Engineering Fees Hike : విద్యార్థులకు షాక్, భారీగా పెరిగిన ఇంజినీరింగ్ ఫీజులు!
Engineering Fees Hike : తెలంగాణలో ఇంజినీరింగ్ ఫీజులు భారీగా పెరిగాయి. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో 79 కాలేజీలు పెంచిన ఫీజులు వసూలు చేసుకునేందుకు లైన్ క్లియరైంది. అయితే ఫీజులపై ప్రభుత్వం ఇంకా జీవో జారీ చేయలేదు.
Engineering Fees Hike :విద్యార్థులకు ఫీజుల షాక్ తగిలింది. ఇంజినీరింగ్ ఫీజులు భారీగా పెరిగాయి. అయితే పెంచిన ఫీజులపై జీవో ఇవ్వకుండానే కౌన్సెలింగ్ ప్రారంభకానుంది. పెంచిన ఫీజులు వసూలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని 79 కాలేజీలు హైకోర్టును ఆశ్రయించాయి. ఈ పిటిషన్ పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. టీఎస్ఏఎఫ్ఆర్సీ వద్ద అంగీకరించిన ఇంజినీరింగ్ ఫీజులకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. పెంచిన ఫీజులతో రాష్ట్రంలో 36 ఇంజినీరింగ్ కాలేజీల్లో వార్షిక ఫీజు రూ.లక్ష దాటనుంది. సీబీఐటీలో రూ.1.73 లక్షలు, వాసవి, వర్దమాన్, సీవీఆర్, బీవీఆర్ఐటీ మహిళ కాలేజీలో వార్షిక ఫీజు రూ.1.55 లక్షలకు చేరింది. శ్రీనిధి, వీఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోజి రూ.1.50 లక్షలు, ఎంవీఎస్ఆర్ రూ.1.45 లక్షలుగా ప్రభుత్వం నిర్ణయించింది. పదివేల ర్యాంకు దాటిన బీసీ, ఈబీసీ విద్యార్థులపై ఫీజుల భారం పడనుంది. బీసీ, ఈబీసీలకు ఫీజు రీఎంబర్స్ మెంట్ పెంపు ప్రతిపాదనలపై ప్రభుత్వం ఇంకా ఏ నిర్ణయం ప్రకటించలేదు. రేపు మొదటి విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు జరగనుంది. ఈనెల 13 వరకు ఫీజు చెల్లింపునకు గడువు ఉంది.
రూ. లక్ష దాటేసిన ఫీజులు
తెలంగాణలో ఇంజినీరింగ్ విద్య ఫీజులు ఫీజులు భారీగా పెరిగాయి. ఈ ఫీజుల పెంపునకు సంబంధించి ప్రభుత్వం నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన జారీ కాకుండానే... పెంచిన ఫీజులను వసూలు చేసుకునేందుకు ఇంజినీరింగ్ కళాశాలలకు వెసులుబాటు లభించింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇంజినీరింగ్ విద్య ఫీజులను పెంచుతూ తెలంగాణ స్టేట్ అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటింగ్ కమిటీ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఈ ప్రతిపాదనలతో పెంచిన ఫీజులను వసూలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ రాష్ట్రంలోని 79 కళాశాలలు హైకోర్టును ఆశ్రయించాయి. కాలేజీల అభ్యర్థనపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. పెంచిన ఫీజుల వసూలుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో రాష్ట్రంలోని 36 ఇంజినీరింగ్ కళాశాలల్లో వార్షిక ఫీజు రూ.1 లక్ష దాటిపోయింది.
రేపటి నుంచి కౌన్సెలింగ్
అయితే పెరిగిన ఫీజులకు అనుగుణంగా ఫీజు రీయింబర్స్‌మెంట్ పెంపుపై తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో బీసీ, ఈబీసీ కోటా అభ్యర్థుల్లో అయోమయ పరిస్థితి నెలకొంది. రేపటి నుంచి ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపునకు సంబంధించిన కౌన్సెలింగ్ ప్రారంభం అవుతుంది. కౌన్సెలింగ్ ప్రారంభమవుతున్నా ఫీజులపై ప్రభుత్వం నుంచి స్పష్టత రాకపోవడం అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.
ఫీజులు పెంచిన జేఎన్టీయూ
హైదరాబాద్ జేఎన్టీయూ ఇంజినీరింగ్ విద్యార్థులను భారీగా పెంచింది. క్యాంపస్ కాలేజీలతో పాటు వర్సిటీ ఆధ్వర్యంలో నడిచే కళాశాలల్లో రెగ్యులర్ ఇంజినీరింగ్ కోర్సుల ఫీజులను భారీగా పెంచింది. రెగ్యులర్ బీటెక్ కోర్సుల ఫీజును రూ.35,000 నుంచి ఏడాదికి రూ.50,000కు పెంచుతూ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ ఇటీవల నిర్ణయం తీసుకుంది. దీంతో విద్యార్థులపై ఫీజుల భారం పడనుంది. గతేడాదే రూ.18 వేలుగా ఉన్న ఫీజును రూ.35 వేలకు పెంచి ఇప్పుడు మళ్లీ ఈ ఫీజును పెంచింది. ఈ విద్యా సంవత్సరానికి రూ.50 వేలకు ఫీజును పెంచడం గమనార్హం. టీఎస్ ఎంసెట్ లో పది వేల లోపు ర్యాంకు వచ్చిన విద్యార్థులు వర్సిటీలో ఉచితంగా చదువుకోవచ్చు. మిగిలిన వారు మాత్రం పెంచిన ఫీజు కట్టాల్సి ఉంటుంది.
Also Read : నిరుద్యోగ యువతకు ఉచిత ఉపాధి శిక్షణ, ఆపై ఉద్యోగాలు!
Also Read: భారతీయ విద్యార్థులకు గుడ్ న్యూస్, ఒక్కరోజులోనే వీసా!