అన్వేషించండి

AP SSC Exams: 'పది' పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు, హాజరుకానున్న 7 లక్షలకుపైగా విద్యార్థులు

Andhra Pradesh 10th Exams: ఏపీలో పదోతరగతి పరీక్షలు మార్చి 18 నుంచి 30 వరకు జరుగనున్నాయి. ఆయాతేదీల్లో ప్రతిరోజు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి.

AP SSC Exams: ఏపీలో పదోతరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 18 నుంచి ప్రారంభంకానున్నాయి. మార్చి 18 నుంచి 30 వరకు  పరీక్షలు జరుగనున్నాయి. ఆయాతేదీల్లో ప్రతిరోజు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ ఏడాది పదోతరగతి పబ్లిక్ పరీక్షలకు దాదాపు 6 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. మార్చి 18న ఫస్డ్ లాంగ్వేజ్ పేపర్-1, మార్చి 19న సెకండ్ లాంగ్వేజ్‌, మార్చి 20న ఇంగ్లిష్, మార్చి 22న మ్యాథమెటిక్స్, మార్చి 23న ఫిజికల్ సైన్స్, మార్చి 26న బయాలజీ, మార్చి 27న సోషల్ స్టడీస్.. మార్చి 28,30 తేదీల్లో వొకేషనల్ పరీక్షలు నిర్వహించనున్నారు. 

టెన్త్ పరీక్షలకు 7, 25,620 మంది విద్యార్ధులు హాజరుకానున్నారు. ఇందులో రెగ్యులర్ విద్యార్ధులు 6,23,092.. గతేడాది ఫెయిలై రీ ఎన్‌రోల్ అయిన విద్యార్ధులు 1,02,528. రాష్ట్ర వ్యాప్తంగా 3473 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 8.45 గంటల నుంచి పరీక్షా కేంద్రాల లోపలికి విద్యార్ధులకు అనుమతిస్తారు. లీకేజీ ఆరోపణలు రాకుండా విద్యా శాఖ పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఇన్విజలేటర్లు, చీఫ్ సూపరింటెండెంట్లు, ఇతర అధికారులు సైతం పరీక్షా కేంద్రాలకు సెల్ ఫోన్లు తీసుకురాకుండా నిషేధించారు. సమస్యాత్మకమైన 130 పరీక్షా కేంద్రాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. టెక్నాలజీ సాయంతో లీకేజ్‌కి చెక్ పెట్టేవిధంగా.. ప్రతీ ప్రశ్నా పత్రానికి ప్రత్యేకంగా యూనిక్ కోడ్ నంబర్ కేటాయించారు. యూనిక్ కోడ్ ద్వారా ఏ సెంటర్ నుంచి ఎవరు పేపర్ లీక్ చేశారో తెలుసుకునే అవకాశం ఉంటుంది. 

బస్సులో ఉచిత ప్రయాణం..
ఏపీలో పదోతరగతి విద్యార్థులకు ఏపీఎస్‌ఆర్‌టీసీ గుడ్‌న్యూస్ తెలిపింది. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చని తెలిపింది. పరీక్షలు రాసే విద్యార్థులు ఆర్టీసీ బస్సుల్లో తమ హాల్‌టికెట్లు చూపించి ఇంటి నుంచి పరీక్ష కేంద్రాలకు, ఆ తర్వాత ఇళ్లకు ఉచితంగా వెళ్ళవచ్చని పేర్కొంది. పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఏపీఎస్‌ఆర్‌టీసీ సూచించింది. 

ఏడు పేపర్లతో పరీక్ష..
ఆంధ్రప్రదేశ్‌లో పదోతరగతి పబ్లిక్ పరీక్షలను గతేడాది ఆరు పేపర్లతో నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఏడాది నుంచి ఏడు పేపర్ల విధానం అమలు చేయనున్నారు. భౌతిక, రసాయనశాస్త్రాలు కలిపి ఒక పేపర్‌గా 50 మార్కులకు, జీవశాస్త్రం 50 మార్కులకు మరో పేపర్‌గా పరీక్ష నిర్వహించనున్నారు. ఈ రెండు పరీక్షలను వేర్వేరు రోజుల్లో నిర్వహిస్తారు. రెండింటిలోనూ 17 చొప్పున ప్రశ్నలు ఉంటాయి. రెండింటిలో కలిపి 35 మార్కులు సాధిస్తే ఉత్తీర్ణులైనట్లే. తెలుగు, హిందీ, ఇంగ్లిష్, మ్యాథమెటిక్స్, సోషల్ స్టడీస్ పేపర్లు యథావిధిగా ఉంటాయి. 

కంట్రోల్ రూమ్ ఏర్పాటు..
రాష్ట్ర స్ధాయిలో 0866-2974540 నంబర్‌తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ప్రతీ జిల్లాలో కలెక్టర్లు, డిఇఓల పర్యవేక్షణలో జిల్లా స్ధాయి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. పదో తరగతి పరీక్షల పర్యవేక్షణకు ప్రతీ జిల్లాకి ఒక పరిశీలకుడిని నియమించారు. రాష్ట్ర వ్యాప్తంగా 156 ఫ్లైయింగ్ స్క్వాడ్ లు, 682 సిట్టింగ్ స్క్వాడ్‌లు ఏర్పాటు చేశారు. పదవ తరగతి పరీక్షల నిర్వహణకి 3473 చీఫ్ సూపరింటెండెంట్లు, 3473 మంది డిపార్ట్‌మెంటల్ అధికారులు, 35119 మంది ఇన్విజలేటర్లను నియమించారు. వేసవి తీవ్రత నేపథ్యంలో పతీక్షా కేంద్రాల వద్ద తాగు నీరు, టెంట్లు ఏర్పాట్లు చేశారు. 31 నుంచి టెన్త్ స్పాట్ వాల్యూయేషన్ జరపనున్నారు.

