అన్వేషించండి

TG EDCET Results: తెలంగాణ ఎడ్‌సెట్‌ ఫలితాలు వచ్చేస్తున్నాయ్, ఎప్పుడంటే?

TS EDCET Results: తెలంగాణ ఎడ్‌సెట్ ప్రవేశ పరీక్ష ఫలితాలను జూన్ 11న వెల్లడించనున్నారు. ఉన్నతవిద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు  ఫ‌లితాల‌ను విడుద‌ల చేయ‌నున్నారు.

Telangana EDCET Results 2024: తెలంగాణలోని బీఈడీ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించిన టీఎస్‌ఎడ్‌సెట్-2024 (TS EDCET-2024) పరీక్ష ఫలితాలను జూన్ 11న వెల్లడించనున్నారు. హైదరాబాద్ మాసబ్ ట్యాంకులోని ఉన్నతవిద్యామండలి కార్యాలయంలో చైర్మన్ ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు  ఫ‌లితాల‌ను విడుద‌ల చేయ‌నున్నారు. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. అభ్యర్థులు అవసరమైన వివరాలు నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు. అలాగే ఎడ్‌సెట్ ర్యాంకు కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. గతేడాది రాష్ట్రవ్యాప్తంగా 49 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన ఎడ్‌సెట్ పరీక్షకు 27,495 మంది అభ్యర్థులు హాజరుకాగా.. 26,994 అభ్యర్థులు (98.18%) ఉత్తీర్ణత సాధించారు.

టీజీఎడ్‌సెట్-2024 ప్రవేశ పరీక్షను కంప్యూట‌ర్ ఆధారిత విధానంలో మే 23న నిర్వహించిన సంగతి తెలిసిందే. రెండు సెష‌న్లలో ప‌రీక్షలు నిర్వహించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్‌లో, మధ్యాహ్నం 2  నుంచి సాయంత్రం 4 గంటల వరకు రెండో సెషన్‌లో ప్రవేశపరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు మొత్తం 33,879 మంది అభ్యర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. మొదటి సెష‌న్‌‌లో నిర్వహించిన పరీక్షకు 16,929 మందికి గానూ 14,633 మంది, రెండో సెష‌న్ 16,950 మందికి గానూ 14,830 మంది అభ్యర్థులు హాజ‌ర‌య్యారు. మొత్తం 87% హాజరుశాతం నమోదైంది. ఈ ఏడాది నల్గొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఎడ్‌సెట్ పరీక్షల బాధ్యత చేపట్టిన సంగతి తెలిసిందే. ఎడ్‌సెట్ ప్రవేశ పరీక్ష ద్వారా రెండేళ్ల బీఎడ్ (బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్) కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. రాష్ట్రంలోని బీఈడీ కళాశాలల్లో మొత్తం 14285 బీఈడీ సీట్లు అందుబాటులో ఉన్నాయి. 

ఎడ్‌సెట్-2024 (TS EDCET Results) ఫలితాలు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..

➥ ఫలితాల కోసం విద్యార్థులు మొదట ఎన్‌టీఏ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి - https://edcet.tsche.ac.in/

➥ అక్కడ హోంపేజిలో కనిపించే ఫలితాలు/ర్యాంకు కార్డుకు సంబంధించిన లింక్ మీద క్లిక్ చేయాలి. 

➥ ఆ తర్వాత వచ్చే పేజీలో విద్యార్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు నెంబరు, హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి 'View Result/View Rank Card' బటన్ మీద క్లిక్ చేయాలి. 

➥ ప్రవేశ పరీక్ష ఫలితాలు/ర్యాంకు కార్డు కంప్యూటర్ స్క్రీన్ మీద కనిపిస్తాయి. 

➥ విద్యార్థులు ఫలితాలు/ర్యాంకు కార్డు డౌన్‌లోడ్ చేసుకోవాలి. ప్రింట్ తీసి భవిష్యత్ అవసరాల కోసం భద్రపరచుకోవాలి.

ఎడ్‌సెట్ ఫ‌లితాలు, ర్యాంకు కార్డుల కోసం వెబ్‌సైట్..

పరీక్ష విధానం..
మొత్తం 150 మార్కులకు కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష నిర్వహిస్తారు. వీటిలో మ్యాథ్స్, సైన్స్, సోషల్ స్టడీస్ (10వ తరగతి వరకు)- 60 ప్రశ్నలు-60 మార్కులు, టీచింగ్ ఆప్టిట్యూడ్-20 ప్రశ్నలు-20 మార్కులు, జనరల్ ఇంగ్లిష్-20 ప్రశ్నలు-20 మార్కులు, జనరల్ నాలెడ్జ్ & ఎడ్యుకేషనల్ ఇష్యూస్-30 ప్రశ్నలు-30 మార్కులు, కంప్యూటర్ అవేర్‌నెస్-20 ప్రశ్నలు-20 మార్కులు.

