అన్వేషించండి

CLAT 2023 Application: నేటితో ముగియనున్న 'క్లాట్-2023' దరఖాస్తు గడువు, డోంట్ మిస్!!

క్లాట్-2023 ప్రవేశపరీక్ష ద్వారా 5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ లా డిగ్రీతోపాటు, ఏడాది కాలపరిమితి ఉండే పీజీ కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. డిగ్రీ కోర్సుకు ఇంటర్, పీజీ కోర్సులో ప్రవేశానికి లా డిగ్రీతో ఉండాలి.

దేశవ్యాప్తంగా ఉన్న 22 జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల్లో డిగ్రీ, పీజీ లా కోర్సుల్లో ప్రవేశానికి 'కామ‌న్ లా అడ్మిష‌న్ టెస్ట్ (క్లాట్)-2023' ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువు నవంబరు 18తో ముగియనుంది. వాస్తవానికి క్లాట్ దరఖాస్తుకు చివరితేది నవంబరు 13తో ముగియగా.. నవంబరు 18 వరకు పొడిగించారు. ఇప్పటివరకు చివరిరోజు అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.

క్లాట్-2023 ప్రవేశపరీక్ష ద్వారా అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ లా డిగ్రీతోపాటు, ఏడాది కాలపరిమితి ఉండే పీజీ (ఎల్‌ఎల్‌ఎం) కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. డిగ్రీ కోర్సుకు ఇంటర్, పీజీ కోర్సులో ప్రవేశానికి లా డిగ్రీతో ఉత్తీర్ణత ఉండాలి. క్లాట్ ప్రవేశ పరీక్షకు సంబంధించి ఆగస్టు 8 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా. దరఖాస్తుకు చివరితేది నవంబరు 13తో ముగియగా.. నవంబరు 18 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. డిసెంబరు 18న ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నారు. ఆఫ్‌లైన్ విధానంలోనే పరీక్ష నిర్వహిస్తారు.

✸ కామ‌న్ లా అడ్మిష‌న్ టెస్ట్ (క్లాట్)-2023

కోర్సులు..

✪ అండ‌ర్‌గ్రాడ్యుయేట్ (యూజీ) ప్రోగ్రామ్ (ఇంటిగ్రేటెడ్ లా డిగ్రీ)

అర్హత‌: క‌నీసం 45 శాతం మార్కుల‌తో ఇంట‌ర్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 40 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. వచ్చే ఏడాది మార్చి/ ఏప్రిల్‌లో ఇంటర్ ప‌రీక్షలు రాసేవారు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
కోర్సు వ్యవధి: 5 సంవత్సరాలు.

✪ పీజీ ప్రోగ్రామ్ (ఎల్ఎల్ఎం డిగ్రీ)

అర్హత‌: క‌నీసం 50 శాతం మార్కుల‌తో ఎల్ఎల్‌బీ డిగ్రీ ఉత్తీర్ణత‌. వచ్చే ఏడాది ఏప్రిల్/మేలో జరిగే లా డిగ్రీ ప‌రీక్షలు రాసేవారు కూడా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.
కోర్సు వ్యవధి: ఏడాది.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష (క్లాట్‌-2023) ద్వారా.

దరఖాస్తు ఫీజు:  ఎస్సీ, ఎస్టీ, బీపీఎల్ వర్గాలకు చెందిన అభ్యర్థులు రూ.3,500, ఇతరులు రూ.4,000 పరీక్ష ఫీజుగా చెల్లించాలి.

క్లాట్‌ పరీక్ష విధానం..

