SV College of Music: ఎస్వీ మ్యూజిక్, డాన్స్ కాలేజీలో దరఖాస్తులకు ఆహ్వానం, ఈ తేదీ నుంచే
SV College Admissions: మే 25వ తేదీ నుండి ఎస్వీ సంగీత, నృత్య కళాశాల, నాదస్వర పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం ఉంటుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
SV College of Music and Dance Tirupati: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో ఉన్న తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల, ఎస్వీ నాదస్వరం, డోలు పాఠశాలలో 2024-25 విద్యా సంవత్సరానికి గాను పలు రెగ్యులర్ కోర్సుల్లో ప్రవేశాలకు అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. మే 25వ తేదీ నుండి కళాశాలలో దరఖాస్తులు జారీ చేస్తారు. పూర్తిచేసిన దరఖాస్తులను జూన్ 12వ తేదీ వరకు స్వీకరిస్తారు.
ఎస్వీ సంగీత, నృత్య కళాశాలలో గాత్రం, వయోలిన్, వీణ, ఫ్లూట్, నాదస్వరం, భరతనాట్యం, హరికథ, మృదంగం, డోలు, ఘటం విభాగాల్లో ఫుల్‌టైమ్ విశారద (డిప్లొమా), ప్రవీణ (అడ్వాన్డ్స్ డిప్లొమా) కోర్సులు ఉన్నాయి. ఎస్వీ నాదస్వరం, డోలు పాఠశాలలో ఫుల్‌టైమ్ సర్టిఫికేట్, డిప్లొమా కోర్సులు ఉన్నాయి. ఇతర ప్రాంతాల విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పించడం జరుగుతుంది.
ఆసక్తి గల అభ్యర్థులు కళాశాలలో రూ.50/- చెల్లించి దరఖాస్తు పొందొచ్చు. ఇతర వివరాలకు 0877-2264597, 7330811173, 9848374408, 9440793205 నంబర్లలో సంప్రదించగలరని టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారి ఓ ప్రకటన విడుదల చేశారు.