అన్వేషించండి

AP POLYCET: ఏపీ పాలిసెట్-2024 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?

AP POLYCET: ఏపీలోని పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ఇంజినీరింగ్‌, నాన్‌-ఇంజనీరింగ్‌ డిప్లొమా కోర్సులలో ప్రవేశాలకు నిర్వహించునున్న పాలిసెట్‌-2024 ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 20న ప్రారంభమైంది.

AP POLYCET 2024: ఏపీలోని పాలిటెక్నిక్‌ కళాశాలల్లో వివిధ ఇంజినీరింగ్‌, నాన్‌-ఇంజనీరింగ్‌ డిప్లొమా కోర్సులలో ప్రవేశాలకు నిర్వహించునున్న పాలిసెట్‌-2024 నోటిఫికేషన్‌ను రాష్ట్ర సాంకేతిక విద్యా, శిక్షణా మండలి ఫిబ్రవరి 17న విడుల చేసిన సంగతి తెలిసిందే. కాగా, ప్రవేశ పరీక్షకు సంబంధించిన ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 20న ప్రారంభమైంది. పదోతరగతి చదువుతున్న, ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజు కింద రూ.400 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.100 చెల్లిస్తే సరిపోతుంది. విద్యార్థులు ఏప్రిల్‌ 5 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ 27న పాలిసెట్ పరీక్ష నిర్వహించనున్నారు. 

వివరాలు...

* ఏపీ పాలిసెట్ - 2024

బ్రాంచ్‌లు: సివిల్ ఇంజినీరింగ్(CE), ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్‌షిప్(ARC), మెకానికల్ ఇంజినీరింగ్(MEC/MRA), ఆటోమొబైల్ ఇంజినీరింగ్(AUT), ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్(EEE), ఎలక్ట్రిక్ వెహికిల్ టెక్నాలజీ (EVT) ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్(ECE), ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్(ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్-EII), ఇంటర్నెట్ ఆఫ్ థింక్స్(IOT), అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేషన్(AEI), కంప్యూటర్‌ ఇంజినీరింగ్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్-మెషిన్ లెర్నింగ్, 3-డి ఏనిమేషన్ అండ్ గ్రాఫిక్స్ (AMG), ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(AI), కంప్యూటర్ సైన్స అండ్ ఇంజినీరింగ్(ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్-CAI), క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ బిగ్ డేటా(CCB), కమ్యూనికేషన్ అండ్ కంప్యూటర్ నెట్‌వర్కింగ్ (CCN), మైనింగ్ ఇంజినీరింగ్, కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్ (CCP), అప్పారెల్ డిజైన్ అండ్ ఫ్యాషన్ టెక్నాలజీ (AFT), మెటలర్జికల్ ఇంజినీరింగ్, టెక్స్‌టైల్ టెక్నాలజీ, బయోమెడికల్ ఇంజినీరింగ్, కెమికల్ ఇంజినీరింగ్, సిరామిక్ ఇంజినీరింగ్, ప్యాకేజింగ్ టెక్నాలజీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

అర్హత: పదోతరగతి లేదా తత్సమాన ఉత్తీర్ణత, ఈ ఏడాది మార్చి/ఏప్రిల్‌లో నిర్వహించే పదోతరగతి పరీక్షలకు హాజరవుతున్నవారు పాలిసెట్‌ దరఖాస్తుకు అర్హులు.

దరఖాస్తు ఫీజు: ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.400 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.100 చెల్లిస్తే సరిపోతుంది. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్ ద్వారా .

ప్రవేశాలు కల్పించే సంస్థలుపాలిసెట్‌ ద్వారా ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్, ప్రయివేట్‌ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో మూడేళ్లు, మూడున్నరేళ్ల కాలవ్యవధి గల డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. పాలిసెట్‌లో వచ్చిన స్కోర్‌ ఆధారంగా ఆయా కళాశాలల్లో ప్రవేశాలు కల్పిస్తారు. 

పరీక్ష విధానం: పాలిసెట్‌ పరీక్షను పెన్‌ అండ్‌ పేపర్‌(ఆఫ్‌లైన్‌) విధానంలో నిర్వహిస్తారు. మల్టిపుల్‌ ఛాయిస్‌ పద్ధతిలో ప్రశ్నలు ఉంటాయి. మొత్తం మూడు విభాగాల నుంచి 120 ప్రశ్నలకు పరీక్ష ఉంటుంది. మ్యాథ్స్‌–50, ఫిజిక్స్‌–40, కెమిస్ట్రీ–30 చొప్పున ప్రశ్నలు వస్తాయి. పరీక్ష సమయం రెండున్నర గంటలు. పదోతరగతి స్థాయి సిలబస్‌ నుంచి ప్రశ్నలుంటాయి. ప్రతి సరైన సమాధానానికి ఒక మార్కు చొప్పున కేటాయిస్తారు. ఎటువంటి నెగిటివ్‌ మార్కింగ్‌ విధానంలో అమల్లో లేదు.

ముఖ్యమైన తేదీలు...

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 20.02.2024.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 05.04.2024.