క్లాట్ యూజీ:

✪ క్లాట్ యూజీ పరీక్ష ఆఫ్‌లైన్‌ విధానంలో జరుగుతుంది. మొత్తం 150 మార్కులకుగాను 150 ప్రశ్నలకు క్లాట్‌ పరీక్ష జరుగుతుంది. ఆబ్జెక్టివ్‌ తరహా ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయిస్తారు. పరీక్ష సమయం రెండు గంటలు. నెగిటివ్‌ మార్కుల విధానం అమల్లో ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కు తగ్గిస్తారు. ప్రశ్న పత్రం ఇంగ్లిష్‌లో ఉంటుంది. 
✪ క్లాట్‌ యూజీలో మొత్తం ఐదు విభాగాల నుంచి ప్రశ్నలుంటాయి. క్వాంటిటేటివ్‌ టెక్నిక్స్‌ విభాగం నుంచి 10శాతం(13–17) , ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ 20 శాతం(28–32), లీగల్‌ రీజనింగ్‌ 20 శాతం(35–39), కరెంట్‌ అఫైర్స్‌(జనరల్‌ నాలెడ్జ్‌తో కలిపి) నుంచి 25శాతం(35–39), లాజికల్‌ రీజనింగ్‌ నుంచి 25శాతం  (28–32) ప్రశ్నలు వస్తాయి. 

పీజీ(ఎల్‌ఎల్‌ఎం) క్లాట్‌:

✪ పీజీ(ఎల్‌ఎల్‌ఎం) క్లాట్‌ పరీక్ష 120 మార్కులకు ఉంటుంది. ప్రశ్నలు మల్టిపుల్‌ చాయిస్‌ పద్ధతిలో అడుగుతారు. పరీక్ష సమయం 2 గంటలు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు తగ్గిస్తారు. ప్రశ్న పత్రం ఇంగ్లిష్‌లో ఉంటుంది. కాన్‌స్టిట్యూషనల్‌ లా 60 ప్రశ్నలు–60 మార్కులు, ఇతర లా సబ్జెక్టులు(కాంట్రాక్ట్, టార్ట్స్, క్రిమినల్, ఇంటర్నేషనల్‌ లా, ఎన్విరాన్‌మెంట్, లేబర్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ లా, ఐపీఆర్‌ తదితర) నుంచి 60 ప్రశ్నలు–60 మార్కులకు పరీక్ష ఉంటుంది.

ఉన్నత విద్య.. అత్యున్నత అవకాశాలు:

క్లాట్ ద్వారా లా డిగ్రీ పూర్తిచేసిన వారు మాస్టర్స్‌ చేయడానికి విదేశాలకు వెళ్లవచ్చు. కేంబ్రిడ్జ్, ఆక్స్‌ఫర్డ్, హార్వర్డ్, సింగపూర్‌ యూనివర్సిటీల్లో లా కోర్సుల్లో చేరడానికి వెళ్తున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. మన దేశంలో పీజీకి సంబంధించి చాలా యూనివర్సిటీలు ఏడాది వ్యవధిగల లా ప్రోగ్రామ్స్‌ను అందిస్తున్నాయి. ఈ ప్రోగ్రామ్స్‌ పూర్తిచేసిన తర్వాత టీచింగ్‌ ఫ్యాకల్టీగా పనిచేయవచ్చు.

న్యాయ విద్య పూర్తిచేసిన వారికి ఉద్యోగావకాశాలకు కొదవ లేదు. లా కోర్సులు ఉత్తీర్ణులైన తర్వాత లీగల్‌ అడ్వైజర్, అడ్వకేట్, లీగల్‌ మేనేజర్, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ లాంటి ఉపాధి అవకాశాలు పొందవచ్చు. సివిల్, క్రిమినల్, వినియోగదారుల చట్టాలు, మనవ హక్కులు, పన్నులు, కంపెనీ లా, మేథో సంపత్తి చట్టాలు, రాజ్యాంగం తదితర అంశాల్లో నైపుణ్యాన్ని సంపాదిస్తే.. ఆయా రంగాల్లో వచ్చే కేసుల ద్వారా కెరీర్‌ పరంగా మంచి పేరు, ఆదాయ పరంగా లబ్ధిపొందవచ్చు. ఇక్కడ కేసులు, వాదన అనుభవం ఆధారంగా ఫీజు లభిస్తుంది.

