TG SSC Supply Results: తెలంగాణలో టెన్త్ క్లాస్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్
Telanana 10th class results | తెలంగాణలో ఇటీవల నిర్వహించిన అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు శుక్రవారం నాడు విడుదలయ్యాయి. 73.35 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు.

Telangana SSC Supply Results| హైదరాబాద్: తెలంగాణలో పదో తరగతి ఫెయిలైన విద్యార్థులకు అలర్ట్. టెన్త్ విద్యార్థుల అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు శుక్రవారం (జూన్ 27న) విడుదలయ్యాయి. 73.35 శాతం మంది విద్యార్థులు పాసయ్యారని అధికారులు తెలిపారు. జూన్ 3 నుంచి 13వ తేదీ వరకు జరిగిన సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు. విద్యాశాఖ అధికారులు నేటి మధ్యాహ్నం అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ రిజల్ట్స్ ను విడుదల చేశారు. టెన్త్ సప్లిమెంటరీ ఫలితాల కోసం క్లిక్ చేయండి https://bse.telangana.gov.in/ASERESJUN25/
సప్లిమెంటరీ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 42,832 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటే పరీక్షలకు 38,741 మంది మాత్రమే హాజరయ్యారు. సప్లిమెంటరీ పరీక్షలకు హాజరైన వారిలో 24,415మంది ఉత్తీర్ణత సాధించారు. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రోల్ నంబర్ ఎంటర్ చేసి ఫలితాలు చెక్ చేసుకోవచ్చునని సూచించారు.
ఏప్రిల్ నెలలో టెన్త్ ఫలితాలు
ఏప్రిల్ 30న తెలంగాణలో టెన్త్ రెగ్యూలర్ ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డి టెన్త్ ఫలితాలు (TG 10th Class Results) విడుదల చేశారు. ఈ ఏడాది టెన్త్ ఫలితాలలో 92.78 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఫెయిలైన వారికి సప్లిమెంటరీ షెడ్యూల్ విడుదల చేశారు. మార్చి నెల పరీక్షలలో విద్యార్థుల ఫలితాలు వివరాలు ఇలా ఉన్నాయి.
రెగ్యులర్ విద్యార్థులు
- పదవ తరగతి రెగ్యులర్ విద్యార్ధుల ఉత్తీర్ణతా శాతము 92.78 %
- బాలురు సాధించిన ఉత్తీర్ణతా శాతము 91.32 %, బాలికల ఉత్తీర్ణతా శాతము 94.26 %
- బాలికలు, బాలుర కంటే 2.94% అధికంగా ఉత్తీర్ణత సాధించారు.
ప్రైవేట్ విద్యార్ధులు:
- పదవ తరగతి ప్రైవేటు విద్యార్థుల ఉత్తీర్ణతా శాతము 57.22 %
- బాలురు సాధించిన ఉత్తీర్ణతా శాతము 55.14 %, బాలికల ఉత్తీర్ణతా శాతము 61.70 %
- బాలికలు, బాలుర కంటే 6.56 % అధికంగా ఉత్తీర్ణత సాధించారు.






