పదోతరగతి పరీక్షల షెడ్యూలు..

➥ మార్చి 18: ఫస్డ్ లాంగ్వేజ్ పేపర్-1

➥ మార్చి 19: సెకండ్ లాంగ్వేజ్

➥ మార్చి 20: ఇంగ్లిష్

➥ మార్చి 22: తేదీ మ్యాథమెటిక్స్

➥ మార్చి 23: ఫిజికల్ సైన్స్

➥ మార్చి 26: బయాలజీ 

➥ మార్చి  27: సోషల్ స్టడీస్ పరీక్షలు

➥ మార్చి 28: మొదటి లాంగ్వేజ్ పేపర్-2 (కాంపోజిట్ కోర్సు)/ ఓఎస్ ఎస్ ఇ మెయిన్ లాంగ్వేహ్ పేపర్ -1 

➥ మార్చి 30:  ఓఎస్ఎస్ ఇ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ -2 ( సంస్కృతం, అరబిక్,పర్షియన్), వొకేషనల్ కోర్సు పరీక్ష 

టెన్త్  మోడల్ పేపర్లు, బ్లూప్రింట్ కోసం క్లిక్ చేయండి..

AP SSC Exam Time Table: ఏపీ పదోతరగతి పరీక్షల షెడ్యూలు విడుదల, ఏ ఎగ్జామ్ ఎప్పుడంటే?

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Where is Perni Nani: పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
Kadapa Corporation Meeting: కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో రసాభాస, కూర్చీ వేయలేదని ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఫైర్
కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో రసాభాస, కూర్చీ వేయలేదని ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఫైర్
Manu Bhaker News: మను భాకర్ కు షాక్- ఖేల్ రత్న నామినేషన్లలో తన పేరు గల్లంతు, అశ్విన్ కోసం తమిళ ఎంపీ లాబీయింగ్!
మను భాకర్ కు షాక్- ఖేల్ రత్న నామినేషన్లలో తన పేరు గల్లంతు, అశ్విన్ కోసం తమిళ ఎంపీ లాబీయింగ్!
PV Narasimha Rao: తెలంగాణ ఠీవి, ఆర్థిక సంస్కరణల పితామహుడు పీవీకి ప్రముఖుల నివాళులు
తెలంగాణ ఠీవి, ఆర్థిక సంస్కరణల పితామహుడు పీవీకి ప్రముఖుల నివాళులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Police Released CCTV Footage of Allu Arjun | అల్లు అర్జున్ సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేసిన పోలీసులు | ABP DesamNara Devaansh Chess World Record | వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటుసాధించిన దేవాన్ష్ | ABP DesamAttack on Allu Arjun House | అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి | ABP Desam8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Where is Perni Nani: పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
Kadapa Corporation Meeting: కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో రసాభాస, కూర్చీ వేయలేదని ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఫైర్
కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో రసాభాస, కూర్చీ వేయలేదని ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఫైర్
Manu Bhaker News: మను భాకర్ కు షాక్- ఖేల్ రత్న నామినేషన్లలో తన పేరు గల్లంతు, అశ్విన్ కోసం తమిళ ఎంపీ లాబీయింగ్!
మను భాకర్ కు షాక్- ఖేల్ రత్న నామినేషన్లలో తన పేరు గల్లంతు, అశ్విన్ కోసం తమిళ ఎంపీ లాబీయింగ్!
PV Narasimha Rao: తెలంగాణ ఠీవి, ఆర్థిక సంస్కరణల పితామహుడు పీవీకి ప్రముఖుల నివాళులు
తెలంగాణ ఠీవి, ఆర్థిక సంస్కరణల పితామహుడు పీవీకి ప్రముఖుల నివాళులు
YS Jagan News: రేపు బెంగళూరు నుంచి రానున్న జగన్, 4 రోజులపాటు పులివెందులలో పర్యటన వివరాలివే
రేపు బెంగళూరు నుంచి రానున్న జగన్, 4 రోజులపాటు పులివెందులలో పర్యటన వివరాలివే
They Call Him OG : 'ఓజీ' కోసం రంగంలోకి 'పుష్ప' కొరియోగ్రాఫర్... ఆ స్పెషల్ సాంగ్​తో మెగా ఫ్యాన్స్​కు పూనకాలే
'ఓజీ' కోసం రంగంలోకి 'పుష్ప' కొరియోగ్రాఫర్... ఆ స్పెషల్ సాంగ్​తో మెగా ఫ్యాన్స్​కు పూనకాలే
Allu Arjun House Attack Case: అల్లు అర్జున్ ఇంటిపై దాడి కేసులో కీలక పరిణామం, ఆరుగురు నిందితులకు బెయిల్
అల్లు అర్జున్ ఇంటిపై దాడి కేసులో కీలక పరిణామం, ఆరుగురు నిందితులకు బెయిల్ మంజూరు
Unstoppable 4 : వెంకీ మామ, బాలయ్య ఒకే స్టేజ్ మీద... నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్ ఎంటర్‌టైనింగ్ ఎపిసోడ్‌ రిలీజ్ డేట్
వెంకీ మామ, బాలయ్య ఒకే స్టేజ్ మీద... నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్ ఎంటర్‌టైనింగ్ ఎపిసోడ్‌ రిలీజ్ డేట్
Embed widget