News
News
వీడియోలు ఆటలు
X

Telangana SSC Exam Results Live Updates: తెలంగాణ పదోతరగతి రిజల్ట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాసేపట్లో తెలంగాణ పదో తరగతి పరీక్షా ఫలితాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేయనున్నారు. ఫలితాలు విడుదల కాగానే ఇక్కడే మీరు మీ రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు

FOLLOW US: 
టెన్త్ రిజల్ట్స్ చెక్ చేసుకునేందుకు డైరెక్ట్ లింక్

మధ్యాహ్నం 12 గంటలకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి పదో తరగతి ఫలితాలు విడుదల చేశాక విద్యార్థులు ఫలితాలు ఇక్కడ చెక్ చేసుకోండి.

Telangana SSC Results: మధ్యాహ్నం 12 గంటలకు పది ఫలితాలు విడుదల

మే 10 మధ్యాహ్నం 12 గంటలకు టెన్త్ ఫలితాలు విడుదల చేయనున్నారు. పదో తరగతి ఫలితాలను కూడా మంత్రి సబితా ఇంద్రా రెడ్డి చేతుల మీదుగానే విడుదల చేయబోతున్నారు. గోదావరి ఆడిటోరియంలో గ్రౌండ్ ఫ్లోర్ లో మంత్రి సబిత టెన్త్ రెగ్యూలర్, వొకేషనల్ విద్యార్థుల ఫలితాలను విడుదల చేస్తారని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 

Background

తెలంగాణలో పదో తరగతి విద్యార్ధులు పరీక్షా ఫలితాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులు, తల్లిదండ్రులకు గుడ్ న్యూస్ చెప్పారు అధికారులు. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు టెన్త్ ఫలితాలు విడుదల చేయనున్నారు. పదో తరగతి ఫలితాలను కూడా మంత్రి సబితా ఇంద్రా రెడ్డి చేతుల మీదుగానే విడుదల చేయబోతున్నారు. గోదావరి ఆడిటోరియంలో గ్రౌండ్ ఫ్లోర్ లో మంత్రి సబిత టెన్త్ రెగ్యూలర్, వొకేషనల్ విద్యార్థుల ఫలితాలను విడుదల చేస్తారని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 

పదో తరగతి ఫలితాలపై అధికారిక ప్రకటన విడుదల చేశారు అధికారులు. మే పదో తేదీని పదో తరగతి ఫలితాలు విడుద చేయబోతున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసినట్టు కూడా వివరించారు. ఇప్పటికే ఈ పరీక్షలకు సంబంధించిన జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తయింది. ఫలితాల ప్రాసెసింగ్ కూడా ఇటీవలే ముగిసింది. దీంతో ఫలితాల విడుదలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 

తెలంగాణలో ఏప్రిల్ 3 నుంచి 13 వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి. మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించారు. పది పరీక్షలకు 7,39,493 మంది విద్యార్ధులు హాజరయ్యారు.

పదో తరగతి ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి
తెలంగాణ టెన్త్ క్లాస్ రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి (How To Check TS SSC Results 2023)
Step 1: టెన్త్ క్లాస్ విద్యార్థులు మొదట తెలంగాణ టెన్త్ క్లాస్ బోర్డ్ అధికారిక వెబ్ సైట్ bse.telangana.gov.in సందర్శించాలి
Step 2: హోం పేజీలో టీఎస్ టెన్త్ క్లాస్ రిజల్ట్స్ (TS SSC Results 2023) లింక్ మీద క్లిక్ చేయండి 
Step 3: విద్యార్థుల హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ (Date of Birth) ఎంటర్ చేయండి
Step 4: వివరాలు నమోదు చేసిన తరువాత సబ్మిట్ బటన్ మీద క్లిక్ ఇవ్వండి
Step 5: మీ స్క్రీన్ మీద విద్యార్థి 10వ తరగతి ఫలితాలు కనిపిస్తాయి. TS SSC Results 2023 Marks మెమోను పీడీఎఫ్ రూపంలో డౌన్‌లోడ్ చేసుకోండి
Step 6: డౌన్‌లోడ్ చేసుకున్న టెన్త్ రిజల్ట్ పీడీఎఫ్‌ను భవిష్యత్ అవసరాల కోసం ప్రింటౌట్ తీసి పెట్టుకోవడం బెటర్.

