అన్వేషించండి

TS Inter Results: తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్, వారంలోపు ఫలితాల వెల్లడి?

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ వార్షిక పరీక్ష ఫలితాలు వారంరోజుల్లోపే వెలువడే అవకాశం ఉంది. ఇప్పటికే మూల్యాంకనం పూర్తి కాగా.. నమోదైన మార్కుల పరిశీలన జరుగుతోంది. ఇదిపూర్తవడానికి నాలుగైదురోజుల సమయం పట్టనుంది.

TS Inter Results: తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ వార్షిక పరీక్ష ఫలితాలు వారంరోజుల్లోపే వెలువడే అవకాశం ఉంది. ఇప్పటికే మూల్యాంకనం పూర్తి కాగా.. నమోదైన మార్కుల పరిశీలన జరుగుతోంది. ఇదిపూర్తవడానికి నాలుగైదురోజుల సమయం పట్టనుంది. ఈ ప్రక్రియ పూర్తికాగానే ఏప్రిల్ 23 లేదా 24న ఫలితాలను వెల్లడించనున్నారు. తెలంగాణలో ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఒకవైపు పరీక్షలు జరుగుతుండగానే.. మరోవైపు మార్చి 10 నుంచి మూల్యాంకన ప్రక్రియను ప్రారంభించారు. మొత్తం 4 విడతల్లో మూల్యాంకన ప్రక్రియను నిర్వహించి ఏప్రిల్‌ 10న పూర్తి చేశారు. మార్కుల నమోదుతో పాటు ఎలాంటి సాంకేతికపరమైన ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పరీక్ష రాసిన వారు, గైర్హాజరైన వారు, మాల్‌ ప్రాక్టీసింగ్‌కు పాల్పడిన విద్యార్థుల డేటాను ప్రస్తుతం అప్‌లోడ్ చేస్తున్నారు. ఈ ప్రక్రియ మొత్తం ఏప్రిల్‌ 21 నాటికే ముగించాలని అధికారులు భావిస్తున్నారు. ఇది పూర్తవగానే ఒకేసారి ఇంటర్‌ మొదటి, రెండో సంవత్సరం ఫలితాలను ప్రకటించనున్నారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండటంతో ఈసీ నుంచి అనుమతి తీసుకోనున్నట్లు సమాచారం.

దేశంలో సార్వత్రిక ఎన్నికల కారణంగా.. ఈసారి ఇంటర్ పరీక్షల మూల్యాంకాన్ని త్వరగా పూర్తిచేసి, ఫలితాలను కూడా త్వరగా విడుదల చేయాలని ఇంటర్మీడియట్ బోర్డు ప్రయత్నిస్తోంది.  రాష్ట్రంలో ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈసారి పరీక్షలకు దాదాపు 9 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో.. 4,78,527 మంది మొద‌టి సంవత్సరం విద్యార్థులు కాగా.. 4,43,993 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఉన్నారు. పరీక్షలు జరుగుతుండగానే మార్చి 10 నుంచి మూల్యాంకన ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. మొత్తం 4 విడతల్లో మూల్యాంకన ప్రక్రియను నిర్వహించి ఏప్రిల్ 10 నాటికి మూల్యాంకన ప్రక్రియ పూర్తి చేశారు.

జవాబు పత్రాల మూల్యాంకనంలో సిబ్బంది ఎలాంటి తప్పులు చేయవద్దని ఇంటర్ బోర్డు మూల్యాంకన సమయంలో హెచ్చరించిన సంగతి తెలిసిందే. గత అనుభవాల దృష్ట్యా.. ఈసారి ఎలాంటి వాటికి అవకాశం ఇవ్వొద్దని సూచించింది. పూర్తిస్థాయిలో క్షుణ్ణంగా జవాబు పత్రాలను పరిశీలించిన తర్వాతే.. మార్కులను ఎంట్రీ చేయాలని సిబ్బందికి దిశానిర్దేశం చేసింది. వాల్యూయేషన్ ప్రక్రియను మానిటరింగ్ చేసేందుకు ప్రత్యేక అధికారులను కూడా నియమించింది. ఈసారి కొత్తగా సంగారెడ్డి జిల్లాలోనూ వాల్యూయేషన్ సెంటర్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. మొత్తంగా చూస్తే గత ఏడాదితో పోల్చితే.. ఈసారి సాధ్యమైనంత త్వరగా ఫలితాల విడుదల ప్రక్రియను పూర్తి చేయాలని ఇంటర్ బోర్డు భావిస్తోంది. ఏప్రిల్ 20 తర్వాత ఫలితాలను వెల్లడించనున్నారు.

ఫలితాలు ఇలా చూసుకోవచ్చు..

  • ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి- (tsbie.cgg.gov.in)
  • అక్కడ హోంపేజీలో 'TSBIE 2024 result' లింక్ మీద క్లిక్ చేయాలి.
  • విద్యార్థులు తమ హాల్‌టికెట్ నెంబరు నమోదుచేయాలి.
  • కంప్యూటర్ స్క్రీన్ మీద ఫలితాలు కనిపిస్తాయి.
  • ఫలితాలు డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవాలి. 

ALSO READ:

తెలంగాణ ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ పరీక్షల హాల్‌టికెట్లు విడుదల, టైమ్‌టేబుల్ ఇలా
తెలంగాణ ఓపెన్ స్కూల్ పది, ఇంటర్ పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను అధికారులు విడుదల చేశారు. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు. విద్యార్థులు తమ పేరు, జిల్లా, స్కూల్ వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ 25 నుంచి మే 2 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయాతేదీల్లో రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్‌; మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండో సెషన్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక మే 3 నుంచి 10 వరకు ఇంటర్ జనరల్, ఒకేషనల్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. 
హాల్‌టికెట్లు, పరీక్షల టైమ్ టేబుల్ కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...

టాప్ హెడ్ లైన్స్

Hyderabad ACB Raids: ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
Vande Mataram Controversy: వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad ACB Raids: ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
Vande Mataram Controversy: వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Embed widget