ముఖ్యమైన తేదీలు...

✦ ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 08.08.2022

✦ ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 18.11.2022.

✦ క్లాట్ ప‌రీక్ష తేది: 18.12.2022 (మ. 2గం. - సా. 4 గం.)

Notification & Application 

Also Read:

విద్యార్థులకు జేఎన్​టీయూ గుడ్ న్యూస్, ఇక ఒకేసారి రెండు డిగ్రీలు!
తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా డ్యూయల్‌ డిగ్రీ కోర్సుకు జేఎన్‌టీయూ శ్రీకారం చుట్టింది. బీటెక్‌తో పాటు బీబీఏ చేసేందుకు అవకాశం కల్పిస్తోంది. ఈ మేరకు వారం రోజుల్లో బీబీఏ(డేటా అనలిటిక్స్‌)లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారు. ఇంజినీరింగ్‌తోపాటు అడ్మినిస్ట్రేటివ్‌ నైపుణ్యాలు ఉంటే సులువుగా ఉద్యోగాలు పొందే వీలుంటుందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఒకేసారి రెండు డిగ్రీలు చేస్తే విద్యార్థులకు ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని, ప్రాంగణ నియామకాల్లో ప్రాధాన్యంతోపాటు అదనపు క్రెడిట్లు దక్కుతాయని రిజిస్ట్రార్‌ మంజూర్‌హుస్సేన్‌ తెలిపారు. సమయం వృథా కాకుండా బీటెక్‌ పూర్తయ్యేలోపే రెండు డిగ్రీలు చేతికి వస్తాయి. వచ్చే విద్యాసంవత్సరం నుంచి బీబీఏలో మరిన్ని కోర్సులు తీసుకురావాలనే ఆలోచన ఉందని ఆయన వెల్లడించారు.
కోర్సుల వివరాల కోసం క్లిక్ చేయండి..

KNRUHS: యూజీ ఆయూష్‌ కోర్సుల్లో ప్రవేశాలు, నేటి నుంచి దరఖాస్తులు
యూజీ ఆయూష్‌ వైద్య కోర్సుల్లో ప్రవేశాలకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటన జారీచేసింది. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆయూష్‌ కళాశాలల్లో కన్వీనర్‌ కోటాలో బీఏఎంఎస్‌, బీహెచ్‌ఎంఎస్‌, బీయూఎంఎస్‌, బీఎన్‌వైఎస్‌ కోర్సులల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతూ నవంబరు 12న నోటిఫికేషన్‌ జారీ చేసింది. 50 శాతం మార్కులతో (ఎస్సీ, ఎస్టీకు 40 శాతం, దివ్యాంగుకు 45 శాతం మార్కులు) ఇంటర్‌ (బైపీసీ) ఉత్తీర్ణులై , నీట్‌-2022లో అర్హత సాధించిన అభ్యర్ధులు నవంబరు 13న ఉదయం 8 గంటల నుండి నవంబరు 20న రాత్రి 8 గంటల వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని వారు సూచించారు. నిర్దేశిత దరఖాస్తు పూర్తి చేయడంతో పాటు అభ్యర్ధులు సంబంధిత సర్టిఫికెట్లను స్కాన్‌ చేసి వెబ్‌సైట్‌లో ఆప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది.
కోర్సుల వివరాలు, దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

