Telangana Holidays: రెండో శనివారం సెలవు రద్దు - స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులు నడవాల్సిందే!
సెప్టెంబర్ 9న గణేష్ నిమజ్జనం సందర్భంగా ప్రభుత్వం సాధారణ సెలవులగా ప్రకటించింది. అందుకు బదులుగా నవంబరు 12న సెలవులను రద్దు చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది.
రెండో శనివారం రోజు సాధారణంగా రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు సెలవు ఉంటుంది. కానీ.. ఈ నెలలోని రెండో శనివారం (నవంబరు 12) లో మాత్రం సెలవును అధికారులు రద్దు చేశారు. అయితే .. ఈ సెలవు రాష్ట్రం మొత్తానికి వర్తించదు.. కేవలం హైదరాబాద్-సికింద్రాబాద్ జంట నగరాలతో పాటు రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్ గిరి జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కాలేజీలు మాత్రమే నవంబరు 12న పని చేస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. సెప్టెంబర్ 9న గణేష్ నిమజ్జనం సందర్భంగా ప్రభుత్వం సాధారణ సెలవులగా ప్రకటించింది. అందుకు బదులుగా నవంబరు 12న సెలవులను రద్దు చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం రానున్న సెలవులు ఇవే..
♦ క్రిస్మస్ సెలవులు డిసెంబర్ 22 నుంచి డిసెంబర్ 28 వరకు కొనసాగనున్నాయి.
♦ జనవరి 13 నుంచి జనవరి 17 వరకు సంక్రాంతి సెలవులు
♦ వేసవి సెలవులు ఏప్రిల్ 25, 2023 నుంచి జూన్ 11, 2023 వరకు
ఏపీ ప్రభుత్వం ప్రకటించిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం రానున్న సెలవులు ఇవే..
♦ క్రిస్టియన్ మైనారిటీ పాఠశాలలకు దసరా సెలవులు అక్టోబరు 1 నుంచి 6వ తేదీ వరకు ఇస్తారు.
♦ క్రిస్మస్ సెలవులు డిసెంబర్ 23 నుంచి జనవరి 1వ తేదీ వరకూ ఇస్తారు.
♦ సంక్రాంతి సెలవులు వచ్చే ఏడాది జనవరి 11 నుంచి 16 వరకు ప్రకటించింది.
'టెన్త్' పరీక్షలపై తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం, అధికారిక ఉత్తర్వులు జారీ!!
తెలంగాణ పదోతరగతి పరీక్షలపై విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఏటా ఆరు పేపర్లతోనే పదోతరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. ఈ విద్యా సంవత్సరం 2022-23 కూడా 11 పేపర్లకు బదులుగా 6 పేపర్లతోనే పరీక్షలు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా వల్ల గత విద్యాసంవత్సరంలో 11 పేపర్లకు బదులు ఆరు పేర్లతోనే పదో తరగతి పరీక్షలు నిర్వహించారు. తాజాగా ఈ ఏడాది కూడా ఇదే విధానాన్ని అమలు చేయనున్నారు.
పదోతరగతి పరీక్ష ఫీజు ఖరారు చేసిన ప్రభుత్వం, ఆలస్య రుసుముతో చివరితేది ఎప్పుడంటే?
తెలంగాణలో పదో తరగతి పరీక్షా ఫీజును ప్రభుత్వం ఖరారు చేసిన సంగతి తెలిసిందే. దీనిప్రకారం నవంబరు 15 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా పరీక్ష ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. ఆయా పాఠశాలల హెడ్ మాస్టర్లకు ఫీజును చెల్లించాలని విద్యార్థులకు సూచించారు. ఇక రూ.50 ఆలస్యరుసుముతో నవంబర్ 30 వరకు, రూ.200 అపరాధ రుసుముతో డిసెంబర్ 15 వరకు, రూ.500 అపరాధ రుసుముతో డిసెంబర్ 29 వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. రెగ్యులర్ విద్యార్థులకు పరీక్ష ఫీజును రూ.125గా నిర్ణయించారు. ఫీజు చెల్లింపు తేదీల్లో ఏమైనా సెలవులు వస్తే.. మరుసటిరోజు ఫీజు చెల్లించవచ్చు.
ఫీజు నుంచి వీరికి మినహాయింపు..
కుటుంబ వార్షిక ఆదాయం పట్టణాల్లో రూ.24,000 కు మించకూడదు, అలాగే గ్రామాల్లో ఆదాయం రూ.20,000 మించకూడదు లేదా 2.5 ఎకరాల వెట్ ల్యాండ్/ 5 ఎకరాల డ్రై ల్యాండ్ ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఫీజు నుంచి మినహాయింపు వర్తిస్తుంది.