అర్హత మార్కులు.. 
ఎడ్‌సెట్-2024 ప్రవేశ పరీక్షకు సంబంధించి అర్హత మార్కులను 25 శాతం (38 మార్కులు)గా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎలాంటి అర్హత మార్కులు లేవు. అయితే ఎన్‌సీసీ/స్పోర్ట్స్ కోటా/పీహెబ్/ఆర్మ్‌డ్ పర్సనల్ కోటాకు చెందిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు మాత్రం నిర్ణీత కనీస అర్హత మార్కులు సాధించాల్సి ఉంటుంది. 

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Sharmila: జగన్ హయాంలో లాక్కోవడం ట్రెండ్‌, మరి కూటమి సర్కార్ ఏం చేస్తోంది: షర్మిల ఫైర్
YS Sharmila: జగన్ హయాంలో లాక్కోవడం ట్రెండ్‌, మరి కూటమి సర్కార్ ఏం చేస్తోంది: షర్మిల ఫైర్
Harish Rao Phone Tapping Case: నా భార్యతో ఫోన్ సంభాషణలు విన్నారు, హరీష్ రావుపై కేసులో కీలక ఆధారాలు బయటపెట్టిన చక్రధర్
నా భార్యతో ఫోన్ సంభాషణలు విన్నారు, హరీష్ రావుపై కేసులో కీలక ఆధారాలు బయటపెట్టిన చక్రధర్
AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవే - కాకినాడ పోర్టు, అదానీ వ్యవహారంపై కీలక చర్చ
ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవే - కాకినాడ పోర్టు, అదానీ వ్యవహారంపై కీలక చర్చ
Minister Sridharbabu : ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Police Case on Harish Rao | మాజీ మంత్రి హరీశ్ రావుపై కేసు నమోదు | ABP Desamలవర్స్ మధ్య గొడవ, కాసేపటికి బిల్డింగ్ కింద శవాలుకాళీయమర్ధనుడి అలంకారంలో  సిరుల‌త‌ల్లిరెండుగా వీడిపోయిన గూడ్స్ ట్రైన్, అలాగే వెళ్లిపోయిన లోకోపైలట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila: జగన్ హయాంలో లాక్కోవడం ట్రెండ్‌, మరి కూటమి సర్కార్ ఏం చేస్తోంది: షర్మిల ఫైర్
YS Sharmila: జగన్ హయాంలో లాక్కోవడం ట్రెండ్‌, మరి కూటమి సర్కార్ ఏం చేస్తోంది: షర్మిల ఫైర్
Harish Rao Phone Tapping Case: నా భార్యతో ఫోన్ సంభాషణలు విన్నారు, హరీష్ రావుపై కేసులో కీలక ఆధారాలు బయటపెట్టిన చక్రధర్
నా భార్యతో ఫోన్ సంభాషణలు విన్నారు, హరీష్ రావుపై కేసులో కీలక ఆధారాలు బయటపెట్టిన చక్రధర్
AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవే - కాకినాడ పోర్టు, అదానీ వ్యవహారంపై కీలక చర్చ
ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవే - కాకినాడ పోర్టు, అదానీ వ్యవహారంపై కీలక చర్చ
Minister Sridharbabu : ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
Pushpa 2 Climax: దేవి శ్రీ లేదా సామ్... పుష్ప 2 క్లైమాక్స్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చేసింది ఎవరు?
దేవి శ్రీ లేదా సామ్... పుష్ప 2 క్లైమాక్స్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చేసింది ఎవరు?
Maharashtra Govt Formation: మహరాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీకి 17 మంత్రి పదవులు, షిండే వర్గంలో ఏడుగురికి ఛాన్స్
మహరాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీకి 17 మంత్రి పదవులు, షిండే వర్గంలో ఏడుగురికి ఛాన్స్
Kakinada Port Ship Seized: అవి రేషన్ బియ్యమే, కాకినాడ పోర్టులో షిప్‌ సీజ్ చేశాం: కలెక్టర్ కీలక వ్యాఖ్యలు
అవి రేషన్ బియ్యమే, కాకినాడ పోర్టులో షిప్‌ సీజ్ చేశాం: కలెక్టర్ కీలక వ్యాఖ్యలు
Pushpa 2: 'పుష్ప 2'కు హైకోర్టులో లైన్ క్లియర్... ఆఖరి నిమిషంలో రిలీజ్ ఆపలేమన్న కోర్టు, కానీ ఓ ట్విస్ట్
'పుష్ప 2'కు హైకోర్టులో లైన్ క్లియర్... ఆఖరి నిమిషంలో రిలీజ్ ఆపలేమన్న కోర్టు, కానీ ఓ ట్విస్ట్
Embed widget