TSWRES Admissions: గురుకుల సైనిక పాఠశాలలో 6వ తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్, ప్రవేశ పరీక్ష ఎప్పుడంటే?
తెలంగాణ కరీంనగర్ జిల్లా రుక్మాపూర్‌లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సైనిక పాఠశాలలో 2023-24 విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది.
TSWRES Sainik School 6th Class Admissions: తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా రుక్మాపూర్‌లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సైనిక పాఠశాలలో 2023-24 విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశాలకు తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ ఫిబ్రవరి 20న నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ సైనిక పాఠశాలను ప్రత్యేకంగా బాలుర కోసం ఏర్పాటుచేశారు. 5వ తరగతి ఉత్తీర్ణత లేదా ప్రస్తుతం చదువుతున్న బాలురు దరఖాస్తు చేసకోవచ్చు. సరైన అర్హతలు గల బాలురు మార్చి 1 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుచేసుకోవచ్చు. మార్చి 10న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో ఎంపికైనవారికి తర్వాతి దశలో శారీరక సామర్థ్య, వైద్య పరీక్షలు నిర్వహించి ఎంపికలు చేపడతారు.
వివరాలు..
🔰 సైనిక పాఠశాల ప్రవేశాలు - 6వ తరగతి (సీబీఎస్ఈ)
సీట్ల సంఖ్య: 80
సీట్ల కేటాయింపు: ఎస్సీ- 60, బీసీ(సి)- 02, ఎస్టీ- 05, బీసీ- 10, మైనార్టీ- 02, ఓసీ/ ఈబీసీ- 01.
అర్హతలు: 2023-24 విద్యా సంవత్సరంలో ఏదైనా గుర్తింపు పొందిన పాఠశాల నుంచి 5వ తరగతి ఉత్తీర్ణత లేదా ప్రస్తుతం చదువుతున్న బాలురు దరఖాస్తు చేసకోవచ్చు. విద్యార్థి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం పట్టణ ప్రాంతాల్లో రూ.2,00,000; గ్రామీణ ప్రాంతాల్లో రూ.1,50,000కు మించకూడదు. విద్యార్థులు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయోపరిమితి: 01.04.2024 నాటికి 11 సంవత్సరాలకు మించకూడదు. 01.04.2013 నుంచి 31.03.2015 మధ్య జన్మించి ఉండాలి.
దరఖాస్తు ఫీజు: రూ.200.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
ఎంపిక విధానం: మూడు దశల్లో ఎంపిక విధానం ఉంటుంది. మొదటి దశలో 100 మార్కులకు రాష్ట్రస్థాయి ప్రవేశ పరీక్ష, రెండో దశలో 150 మార్కులకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తారు. తర్వాతి దశలో ఫిజికల్, సైనిక్ స్కూల్ ఆప్టిట్యూడ్ (డిస్క్రిప్టివ్), కమ్యూనికేషన్ స్కిల్ టెస్టు, మెడికల్ టెస్ట్ నిర్వహిస్తారు.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 20.02.2024.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 01.03.2024.
➥ హాల్‌టికెట్ డౌన్‌లోడ్: 06.03.2024 నుంచి.
➥ ప్రవేశ పరీక్షతేది: 10.03.2024.
➥ రాత పరీక్ష ఫలితాలు (1:10 నిష్పత్తిలో): తర్వాత తెలియజేస్తారు.
➥ ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ తేదీలు: మార్చి 22, 23, 26, 27, 28 తేదీల్లో.
➥ తుది ఫలితాల ప్రకటన: తర్వాత తెలియజేస్తారు.
➥ పాఠశాలలో ప్రవేశాలు ప్రారంభం: షెడ్యూలు ప్రకారం.
ALSO READ:
ఏపీ పాలిసెట్-2024 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
ఏపీలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో వివిధ ఇంజినీరింగ్, నాన్-ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులలో ప్రవేశాలకు నిర్వహించునున్న పాలిసెట్-2024 నోటిఫికేషన్‌ను రాష్ట్ర సాంకేతిక విద్యా, శిక్షణా మండలి ఫిబ్రవరి 17న విడుల చేసిన సంగతి తెలిసిందే. కాగా, ప్రవేశ పరీక్షకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 20న ప్రారంభమైంది. పదోతరగతి చదువుతున్న, ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజు కింద రూ.400 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.100 చెల్లిస్తే సరిపోతుంది. విద్యార్థులు ఏప్రిల్ 5 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ 27న పాలిసెట్ పరీక్ష నిర్వహించనున్నారు.
పాలిసెట్ దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..