News
News
X

NEET UG 2023: నీట్‌ (యూజీ) నోటిఫికేషన్‌ విడుదల, ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ!

నీట్ యూజీ పరీక్షను మే 7న నిర్వహించనున్నట్లు ఇప్పటికే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.

FOLLOW US: 
Share:

దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్) యూజీ పరీక్షకు మార్చి 6న నోటిఫికేషన్ విడుదలైంది. నీట్ యూజీ పరీక్షను మే 7న నిర్వహించనున్నట్లు ఇప్పటికే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంగ్లిష్, హిందీ, తెలుగుతో పాటు మొత్తం 13 భాషల్లో ఈ పరీక్షను పెన్ను, పేపర్ విధానంలో నిర్వహించనున్నారు. అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్, పరీక్ష కేంద్రాలకు సంబంధించిన సమాచారాన్ని ఎన్‌టీఏ వెబ్‌సైట్‌లో వెల్లడించనున్నారు. నీట్ పరీక్ష మే 7న (ఆదివారం) మధ్యాహ్నం 2గంటల నుంచి 5.20 గంటల మధ్య జరగనుంది.

కోర్సుల వివరాలు..

ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్, ఎంఎస్, బీయూఎంఎస్, బీహెచ్‌ఎంఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏటా ఈ పరీక్ష నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. గత ఐదేళ్లుగా ఈ పరీక్ష రాసేవారి సంఖ్య ఏటా పెరుగుతోంది. గతేడాది 17.64 లక్షల మంది నీట్ యూజీ పరీక్ష రాయగా.. ఈ ఏడాది 18లక్షల మంది రాసే అవకాశం ఉందని ఓ అంచనా. 

అర్హతలు..
➥ 50 శాతం మార్కులతో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ/బయోటెక్నాలజీ సంబంధిత గ్రూపులతో 10+2/ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/దివ్యాంగుల అభ్యర్థులకు 40 శాతం మార్కులు తప్పనిసరి.

➥ విదేశాల్లో ఎంబీబీస్ పూర్తిచేసి ఇండియాలో ఉద్యోగం చేసేందుకు సిద్ధమయ్యే భారతీయ విద్యార్థులు, విదేశీ విద్యార్థులు కూడా నీట్ క్వాలిఫై అవ్వటం తప్పనిసరి.

➥ జనరల్ కేటగిరి విద్యార్థులు వరుసగా 9 ఏళ్ళు హాజరయ్యే అవకాశం ఉంది. రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులు గరిష్టంగా 15 ఏళ్లు హాజరవ్వొచ్చు.

వయోపరిమితి: 31.12.2023 నాటికి అభ్యర్థుల వయసు 17 సంవత్సరాలు నిండి ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/దివ్యాంగుల అభ్యర్థులకు 5 సంవత్సరాలపాటు వయో సడలింపు ఉంటుంది. ఈ అభ్యర్థుల గరిష్థ వయసు 25 సంవత్సరాలకు మించకూడదు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. నీట్‌కు దరఖాస్తు చేసుకున్న తర్వాత కన్ఫర్మేషన్ పేజీని డౌన్‌లోడ్ చేసుకొని భద్రపరచుకోండి. అలాగే, అప్‌లోడ్ చేసిన ఫొటో కాపీని సైతం మీ వద్దే ఉంచుకోండి. ఆ డాక్యుమెంట్లు తర్వాత అవసరమవుతాయి.

ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: జనరల్ కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుం రూ.1700 కాగా, జనరల్ ఈడబ్ల్యూఎస్/ఓబీసీ-ఎన్‌సీఎల్ అభ్యర్థులకు రూ.1600, ఎస్సీ, ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/థర్డ్ జండర్ అభ్యర్థులకు రూ.100 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఇతర దేశాలకు చెందిన అభ్యర్థులైతే దరఖాస్తు రుసుం రూ.9500లుగా నిర్ణయించారు. 

నీట్ యూజీ పరీక్ష విధానం..
➥ నీట్ ప్రవేశ పరీక్ష పూర్తి ఆఫ్‌లైన్‌ (పెన్, పేపర్) విధానంలో నిర్వహించబడుతుంది. మూడు గంటల 20 నిముషాల నిడివితో జరిగే ఈ పరీక్షలో ప్రతి సబ్జెక్టు నుండి గరిష్టంగా 45 ప్రశ్నలు చెప్పున మొత్తం 180 ఆబ్జెక్టివ్ టైపు ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ప్రశ్నలు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ మరియు జూవాలాజీ సబ్జెక్టులకు సంబంధించి ఉంటాయి.

➥ ఒక్కో సబ్జెక్టు నుంచి రెండు సెక్షన్ల (సెక్షన్-ఎ, బి) వారీగా 50 ప్రశ్నలు ఇస్తారు. సెక్షన్-ఎ నుంచి 35 ప్రశ్నలు, సెక్షన్-బి నుంచి 15 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఇస్తారు. సెక్షన్-బి లోని 15 ప్రశ్నల్లో 10 ప్రశ్నలకు మాత్రమే సమాధానం రాయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి అభ్యర్థి సమాధానం చేసిన మొదటి 10 ప్రశ్నలను మాత్రమే లెక్కింపు సమయంలో పరిగణలోకి తీసుకుంటారు.

