయిన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌ – 2 (సంస్కృతం, అరబిక్‌) - (ఉదయం 9.30 - మధ్యాహ్నం 12.45 వరకు)
  • జూన్ 1- ఎస్‌ఎస్‌సీ ఓకేషనల్ కోర్స్‌ (థియరీ) - ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 11.30 వరకు 
Published at : 08 Apr 2022 05:15 PM (IST) Tags: TS News TS SSC Exams Half an hour extended TS SSC Board

సంబంధిత కథనాలు

TS Inter Exams: ఇంటర్‌ సప్లిమెంటరీ హాల్‌టికెట్లు విడుదల, పరీక్షల షెడ్యూలు ఇలా!

TS Inter Exams: ఇంటర్‌ సప్లిమెంటరీ హాల్‌టికెట్లు విడుదల, పరీక్షల షెడ్యూలు ఇలా!

UGC-NET: జూన్‌ 13 నుంచి యూజీసీ నెట్‌ పరీక్షలు, పూర్తి షెడ్యూలు ఇలా!

UGC-NET: జూన్‌ 13 నుంచి యూజీసీ నెట్‌ పరీక్షలు, పూర్తి షెడ్యూలు ఇలా!

TS PGECET Results: తెలంగాణ పీజీఈసెట్‌ - 2023 ఫలితాలు వెల్లడి, డైరెక్ట్ లింక్ ఇదే!

TS PGECET Results: తెలంగాణ పీజీఈసెట్‌ - 2023 ఫలితాలు వెల్లడి, డైరెక్ట్ లింక్ ఇదే!

JoSAA 2023 Schedule: 'జోసా' కౌన్సెలింగ్ షెడ్యూలు వచ్చేసింది, ముఖ్యమైన తేదీలివే!

JoSAA 2023 Schedule: 'జోసా' కౌన్సెలింగ్ షెడ్యూలు వచ్చేసింది, ముఖ్యమైన తేదీలివే!

AP DEECET 2023: జూన్ 12న ఏపీ డీఈఈసెట్‌ పరీక్ష, హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోండి!

AP DEECET 2023: జూన్ 12న ఏపీ డీఈఈసెట్‌ పరీక్ష, హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోండి!

టాప్ స్టోరీస్

Magunta Raghav : మాగుంట రాఘవ్ మధ్యంతర బెయిల్ రద్దు - 12న సరెండర్ కావాలని సుప్రీంకోర్టు ఆదేశం !

Magunta Raghav : మాగుంట రాఘవ్ మధ్యంతర బెయిల్ రద్దు - 12న సరెండర్ కావాలని సుప్రీంకోర్టు ఆదేశం !

సునీత పిటిషన్ స్వీకరించిన సుప్రీంకోర్టు- అవినాష్‌ ముందస్తు బెయిల్‌పై మంగళవారం విచారణ

సునీత పిటిషన్ స్వీకరించిన సుప్రీంకోర్టు- అవినాష్‌ ముందస్తు బెయిల్‌పై మంగళవారం విచారణ

టీడీపీకి మరో సన్‌స్ట్రోక్- చేరికలను వాయిదా వేసిన చంద్రబాబు

టీడీపీకి మరో సన్‌స్ట్రోక్- చేరికలను వాయిదా వేసిన చంద్రబాబు

Priyanka Gandhi: 2024 ఎన్నికలకు దూరంగా ప్రియాంక గాంధీ! ప్రచారంపైనే ఫుల్ ఫోకస్

Priyanka Gandhi: 2024 ఎన్నికలకు దూరంగా ప్రియాంక గాంధీ! ప్రచారంపైనే ఫుల్ ఫోకస్