OU UCE: ఓయూ ఇంజినీరింగ్ కాలేజీలో ఇంజినీరింగ్ 'లేటరల్ ఎంట్రీ' ప్రవేశాలు, వీరికి మాత్రమే అవకాశం!
BTech Engineering Programme For Working Professionals: ఉస్మానియా యూనివర్సిటీలోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
University College of Engineering Osmania University: డిప్లొమా అర్హత ఉండి, ఉద్యోగాలు చేస్తూ.. ఇంజినీరింగ్ చదవాలనుకునే వారికోసం 'బీటెక్ వర్కింగ్ ప్రొఫెషనల్స్' పేరుతో బీటెక్ రెండో సంవత్సరంలో ప్రవేశాలకు తెలంగాణలోని 12 ఇంజినీరింగ్ కాలేజీలకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ఇటీవలే అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. ఉస్మానియా సహా పలు కాలేజీల్లో వర్కింగ్ ప్రొఫెషనల్స్‌కు ప్రవేశాలు కల్పించేందుకు (ఏఐసీటీఈ)అనుమతిని మంజూరు చేసింది. ఈ విద్యాసంవత్సరంలో వర్కింగ్ ప్రొఫెషనల్స్ ప్రవేశాలు పొందేందుకు నవంబరు 30 వరకు అవకాశం ఇచ్చింది. కంప్యూటర్‌సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, సివిల్ ఇంజినీరింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ వంటి ప్రోగ్రాముల్లో వర్కింగ్ ప్రొఫెషనల్స్‌కు ప్రవేశాలు కల్పించనున్నారు.
ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, 'సెంటర్ ఫర్ కంటిన్యూయింగ్ ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ (సీఈఈపీ) కింద 2023-2024 విద్యా సంవత్సరానికి వర్కింగ్ ప్రొఫెషనల్స్‌కు ఉద్దేశించిన బీఈ, బీటెక్ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
వివరాలు..
* బీఈ, బీటెక్ (సీఈఈపీ) వర్కింగ్ ప్రొఫెషనల్స్ ప్రోగ్రామ్- డిప్లొమా లేటరల్ ఎంట్రీ
సీట్ల సంఖ్య: 90
కోర్సు వ్యవధి: 6 సెమిస్టర్లు(3 సంవత్సరాలు)
బ్రాంచ్‌లవారీగా సీట్ల కేటాయింపు: సివిల్ - 30 సీట్లు, మెకానికల్ - 30 సీట్లు, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (ఏఐ & ఎంఎల్) - 30 సీట్లు.
అర్హత: సంబంధిత విభాగంలో ఓసీ అభ్యర్థులైతే 45 శాతం మార్కులతో డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. ఇతరులకు 40 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. దీంతోపాటు ఏదైనా పరిశ్రమ లేదా ఏదైనా ప్రభుత్వ/ప్రైవేట్/పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ/ఎంఎస్‌ఎంఈ సంస్థలో ఏడాది పని అనుభవం ఉండాలి. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి 100 కి.మీ. పరిధిలో ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ట్యూషన్ ఫీజు: సెమిస్టరుకు రూ.50,000.
ప్రవేశం ఇలా..
పాలిటెక్నిక్ కళాశాలల్లో మూడేళ్ల డిప్లొమా పూర్తిచేసిన వారికి నేరుగా బీటెక్ రెండో సంవత్సరంలో ప్రవేశాలు కల్పిస్తారు. విద్యార్థులు ఏఐసీటీఈ అనుమతి తెలిపిన కాలేజీలో నిర్వహించే ప్రవేశ పరీక్ష ద్వారా సీట్లు పొందవచ్చు. ప్రవేశాలు పొందినవారికి కళాశాల సమయం ముగిసిన తర్వాత లేదా వారాంతాల్లో ప్రత్యేక తరగతుల నిర్వహించనున్నారు. అయితే ఫీజులను మాత్రం సంబంధిత కళాశాలలే నిర్ణయిస్తాయి. ఓయూలో సంవత్సరానికి రూ.1 లక్షగా నిర్ణయించారు.
ముఖ్యమైన తేదీలు...
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 21.11.2023.
➥ ఎంపికైన అభ్యర్థుల జాబితా వెల్లడి: 30.11.2023.
➥ కౌన్సెలింగ్ తేదీలు..
ఫేజ్-I: 02.12.2023.
ఫేజ్-II: 08.12.2023.
ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, మాతృశ్రీ ఇంజినీరింగ్ కాలేజీ, మెథడిస్ట్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, స్టాన్లీ మహిళా ఇంజినీరింగ్ కాలేజీ, తీగల కృష్ణారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీ, వీఎన్‌ఆర్ విజ్ఞానజ్యోతి ఇన్‌స్టిట్యూట్ అఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, చైతన్యభారతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, జ్యోతిష్మతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్, మాటూరి వెంకటసుబ్బారావు ఇంజినీరింగ్ కాలేజీ, కాకతీయ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ – కొత్తగూడెం, అబ్దుల్ కలాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజికల్ సైన్సెస్, అనుబోస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ.