TOSS: తెలంగాణ ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ పరీక్షల హాల్‌టికెట్లు విడుదల, టైమ్‌టేబుల్ ఇలా
TOSS Halltickets: తెలంగాణ ఓపెన్ స్కూల్ పది, ఇంటర్ పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. విద్యార్థులు తమ పేరు, జిల్లా, స్కూల్ వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
TOSS SSC, Inter Exams Halltickets: తెలంగాణ ఓపెన్ స్కూల్ పది, ఇంటర్ పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను అధికారులు విడుదల చేశారు. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు. విద్యార్థులు తమ పేరు, జిల్లా, స్కూల్ వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ 25 నుంచి మే 2 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయాతేదీల్లో రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్; మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండో సెషన్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక మే 3 నుంచి 10 వరకు ఇంటర్ జనరల్, ఒకేషనల్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు.
TOSS - SSC APRIL / MAY - 2024 HALLTICKET DOWNLOAD
TOSS - INTER APRIL / MAY - 2024 HALLTICKET DOWNLOAD
ఆలస్య రుసుముతో దరఖాస్తుకు అవకాశం..
తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ పరీక్షకు హాజరయ్యే పదోతరగతి విద్యార్థులు రూ.500 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 18 నుంచి 21 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అధికారులు అవకాశం కల్పించారు. ఇంటర్ విద్యార్థులకు సైతం అవే తేదీల్లో రూ.1000 ఆలస్య రుసుముతో పరీక్ష ఫీజు చెల్లించుకునేందుకు అవకాశం కల్పించారు.
పదోతరగతి పరీక్షల షెడ్యూలు ఇలా..
➥ 25.04.2024
ఉదయం సెషన్: తెలుగు, కన్నడ, తమిళం, మరాఠి.
మధ్యాహ్నం సెషన్: సైకాలజీ.
➥ 26.04.2024
ఉదయం సెషన్: ఇంగ్లిష్.
మధ్యాహ్నం సెషన్: ఇండియన్ కల్చర్ & హెరిటేజ్.
➥ 27.04.2024
ఉదయం సెషన్: మ్యాథమెటిక్స్.
మధ్యాహ్నం సెషన్: బిజినెస్ స్టడీస్.
➥ 29.04.2024
ఉదయం సెషన్: సైన్స్ & టెక్నాలజీ.
మధ్యాహ్నం సెషన్: హిందీ.
➥ 30.04.2024
ఉదయం సెషన్: సోషల్ స్టడీస్.
మధ్యాహ్నం సెషన్: ఉర్దూ.
➥ 01.05.2024
ఉదయం సెషన్: ఎకనామిక్స్.
మధ్యాహ్నం సెషన్:హోంసైన్స్.
➥ 02.05.2024
ఉదయం సెషన్: వొకేషనల్ సబ్జెక్టులు.
మధ్యాహ్నం సెషన్: వొకేషనల్ సబ్జెక్టులు (ప్రాక్టికల్స్)
ఇంటర్ పరీక్షల షెడ్యూలు ఇలా..
➥ 25.04.2024
ఉదయం సెషన్: తెలుగు/ఉర్దూ/హిందీ.
మధ్యాహ్నం సెషన్: అరబిక్.
➥ 26.04.2024
ఉదయం సెషన్: ఇంగ్లిష్.
మధ్యాహ్నం సెషన్: సోషియాలజీ.
➥ 27.04.2024
ఉదయం సెషన్: పొలిటికల్ సైన్స్.
మధ్యాహ్నం సెషన్: కెమిస్ట్రీ, పెయింటింగ్.
➥ 29.04.2024
ఉదయం సెషన్: కామర్స్/బిజినెస్ స్టడీస్.
మధ్యాహ్నం సెషన్: సైకాలజీ, ఫిజిక్స్.
➥ 30.04.2024
ఉదయం సెషన్: హిస్టరీ.
మధ్యాహ్నం సెషన్: మ్యాథమెటిక్స్, జియెగ్రఫీ.
➥ 01.05.2024
ఉదయం సెషన్: ఎకనామిక్స్, మాస్ కమ్యూనికేషన్.
మధ్యాహ్నం సెషన్: బయాలజీ, అకౌంటెన్సీ, హోంసైన్స్.
➥ 02.05.2024
ఉదయం సెషన్: వొకేషనల్ సబ్జెక్టులు (థియరీ).
మధ్యాహ్నం సెషన్: ఎలాంటి పరీక్ష లేదు.
ప్రాక్టికల్ పరీక్షలు..
జనరల్ & వొకేషనరల్ సబ్జెక్టులు: 03.05.2024 - 10.05.2024.
ALSO READ:
APOSS: ఏపీ ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ పరీక్షల హాల్‌టికెట్లు విడుదల, పరీక్షల టైమ్‌టేబుల్ ఇలా
ఆంద్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో మార్చిలో నిర్వహించే పదోతరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల హాల్‌టికెట్లు మార్చి 12న విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో టెన్త్, ఇంటర్ పరీక్షల హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు. విద్యార్థులు వారిపేరుతోపాటు వారు చదివే స్కూల్ వివరాలు, జిల్లా వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మార్చి 18 నుంచి 27 పరీక్షలు జరుగనున్నాయి. ఆయాతేదీల్లో ప్రతిరోజు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. అదేవిధంగా ఇంటర్మీడియట్ జనరల్, వృత్తి విద్యా కోర్సులకు సంబంధించి ప్రయోగ పరీక్షలు మార్చి 30 నుంచి ఏప్రిల్ 3 వరకు నిర్వహించనున్నారు.
పరీక్షల హాల్‌టికెట్లు, షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..