టాప్ హెడ్ లైన్స్

Seaplane Services: త్వరలో హుస్సేన్ సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు స్లీ ప్లేన్ సర్వీసులు.. పర్యాటక రంగానికి బూస్ట్
త్వరలో హుస్సేన్ సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు స్లీ ప్లేన్ సర్వీసులు.. పర్యాటక రంగానికి బూస్ట్
TDP Janasena Seat Sharing: స్థానిక పోరులో పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్ - 7 కార్పొరేషన్లపై కన్ను.. చంద్రబాబు రియాక్షన్ ఏంటి?
స్థానిక పోరులో పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్ - 7 కార్పొరేషన్లపై కన్ను.. చంద్రబాబు రియాక్షన్ ఏంటి?
Hyderabad Crime News: కుమార్తెను హుస్సేన్ సాగర్‌లో విసిరేసిన కన్నతల్లి.. ప్రాణాలకు తెగించి కాపాడిన ఆటో డ్రైవర్
కుమార్తెను హుస్సేన్ సాగర్‌లో విసిరేసిన కన్నతల్లి.. ప్రాణాలకు తెగించి కాపాడిన ఆటో డ్రైవర్
Vijayawada Utsav Dasara: మైసూర్ దసరా తరహాలో విజయవాడ ఉత్సవ్ - ఇంద్రకీలాద్రి నవరాత్రులకు నేషనల్ బ్రాండింగ్ ఇచ్చేలా భారీ ప్లాన్!
మైసూర్ దసరా తరహాలో విజయవాడ ఉత్సవ్ - ఇంద్రకీలాద్రి నవరాత్రులకు నేషనల్ బ్రాండింగ్ ఇచ్చేలా భారీ ప్లాన్!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Seaplane Services: త్వరలో హుస్సేన్ సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు స్లీ ప్లేన్ సర్వీసులు.. పర్యాటక రంగానికి బూస్ట్
త్వరలో హుస్సేన్ సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు స్లీ ప్లేన్ సర్వీసులు.. పర్యాటక రంగానికి బూస్ట్
TDP Janasena Seat Sharing: స్థానిక పోరులో పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్ - 7 కార్పొరేషన్లపై కన్ను.. చంద్రబాబు రియాక్షన్ ఏంటి?
స్థానిక పోరులో పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్ - 7 కార్పొరేషన్లపై కన్ను.. చంద్రబాబు రియాక్షన్ ఏంటి?
Hyderabad Crime News: కుమార్తెను హుస్సేన్ సాగర్‌లో విసిరేసిన కన్నతల్లి.. ప్రాణాలకు తెగించి కాపాడిన ఆటో డ్రైవర్
కుమార్తెను హుస్సేన్ సాగర్‌లో విసిరేసిన కన్నతల్లి.. ప్రాణాలకు తెగించి కాపాడిన ఆటో డ్రైవర్
Vijayawada Utsav Dasara: మైసూర్ దసరా తరహాలో విజయవాడ ఉత్సవ్ - ఇంద్రకీలాద్రి నవరాత్రులకు నేషనల్ బ్రాండింగ్ ఇచ్చేలా భారీ ప్లాన్!
మైసూర్ దసరా తరహాలో విజయవాడ ఉత్సవ్ - ఇంద్రకీలాద్రి నవరాత్రులకు నేషనల్ బ్రాండింగ్ ఇచ్చేలా భారీ ప్లాన్!
KCR Farmhouse 45 Acres Missing Land: కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో 45 ఎకరాల మిస్సింగ్ భూమి కలకలం - నోటీసులు రెడీ..రాజకీయ భూకంపం తప్పదా?
కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో 45 ఎకరాల మిస్సింగ్ భూమి కలకలం - నోటీసులు రెడీ..రాజకీయ భూకంపం తప్పదా?
Varanasi Update : 'బాహుబలి'లో కిలికి భాష... 'వారణాసి'లో మరో సరికొత్త లాంగ్వేజ్ - రాజమౌళి ప్లాన్ మామూలుగా లేదు
'బాహుబలి'లో కిలికి భాష... 'వారణాసి'లో మరో సరికొత్త లాంగ్వేజ్ - రాజమౌళి ప్లాన్ మామూలుగా లేదు
ఆటో మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ కారు Suzuki E Sky Electric.. రేంజ్, ఫీచర్లు పూర్తి వివరాలు
ఆటో మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ కారు Suzuki E Sky Electric.. రేంజ్, ఫీచర్లు పూర్తి వివరాలు
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Embed widget