అన్వేషించండి

TS EAMCET Results 2022 : నేడు తెలంగాణ ఎంసెట్, ఈసెట్ ఫలితాలు

TS EAMCET Results 2022 : తెలంగాణ ఎంసెట్, ఈసెట్ పరీక్షల ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. రేపు ఉదయం ఎంసెట్ , ఈసెట్ ఫలితాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేయనున్నారు.

తెలంగాణ ఎంసెట్, ఈసెట్ ఫలితాలు ఆగస్టు 12న విడుదల కానున్నాయి. ఇంజి‌నీ‌రింగ్‌, అగ్రి‌క‌ల్చర్‌, మెడి‌కల్‌ ఫలి‌తా‌లను విద్యా‌శాఖ మంత్రి సబి‌తా‌ ఇం‌ద్రా‌రెడ్డి ఉద‌యం 11 గంట‌ల‌కు జేఎన్టీయూలో విడు‌దల చేయ‌నున్నారు. ఈ ఫ‌లితాల‌ను విడుద‌ల చేసిన అనంత‌రం ఉద‌యం 11:45 గంట‌ల‌కు ఈసెట్ ఫ‌లితాలు విడుద‌ల కానున్నాయి. ఎంసెట్, ఈసెట్ పరీక్షలు రాసిన విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ ఫలితాలను చూసుకోవచ్చు. 


ఎంసెట్ ఫలితాల కోసం వెబ్‌సైట్:  https://eamcet.tsche.ac.in/


రాష్ట్రంలోని వివిధ ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలకు జులై 18 నుంచి 20 వరకు ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్ష నిర్వహించారు. మూడు రోజుల్లో రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించారు. ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షకు సంబంధించి మొత్తం 1,72,243 మంది విద్యార్థులు ఎంసెట్ ఎగ్జామ్ కోసం దరఖాస్తు చేసుకోగా, కేవలం 1,56,812 మంది మాత్రమే హాజరయ్యారు. 9 శాతం విద్యార్థులు పరీక్ష రాయలేదు. అదేవిధంగా ఎంసెట్‌ అగ్రికల్చర్‌ పరీక్షలను జులై 30, 31వ తేదీల్లో నిర్వహించారు. ఈ పరీక్షలకు మొత్తం 94,476 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. 80,575 (85.3 శాతం) మంది పరీక్షకు హాజరయ్యారు. ఇప్పటికే ప్రాథమిక సమాధానాలు విడుదల చేసి విద్యార్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరించారు. తుది సమాధానాలతో పాటు ఫలితాలను ఎంసెట్ కమిటీ విశ్లేషించింది. దీంతో ఫలితాల వెల్లడికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 


ఈసెట్ ఫలితాలు కూడా..

తెలంగాణ ఎంసెట్ ఫలితాలతోపాటు ఈసెట్ ఫలితాలను కూడా ఆగస్టు 12న విడుదల చేయనున్నారు. టీఎస్‌ఈసెట్‌-2022 ఆగస్టు 1న రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. పరీక్ష కోసం తెలంగాణ, ఏపీల్లో కలిపి 24,055 మంది దరఖాస్తు చేసుకోగా 22,001 (91.46శాతం)మంది విద్యార్థులు హాజరయ్యారు. టీఎస్‌ఈసెట్‌ ప్రాథమిక 'కీ'ని ఆగస్టు 2న సాయంత్రం 6 గంటలకు విడుదల చేసిన సంగతి తెలిసిందే. అభ్యర్థుల నుంచి అభ్యంతరాల స్వీకరించారు. దీంతో ఆగస్టు 12న ఫలితాలను వెల్లడించనున్నారు. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచనున్నారు.


ఈసెట్ ఫలితాల కోసం వెబ్‌సైట్: https://ecet.tsche.ac.in/

వాస్తవానికి ఎంసెట్ పరీక్ష జులై 14, 15 తేదీల్లో నిర్వహించాల్సి ఉండగా.. భారీ వర్షాల కారణంగా జులై 18 నుంచి 20 వరకు రెండు విడతలుగా పరీక్షలను నిర్వహించిన విషయం తెలిసిందే. ఫలితాలు విడుదలైన అనంతరం మొదటి విడత కౌన్సెలింగ్ నిర్వహించే అవకాశం ఉంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఆన్‌లైన్‌లో ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. సర్టిఫికేట్ల వేరిఫికేషన్ అనంతరం వెబ్ ఆఫ్షన్లు ఇస్తారు. అనంతరం సీట్ల కేటాయింపు ఉండనుంది.

ఫలితాల విడుదల అనంతరం అభ్యర్థులు తమ ఫలితాలను ఇలా చెక్ చేసుకోవచ్చు..

Step 1: అభ్యర్థులు మొదటగా https://eamcet.tsche.ac.in/ వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి.

Step 2: అనంతరం హోం పేజీలో EAMCET Results 2022 సంబంధించిన లింక్ కనిపిస్తుంది. ఆ లింక్ పై క్లిక్ చేయాలి. 

Step 3: అనంతరం కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఆ పేజీలో అభ్యర్థులు హాల్ టికెట్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ నమోదు చేసి SUBMIT పై క్లిక్ చేయాలి.

Step 4: తర్వాత మీ రిజల్ట్ స్క్రీన్ పై కనిపిస్తుంది. ఆ కాపీని ప్రింట్ తీసుకుని భవిష్యత్ అవసరాల కోసం భద్రపరుచుకోవాలి. 

 

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Naidu Meets PM Modi: ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu Meets PM Modi: ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Trump TV Ads: అమెరికాలో కొత్త వివాదం.. ప్రజాధనతో టీవీ యాడ్స్.. డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాట్ల దావా
అమెరికాలో కొత్త వివాదం.. ప్రజాధనతో టీవీ యాడ్స్.. డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాట్ల దావా
Kanpur Fraud Case: ప్రేమ పెళ్లి పేరుతో థాయ్ మహిళను చీటింగ్.. రూ. 60 లక్షలు దోచేసిన కాన్పూర్ వ్యాపారి
ప్రేమ పెళ్లి పేరుతో థాయ్ మహిళను చీటింగ్.. రూ. 60 లక్షలు దోచేసిన కాన్పూర్ వ్యాపారి
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Embed widget