LLB: ఇంటర్ తర్వాత మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సుకు అనుమతివ్వాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు
LLB Degree: ఇంటర్ లేదా తత్సమాన విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత నేరుగా మూడేళ్ల లా కోర్సు (LLB Degree) చదివేందుకు అవకాశం ఉండాలని అభ్యర్థిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.
Petition Filed in Supreme court: ఇంటర్ లేదా తత్సమాన విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత నేరుగా మూడేళ్ల లా కోర్సు (LLB Degree) చదివేందుకు అవకాశం ఉండాలని అభ్యర్థిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రస్తుతం... డిగ్రీ పూర్తిచేసిన వారు మూడేళ్ల లా కోర్సులో, ఇంటర్ లేదా 12వ తరగతి ఉత్తీర్ణులైన వారు అయిదేళ్ల లా కోర్సులో చేరడానికి అర్హులు. అయితే, ఇంటర్ తర్వాత నేరుగా మూడేళ్ల కోర్సుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు నిపుణుల కమిటీని నియమించేలా కేంద్రం, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను ఆదేశించాలని కోరుతూ న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్ పిటిషన్ దాఖలు చేశారు. మేధావులైన విద్యార్థులు మూడేళ్లలోనే న్యాయవాద కోర్సును పూర్తి చేయగలరని, ప్రస్తుత విధానం వల్ల అయిదేళ్ల కోర్సుతో వారికి సమయం వృథా అవుతుందని పిటిషన్‌లో పేర్కొన్నారు.
తెలంగాణ లాసెట్ దరఖాస్తు గడువు పొడిగింపు..
టీఎస్ లాసెట్, పీజీఎల్‌సెట్ 2024 దరఖాస్తు గడువును ఉస్మానియా యూనివర్సిటీ పొడిగించింది. వాస్తవానికి ఏప్రిల్ 15తో ముగియాల్సిన గడువును ఏప్రిల్ 25 వరకు పెంచింది. అభ్యర్థులు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఏప్రిల్ 25 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. అయితే రూ.500 ఆలస్యరుసుముతో మే 4 వరకు, రూ.1000 ఆలస్యరుసుముతో మే 11 వరకు, రూ.2000 ఆలస్యరుసుముతో మే 18 వరకు, రూ.4000 ఆలస్యరుసుముతో మే 25 వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎడిట్ (Lawcet Application Edit) చేసుకునేందుకు మే 20 నుంచి 25 వరకు అవకాశం కల్పించారు. అభ్యర్థులు మే 30 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజుగా ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.900; ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులు రూ.600 చెల్లించాలి. ఇక పీజీఎల్‌సెట్ కోసం ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.1100; ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులు రూ.900గా చెల్లించాల్సి ఉంటుంది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జూన్ 3న ఉదయం10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు లాసెట్, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పీజీఎల్‌సెట్ ప్రవేశ పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నారు. జూన్ 6న ప్రాథమిక ఆన్సర్ కీని విడుదల చేసి జూన్ 7న సాయంత్రం వరకు ఆన్సర్ కీపై అభ్యంతరాలను స్వీకరించనున్నారు. ఆ తర్వాత తుది ఆన్సర్‌కీతోపాటు ఫలితాలను వెల్లడిస్తారు. ఈ ఏడాది ఉస్మానియా యూనివర్సిటీ లాసెట్ పరీక్షల బాధ్యతలను నిర్వహిస్తు్న్న సంగతి తెలిసిందే.
తెలంగాణ లాసెట్ దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..
ఏపీలాసెట్ దరఖాస్తుకు ఏప్రిల్ 22 వరకు అవకాశం..
ఏపీలో లాసెట్, పీజీఎల్ సెట్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. మార్చి 22న లాసెట్, పీజీఎల్ సెట్ నోటిఫికేషన్ విడుదల కాగా.. మార్చి 23 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు మొదలైంది. అభ్యర్థుల నుంచి మార్చి 23 నుంచి ఏప్రిల్ 22 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అయితే రూ.500 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 29 వరకు, రూ.1000 ఆలస్య రుసుముతో మే 5 వరకు, రూ.2000 ఆలస్య రుసుముతో మే 9 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఎడిట్ చేసుకునేందుకు మే 10 నుంచి 11 వరకు అవకాశం కల్పించారు. మే 15 నుంచి పరీక్ష హాల్‌టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి. లాసెట్ దరఖాస్తుకు జనరల్ అభ్యర్థులు రూ.900 చెల్లించాలి. ఓబీసీ అభ్యర్థులు రూ.850 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.800 చెల్లిస్తే సరిపోతుంది. పీజీఎల్‌సెట్ దరఖాస్తు్కు జనరల్ అభ్యర్థులు రూ.1000 చెల్లించాలి. ఓబీసీ అభ్యర్థులు రూ.950 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.900 చెల్లిస్తే సరిపోతుంది. మే 25న టీఎస్ లాసెట్, టీఎస్ పీజీఎల్‌సెట్ ప్రవేశ పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నారు.
ఏపీ లాసెట్ దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..