గతేడాది రిజల్ట్స్‌ చూస్తే... 

గతేడాది తెలంగాణ పదో తరగతి పరీక్షా ఫలితాల్లో పెద్ద ఎత్తున ఉత్తీర్ణత శాతం నమోదైంది. ఏకంగా 90 శాతం మంది విద్యార్థులు పాసయ్యారు. వీరిలో బాలుర ఉత్తీర్ణత శాతం 87.61 కాగా, బాలికల ఉత్తీర్ణత శాతం 92.45 గా ఉంది. జిల్లాల వారీగా చూస్తే సిద్దిపేట జిల్లా మొదటి స్థానంలో 97.87 శాతం ఉత్తీర్ణతతో తొలి స్థానంలో నిలిచింది. హైదరాబాద్ జిల్లా 79 శాతంతో చివరి స్థానంలో ఉండిపోయింది.
రాష్ట్రంలోని జిల్లా పరిషత్ హైస్కూళ్లలో 80 7.3 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 75 శాతం 65 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్రంలోని కేజీబీవీలలో 93.49 శాతం ఉత్తీర్ణత నమోదైంది. మైనార్టీ రెసిడెన్సిల్లో 93.73 శాతం, మోడల్ స్కూల్లో 97.25 శాతం ఉత్తీర్ణత, తెలంగాణ రెసిడెన్షియల్ గురుకులాల్లో 99.32 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బీసీ గురుకులల్లో 97.47 మంది పాసయ్యారు. తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ గురుకులంలలో 95.3 శాతం మంది పాసయ్యారు. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ 98.1 శాతం నమోదు అయింది.
9 ప్రైవేటు పాఠశాలలో జీరో శాతం ఉత్తీర్ణత, 3 జిల్లా పరిషత్ హై స్కూళ్లలో జీరో శాతం ఉత్తీర్ణత నమోదు అయింది.

టాప్ స్టోరీస్

చంద్రబాబుకు మేనిఫెస్టో అంటే చిత్తు కాగితంతో సమానం- వైఎస్‌ఆర్‌సీపీ ఘాటు విమర్శలు

చంద్రబాబుకు మేనిఫెస్టో అంటే చిత్తు కాగితంతో సమానం- వైఎస్‌ఆర్‌సీపీ ఘాటు విమర్శలు

Wrestlers Protest: ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన రెజ్లర్లకు ఇచ్చే గౌరవమిదేనా: మంత్రి కేటీఆర్

Wrestlers Protest: ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన రెజ్లర్లకు ఇచ్చే గౌరవమిదేనా: మంత్రి కేటీఆర్

Telangana Decade Celebration: గ్రామాల్లో 23 రోజుల పాటు ప్రణాళికా బ‌ద్ధంగా దశాబ్ధి వేడుకలు: మంత్రి ఎర్రబెల్లి

Telangana Decade Celebration: గ్రామాల్లో 23 రోజుల పాటు ప్రణాళికా బ‌ద్ధంగా దశాబ్ధి వేడుకలు: మంత్రి ఎర్రబెల్లి

Telangana News: ఇంట్లోనే కూర్చొని రీల్స్ చేస్తుంటారా - అయితే ఈ అదిరిపోయే ఆఫర్ మీ కోసమే!

Telangana News: ఇంట్లోనే కూర్చొని రీల్స్ చేస్తుంటారా - అయితే ఈ అదిరిపోయే ఆఫర్ మీ కోసమే!