MJPTBCW RJC CET 2024: బీసీ గురుకుల ఇంటర్ ప్రవేశపరీక్ష ఫలితాల విడుదల, ఫలితాలు ఇలా చూసుకోండి
Telangana లోని బీసీ సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలల్లో 2024-25 విద్యాసంవత్సరానికి నిర్వహించిన ప్రవేశపరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. గురుకుల సొసైటీ కార్యదర్శి సైదులు మే 19న ఫలితాలను విడుదల చేశారు.
MJPTBCW RJC-CET-2024 Results: తెలంగాణలోని బీసీ సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలల్లో 2024-25 విద్యాసంవత్సరానికి నిర్వహించిన ప్రవేశపరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. గురుకుల సొసైటీ కార్యదర్శి సైదులు మే 19న ఫలితాలను విడుదల చేశారు. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. విద్యార్థులు తమ హాల్‌టికెట్ నెంబరు లేదా ఫోన్ నెంబరు, పుట్టినతేదీ, వెరిఫికేషన్ కోడ్ వివరాలు నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు.
విద్యార్థులు సాధించిన మెరిట్ ఆధారంగా సీట్లు, కళాశాలలను కేటాయించినట్లు గురుకుల సొసైటీ కార్యదర్శి పేర్కొన్నారు. సీట్లు పొందిన వారు సంబంధిత కళాశాలల్లో మే 20 నుంచి 30 లోగా రిపోర్టు చేయాలని ఆయన సూచించారు. ఇంటర్ ప్రవేశాలకు ఏప్రిల్ 28న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. విద్యార్థులకు రెగ్యులర్ ఇంటర్ కోర్సులతోపాటు ఐఐటీ, నీట్, ఎప్‌సెట్, సీఏ/సీపీటీ, క్లాట్ ప్రవేశ పరీక్షలకు ఉచితంగా శిక్షణ ఇస్తారు.
బీసీ సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాల ప్రవేశ పరీక్ష ఫలితాలు ఇలా చూసుకోండి..
➥ ఫలితాల కోసం విద్యార్థులు మొదట ఎన్‌టీఏ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి - https://mjpabcwreis.cgg.gov.in/
➥ అక్కడ హోంపేజిలో కనిపించే ''MJPTBCW RJC-CET-2024 Online Results'' లింక్ మీద క్లిక్ చేయాలి.
➥ ఆ తర్వాత వచ్చే పేజీలో విద్యార్థులు తమ హాల్‌టికెట్ నెంబరు లేదా ఫోన్ నెంబరు, పుట్టినతేదీ, వెరిఫికేషన్ కోడ్ వివరాలు నమోదుచేసి 'Get Result' బటన్ మీద క్లిక్ చేయాలి.
➥ ప్రవేశ పరీక్ష ఫలితాలు కంప్యూటర్ స్క్రీన్ మీద కనిపిస్తాయి.
➥ విద్యార్థులు ఫలితాలు డౌన్‌లోడ్ చేసుకోవాలి. ప్రింట్ తీసి భవిష్యత్ అవసరాల కోసం భద్రపరచుకోవాలి.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 261 బీసీ జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ఇందులో 130 బాలుర జూనియర్ కాలేజీల్లో 11,360 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇక 127 బాలికల జూనియర్ కాలేజీల్లో 10,560 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇక మిగతా 4 కళాశాలలు ప్రతిభా కళాశాలలు (COE)గా ఉన్నాయి. జూనియర్ కాలేజీల్లో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ, హెచ్‌ఈసీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటితోపాటు ఒకేషనల్ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి.
జూనియర్ కాలేజీల్లో కోర్సులు..
➥ ఎంపీసీ
➥ బైపీసీ
➥ ఎంఈసీ
➥ సీఈసీ
➥ హెచ్‌ఈసీ
ఒకేషనల్ కోర్సులు..
➥ అగ్రికల్చర్ & క్రాప్ ప్రొడక్షన్
➥ కంప్యూటర్ గ్రాఫిక్స్ & యానిమేషన్
➥ప్రీస్కూల్ టీచర్ ట్రైనింగ్
➥ కమర్షియల్ గార్మెంట్ టెక్నాలజీ
➥ మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ (MPHW)
➥ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్
➥ ఫిజియోథెరపీ
➥ టూరిజం & హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్
ALSO READ:
తెలంగాణ 'మోడల్ స్కూల్స్'లో ఇంటర్ ప్రవేశాల దరఖాస్తుకు మే 25 వరకు అవకాశం, ఎంపిక ఇలా
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 194 ఆదర్శ పాఠశాలల్లో ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ మే 10న వెలువడిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ మే 10న ప్రారంభమైంది. పదోతరగతిలో వచ్చిన జీపీఏ ఆధారంగా ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలు కల్పించనున్నారు. విద్యార్థులు మే 25 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఎంపికైనవారికి ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ ఇంగ్లిష్ మీడియం గ్రూపుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఒక్కో గ్రూపులో 40 సీట్ల చొప్పున మొత్తం 160 సీట్లను భర్తీ చేయనున్నారు. ప్రతి పాఠశాలలో బాలికలకు భోజన, వసతి సౌకర్యం కల్పిస్తారు.
ప్రవేశాలకు సంబంధించిన పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..