➥ ప్రతి ప్రశ్న మల్టిఫుల్ ఛాయస్ పద్దతిలో నాలుగు ఆప్షనల్ సమాధానాలు కలిగి ఉంటుంది. అందులో ఒక సరైన సమాధానాన్ని గుర్తించవలసి ఉంటుంది. సరైన సమాధానం చేసిన ప్రతి ప్రశ్నకు 4 మార్కులు. తప్పు సమాధానం ఇచ్చిన ప్రశ్నకు మైనస్ 1 మార్కు ఇవ్వబడుతుంది.

➥ మొత్తం 720 మార్కులకు జరిగే ఈ పరీక్షలో 10+2/ఇంటర్మీడియట్ స్థాయిలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ (బోటనీ, జువాలాజీ) లకు సంబంధించిన సిలబస్ నుండి ప్రశ్నలు ఇస్తారు. ప్రశ్న పత్రాలు దాదాపు అన్ని ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు...

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం 06.03.2023

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 06.04.2023. 

➥ నీట్ యూజీ-2023 పరీక్ష తేదీ: 07.05.2023.

Public Notice

Information Broucher
Online Registration
Website 

                               

Also Read:

టీఎస్ ఎంసెట్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం! చివరితేది ఎప్పుడంటే?
టీఎస్ ఎంసెట్-2023 (తెలంగాణ స్టేట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్-2023) దరఖాస్తు ప్రక్రియ మార్చి 3న ప్రారంభమైంది. అభ్యర్థులు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఏప్రిల్‌ 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక రూ.250 - రూ.5000 వరకు ఆలస్య రుసుముతో ఏప్రిల్ 15 నుంచి మే 2 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజుగా  ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులు రూ.500, మిగ‌తా కేట‌గిరిల అభ్యర్థులు రూ. 1000 చెల్లించి ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. ఇంజినీరింగ్, మెడిక‌ల్ ప్రవేశ ప‌రీక్ష రాసే ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులు రూ.1000, మిగ‌తా కేట‌గిరిల అభ్యర్థులు రూ. 1800 చెల్లించాల్సి ఉంటుంది. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి.. 

జేఈఈ మెయిన్స్‌ సెషన్‌-2 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
దేశంలోని ప్రఖ్యాత విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ మెయిన్స్‌ సెషన్‌-2 పరీక్షలకు దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 15న ప్రారంభమైంది. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఫిబ్రవరి 7న ప్రారంభం కావాల్సిన దరఖాస్తు ప్రక్రియ.. వారం రోజుల ఆలస్యంగా ఫిబ్రవరి 15 నుంచి దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. కొత్త అభ్యర్దులతోపాటు మొదటి సెషన్‌ రాసిన అభ్యర్ధుులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్థులు మార్చి 12న రాత్రి 9 గంటల వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది.  
దరఖాస్తు పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

Published at : 07 Mar 2023 12:18 AM (IST) Tags: Education News in Telugu NEET UG 2023 Registration NEET UG 2023 Notification NEET UG 2023 Application NEET UG 2023 Exam Date

సంబంధిత కథనాలు

TS SSC Exams 2023: ఏప్రిల్ 3 నుంచి పదోతరగతి పరీక్షలు, హాల్‌టికెట్లు అందుబాటులో!

TS SSC Exams 2023: ఏప్రిల్ 3 నుంచి పదోతరగతి పరీక్షలు, హాల్‌టికెట్లు అందుబాటులో!

APSWREIS: గురుకులాల్లో 5వ తరగతి, ఇంటర్ ప్రవేశాల దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?

APSWREIS: గురుకులాల్లో 5వ తరగతి, ఇంటర్ ప్రవేశాల దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?

రెండు మూడు రోజుల్లో 1442 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల మెరిట్ లిస్టు

రెండు మూడు రోజుల్లో 1442 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల మెరిట్ లిస్టు

TS TOSS Exam Schedule: తెలంగాణ ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూలు విడుదల - పరీక్షల తేదీలివే!

TS TOSS Exam Schedule: తెలంగాణ ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూలు విడుదల - పరీక్షల తేదీలివే!

GAT 2023 Application: గాట్-2023 దరఖాస్తుకు మార్చి 26తో ఆఖరు, పరీక్ష ఎప్పుడంటే?

GAT 2023 Application: గాట్-2023 దరఖాస్తుకు మార్చి 26తో ఆఖరు, పరీక్ష ఎప్పుడంటే?

టాప్ స్టోరీస్

రాహుల్ కంటే ముందు అన‌ర్హ‌త వేటు ప‌డిన నేత‌లు వీరే

రాహుల్ కంటే ముందు అన‌ర్హ‌త వేటు ప‌డిన నేత‌లు వీరే

Nara Rohit : రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్ ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్

Nara Rohit :  రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్   ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్

Saweety Boora: గోల్డ్ తెచ్చిన సవీటీ బూరా - మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండో స్వర్ణం!

Saweety Boora: గోల్డ్ తెచ్చిన సవీటీ బూరా - మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండో స్వర్ణం!

Weather Latest Update: నేడు తెలుగు రాష్ట్రాల్లో ఎల్లో అలెర్ట్ జారీ, ఈ జిల్లాల్లో వానలు! ఈదురుగాలులు కూడా

Weather Latest Update: నేడు తెలుగు రాష్ట్రాల్లో ఎల్లో అలెర్ట్ జారీ, ఈ జిల్లాల్లో వానలు! ఈదురుగాలులు కూడా