తెలంగాణ బీసీ గురుకుల ఇంటర్ ప్రవేశపరీక్ష ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణలోని బీసీ గురుకుల జూనియర్ కళాశాలల్లో 2023-24 విద్యాసంవత్సరంలో ఇంటర్ ప్రవేశాలకు నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలు వెలువడ్డాయి.
తెలంగాణలోని బీసీ గురుకుల జూనియర్ కళాశాలల్లో 2023-24 విద్యాసంవత్సరంలో ఇంటర్ ప్రవేశాలకు నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలు వెలువడ్డాయి. ఫలితాలను బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్, ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, గురుకుల సొసైటీ కార్యదర్శి మల్లయ్యబట్టు విడుదల చేశారు. ఫలితాలను బీసీ గురుకుల వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. సీట్లు పొందిన విద్యార్థులు జూన్ 1 నుంచి 10లోగా సంబంధిత కళాశాలల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది.
ఈసారి ఫలితాల్లో ఎంపీసీలో సిద్దిపేట జిల్లాకు చెందిన పి.జ్యోత్స్న 122 మార్కులతో తొలి ర్యాంక్ సాధించింది. బైపీసీలో నల్గొండ జిల్లాకు చెందిన పీ శ్రీవల్లి 108 మార్కులతో ఫస్ట్ ర్యాంక్ సాధించింది. ఇక సీఈసీలో ఎంఈసీలో మేడ్చల్ జిల్లాకు చెందిన ఎ.అర్చన 109 మార్కులతో తొలి స్థానం దక్కించుకున్నారు.
Also Read:
గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీస్, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ సోసైటీల్లో 5వ తరగతి ప్రవేశ పరీక్షా ఫలితాలను రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మే 29న విడుదల చేశారు. సచివాలయంలోని తన చాంబర్‌లో మంత్రి ఫలితాలను విడుదల చేశారు. పరీక్షలకు 1.21 లక్షల మందికిపైగా విద్యార్థులు చేసుకున్నారు. ఏప్రిల్ 23న నిర్వహించిన పరీక్షకు 1,13,219 మంది హాజరయ్యారు. తెలంగాణ సోసషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీల్లో 232 మంది, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్‌లో 77 మంది, మహాత్మా జ్యోతిరావు ఫూలే బీసీ సంక్షేమ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీల్లో 146, ట్రైబల్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీలో 35 సీట్లు భర్తీ చేసినట్లు అధికారులు తెలిపారు.
ఫలితాల కోసం క్లిక్ చేయండి..
బాసర ట్రిపుల్ ఐటీ షెడ్యూల్ విడుదల, జూన్ 5 నుంచి దరఖాస్తులు ప్రారంభం!
తెలంగాణలోని బాసర ఆర్జీయూకేటీ ట్రిపుల్ ఐటీలో ఆరేళ్ల బీటెక్ కోర్సులో 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించిన ప్రవేశ షెడ్యూలు విడుదలైంది. ఆర్జీయూకేటీ వీసీ ప్రొఫెసర్ వి.వెంకటరమణ బుధవారం (మే 24) షెడ్యూలును ప్రకటించారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జూన్ 1న నోటిఫికేషన్ వెలువడనుంది. జూన్ 5 నుంచి 19 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. అయితే స్పెషల్ కేటగిరీ కింద పీహెచ్, ఎన్‌సీసీ, స్పోర్ట్స్ తదితర విద్యార్థులు జూన్ 24 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. జూన్ 26న మెరిట్ జాబితాను ప్రకటించనున్నారు. జులై 1న ఎంపికైన అభ్యర్థులు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి..
నిట్ వరంగల్‌లో ఎంబీఏ ప్రోగ్రామ్, ప్రవేశం ఇలా!
వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ ఎంబీఏ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ఇంజినీరింగ్ డిగ్రీతోపాటు క్యాట్ లేదా మ్యాట్ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. క్యాట్/ మ్యాట్ స్కోర్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.1600 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు రూ.800 చెల్లిస్తే సరిపోతుంది. దరఖాస్తులు సమర్పించడానికి జూన్ 19 వరకు అవకాశం ఉంది.
కోర్సు వివరాల కోసం క్లిక్ చేయండి..