TS SET 2023: టీఎస్ సెట్-2023 రీషెడ్యూల్, వాయిదాపడిన పరీక్ష ఎప్పుడంటే?
మార్చి 13న జరగాల్సిన పరీక్షను 17న నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. మార్చి 14, 15 తేదీల్లో నిర్వహించే పరీక్షలు మాత్రం ముందుగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారమే నిర్వహించనున్నారు.
తెలంగాణలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో మార్చి 13న నిర్వహించాల్సిన 'టీఎస్ సెట్-2022' పరీక్షను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. అయితే వాయిదాపడిన పరీక్ష తేదీలను తాజాగా రీషెడ్యూల్ చేశారు. దీని ప్రకారం మార్చి 13న జరగాల్సిన పరీక్షను 17న నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. మార్చి 14, 15 తేదీల్లో నిర్వహించే పరీక్షలు మాత్రం ముందుగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారమే నిర్వహించనున్నారు. రీషెడ్యూల్ చేసిన ఈ పరీక్షకు సంబంధించిన హాల్‌టిక్కెట్లను మార్చి 10 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
తెలంగాణలో అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ల అర్హత పరీక్ష అయిన టీఎస్ సెట్‌ను మార్చి 13, 14, 15వ తేదీల్లో నిర్వహించనున్న విషయం తెలిసిందే. అయితే ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్‌టికెట్లను మార్చి 1న అధికారులు విడుదల చేశారు. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు. సీబీటీ పద్ధతిలో పరీక్షను నిర్వహించనున్నట్లు తెలిపారు. మొత్తం 29 సబ్జెక్టులకుగానూ ఈ పరీక్షను నిర్వహించనున్నారు.
TS SET 2022 Admit Card కోసం క్లిక్ చేయండి..
↪ టీఎస్ సెట్-2022 (TS SET-2022)
సబ్జెక్టులు: జనరల్ పేపర్ ఆన్ టీచింగ్ అండ్ రిసెర్చ్ ఆప్టిట్యూడ్ (పేపర్-1), జాగ్రఫీ, కెమికల్ సైన్సెస్, కామర్స్, కంప్యూటర్ సైన్స్ & అప్లికేషన్స్, ఎకనామిక్స్, ఎడ్యుకేషన్, ఇంగ్లిష్, ఎర్త్ సైన్స్, లైఫ్ సైన్సెస్, జర్నలిజం & మాస్ కమ్యూనికేషన్, మేనేజ్‌మెంట్, హిందీ, హిస్టరీ, లా, మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిలాసఫీ, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, తెలుగు, ఉర్దూ, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, సంస్కృతం, సోషల్ వర్క్, ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్, లింగ్విస్టిక్స్.
పరీక్షల షెడ్యూలు ఇలా..
పరీక్ష విధానం: మొత్తం 29 సబ్జెక్టులకు ఈ పరీక్ష నిర్వహించనున్నారు. కంప్యూటర్ ఆధారిత టెస్టు(సీబీటీ) పద్ధతిలో జరిగే పరీక్షకు రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1లో 50 ప్రశ్నలకు 100 మార్కులు, పేపర్-2లో 100 ప్రశ్నలకు 200 మార్కులు ఉంటాయి. పరీక్ష వ్యవధి మూడు గంటలు.
పరీక్ష కేంద్రాలు: ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్, నల్గొండ, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, విజయవాడ, కర్నూలు, తిరుపతి, విశాఖపట్నం.
Also Read:
టీఎస్ ఎంసెట్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం! చివరితేది ఎప్పుడంటే?
టీఎస్ ఎంసెట్-2023 (తెలంగాణ స్టేట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్-2023) దరఖాస్తు ప్రక్రియ మార్చి 3న ప్రారంభమైంది. అభ్యర్థులు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఏప్రిల్ 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక రూ.250 - రూ.5000 వరకు ఆలస్య రుసుముతో ఏప్రిల్ 15 నుంచి మే 2 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంసెట్ దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..
TS EdCET: టీఎస్ ఎడ్‌సెట్-2023 షెడ్యూల్ విడుదల, పరీక్ష తేది ఇదే!
తెలంగాణలో బీఈడీ కళాశాలల్లో బీఎడ్ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే 'టీఎస్ ఎడ్‌సెట్ – 2023' షెడ్యూల్ విడుదలైంది. తెలంగాణ ఉన్నత విద్యామండలి( TSCHE ) చైర్మన్ ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి, టీఎస్ ఎడ్‌సెట్ కన్వీనర్, మహాత్మాగాంధీ వర్సిటీ వీసీ సీహెచ్ గోపాల్ రెడ్డి కలిసి షెడ్యూల్‌ను విడుదల చేశారు. మార్చి 4 నుంచి ఎడ్‌సెట్ నోటిఫికేషన్ అందుబాటులో ఉండనుంది. మార్చి 6 నుంచి ఎడ్‌సెట్ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులు రూ.500, ఇతర కేటగిరీల అభ్యర్థులు రూ. 700 చెల్లించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
TSRJC CET - 2023: టీఎస్ఆర్జేసీ సెట్–2023 నోటిఫికేషన్ వెల్లడి, ప్రవేశపరీక్ష ఎప్పుడంటే?
తెలంగాణలోని 35 గురుకుల జూనియర్ కళాశాలల్లో 2023–24 విద్యాసంవత్సరానికి ఇంటర్మీడియేట్ మొదటి సంవత్సరం ఇంగ్లిష్ మీడియం ప్రవేశాలకు తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యాలయ సంస్థ టీఎస్ఆర్జేసీ సెట్–2023 నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా బాలురకు 15, బాలికల కోసం 25 గురుకుల జూనియర్ కాలేజీలు ఉన్నాయి. పదోతరగతి అర్హత ఉన్న విద్యార్థులతోపాటు, ప్రస్తుతం టెన్త్ చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
నోటిఫికేషన్, పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..