➥ పాలిసెట్ పరీక్షతేది: 27.04.2024. (11:00 am to 1:00 pm)

➥ ఫలితాల వెల్లడి: 13.05.2024

Notification

Register with Mobile Number
(for other than SSC and TS Candidates)

Register with SSC Hall Ticket Number
(for AP SSC Candidates)

POLYCET previous years (2014-2022) papers

Website

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్, 16 మంది మావోయిస్టులు మృతి, ఇద్దరు జవాన్లకు గాయాలు
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్, 16 మంది మావోయిస్టులు మృతి, ఇద్దరు జవాన్లకు గాయాలు
TDP Foundation Day: తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం పుట్టిన జెండా, పీకపై కత్తిపెట్టినా ‘జై తెలుగుదేశం’ నినాదం: చంద్రబాబు
తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం పుట్టిన జెండా, పీకపై కత్తిపెట్టినా ‘జై తెలుగుదేశం’ నినాదం: చంద్రబాబు
Rashmika: ఆ డిజాస్టర్ నుంచి రష్మిక ఎస్కేప్... పాపం మరో హీరోయిన్ బలి... నేషనల్‌ క్రష్‌కు ముందే తెలిసిందా?
ఆ డిజాస్టర్ నుంచి రష్మిక ఎస్కేప్... పాపం మరో హీరోయిన్ బలి... నేషనల్‌ క్రష్‌కు ముందే తెలిసిందా?
Telangana News: రేషన్ కార్డులు లేని వారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త, ఉగాది నుంచి కొత్త స్కీమ్ ప్రారంభం
రేషన్ కార్డులు లేని వారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త, ఉగాది నుంచి కొత్త స్కీమ్ ప్రారంభం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

CSK vs RCB Match Highlights IPL 2025 | 17ఏళ్ల తర్వాత చెన్నైలో ఆర్సీబీపై ఓటమి | ABP DesamMyanmar Bangkok Earthquake | మయన్మార్, బ్యాంకాక్ లను కుదిపేసిన భారీ భూకంపం | ABP DesamKavya Maran Goenka Different Emotions SRH vs LSG IPL 2025 | ఇద్దరు ఓనర్లలో.. డిఫరెంట్ ఎమోషన్స్ | ABP DesamSRH vs LSG Match Strategy Highlights IPL 2025 | హైప్ ఎక్కించుకుంటే రిజల్ట్ ఇలానే ఉంటుంది | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్, 16 మంది మావోయిస్టులు మృతి, ఇద్దరు జవాన్లకు గాయాలు
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్, 16 మంది మావోయిస్టులు మృతి, ఇద్దరు జవాన్లకు గాయాలు
TDP Foundation Day: తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం పుట్టిన జెండా, పీకపై కత్తిపెట్టినా ‘జై తెలుగుదేశం’ నినాదం: చంద్రబాబు
తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం పుట్టిన జెండా, పీకపై కత్తిపెట్టినా ‘జై తెలుగుదేశం’ నినాదం: చంద్రబాబు
Rashmika: ఆ డిజాస్టర్ నుంచి రష్మిక ఎస్కేప్... పాపం మరో హీరోయిన్ బలి... నేషనల్‌ క్రష్‌కు ముందే తెలిసిందా?
ఆ డిజాస్టర్ నుంచి రష్మిక ఎస్కేప్... పాపం మరో హీరోయిన్ బలి... నేషనల్‌ క్రష్‌కు ముందే తెలిసిందా?
Telangana News: రేషన్ కార్డులు లేని వారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త, ఉగాది నుంచి కొత్త స్కీమ్ ప్రారంభం
రేషన్ కార్డులు లేని వారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త, ఉగాది నుంచి కొత్త స్కీమ్ ప్రారంభం
MS Dhoni Trolling:  కెరీర్లో ఇదే లో పాయింట్.. 9వ స్థానంలో బ్యాటింగ్ ఏంది తలా..? రిటైర‌యిపో.. ధోనీపై భ‌గ్గుమ‌న్న ఫ్యాన్స్ 
కెరీర్లో ఇదే లో పాయింట్.. 9వ స్థానంలో బ్యాటింగ్ ఏంది తలా..? రిటైర‌యిపో.. ధోనీపై భ‌గ్గుమ‌న్న ఫ్యాన్స్ 
SBI clerk prelims Results 2025: ఎస్‌బీఐ క్లర్క్స్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల- డైరెక్ట్ లింక్ ఇదే
ఎస్‌బీఐ క్లర్క్స్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల- డైరెక్ట్ లింక్ ఇదే
Mad Square Day 1 Collections: తెలుగు రాష్ట్రాల్లో అదరగొట్టిన కుర్రాళ్ళు... 'మ్యాడ్ స్క్వేర్' ఫస్ట్ డే కలెక్షన్లు ఎంతంటే?
తెలుగు రాష్ట్రాల్లో అదరగొట్టిన కుర్రాళ్ళు... 'మ్యాడ్ స్క్వేర్' ఫస్ట్ డే కలెక్షన్లు ఎంతంటే?
Myanmar Earthquake Death Toll: మయన్మార్, థాయ్‌లాండ్‌లలో భూకంపాలు, 700 దాటిన మృతుల సంఖ్య- శిథిలాల కింద ఎందరో
మయన్మార్, థాయ్‌లాండ్‌లలో భూకంపాలు, 700 దాటిన మృతుల సంఖ్య- శిథిలాల కింద ఎందరో
Embed widget