By: ABP Desam | Updated at : 08 Sep 2022 08:32 AM (IST)
నీట్ యూజీ ఫలితాలు, ఫైనల్ కీ వెల్లడి
NEET Result 2022: నీట్ యూజీ 2022 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) సెప్టెంబరు 7న రాత్రి విడుదల చేసింది. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచింది. నీట్ పరీక్షకు హాజరైన విద్యార్థులు ఆయా వెబ్‌సైట్ల ద్వారా తమ ఫలితాలను చూసుకోవచ్చు. విద్యార్థులు తమ అప్లికేషన్ నెంబర్, పాస్‌వర్డ్ లేదా పుట్టిన తేదీ వివరాలు నమోదుచేసి ఫలితాలను చూసుకోవచ్చు. నీట్ ఫలితాలతోపాటు తుది కీని కూడా ఎన్టీఏ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.
56.27 శాతం ఉత్తీర్ణులు..
నీట్ పరీక్షకు మొత్తం 18,72,343 మంది రిజిష్టర్ చేసుకోగా.. 17,64,571 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 9,93,069 లక్షల మంది అర్హత సాధించారు. నీట్ పరీక్షలో అర్హత సాధించినవారిలో 4,29,160 మంది మహిళలు; 5,63,902 మంది పురుషులు, ఏడుగురు ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు. అంటే 56.27 శాతం ఉత్తీర్ణులయ్యారు.
ఫలితాల కోసం కింది లింక్స్ క్లిక్ చేయండి..
ఈ ఏడాది జులై 17న దేశవ్యాప్తంగా దాదాపు 3,570 పరీక్షా కేంద్రాల్లో NEET UG - 2022 పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈసారి నీట్ పరీక్షకు 18.72 లక్షల మంది అభ్యర్థులు రిజిష్టర్ చేసుకోగా.. 17.78 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. రికార్డు స్థాయిలో 95 శాతం హాజరు నమోదైంది. ఆగస్టు 31న ప్రొవిజనల్ ఆన్సర్ కీ, ఓఎంఆర్ షీట్లు స్కాన్ చేసిన చిత్రాలు వెబ్‌సైటులో అప్‌లోడ్ చేశారు. అభ్యర్థుల నుంచి ఆన్సర్ కీపై అభ్యంతరాల స్వీకరణ తర్వాత NEET UG - 2022 ఫలితాలను సెప్టెంబరు 7న విడుదల చేయనుంది.
కటాఫ్ మార్కులు ఇలా..?
నీట్ పరీక్షలో జనరల్ కేటగిరి అభ్యర్థులకు కనీస అర్హత మార్కులను 50 పర్సెంట్‌గా.. ఎస్టీ, ఎస్సీ అభ్యర్థులకు 40 పర్సంటైల్‌గా, దివ్యాంగులకు 45 పర్సంటైల్‌గా నిర్ణయించారు. గతేడాది కటాఫ్ మార్కులు జనరల్-138, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు 108గా నిర్ణయించారు. ఈసారి అర్హత మార్కులు 5-10 మార్కులు తగ్గే అవకాశం ఉంది. కటాఫ్ మార్కు 125-130 మధ్యలో ఉండే అవకాశం ఉంది. ఫలితాల వెల్లడి తర్వాత నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కౌన్సెలింగ్ షెడ్యూలును ప్రకటించనుంది. మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ వెబ్‌సైట్‌లో కౌన్సెలింగ్ షెడ్యూలును అప్‌లోడ్ చేయనుంది.
నీట్ ర్యాంకుల ఆధారంగానే రాష్ట్రాల వారీగా మెరిట్ జాబితా రూపొందించి ప్రవేశాలు కల్పిస్తారు. నీట్ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థుల మెరిట్ జాబితాను 'మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్' ఆధ్వర్యంలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్‌తో పాటు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రూపొందిస్తాయి. నీట్ మెడికల్ మెరిట్ లిస్ట్ ఆధారంగానే ప్రవేశ ప్రక్రియ జరుగుతుంది.
టై బ్రేకింగ్ ప్రకారమే ర్యాంకులు..
ఈ సారి ర్యాంకింగ్ విధానంలో టై బ్రేకింగ్ విధానాన్ని అమలుచేయనున్నారు. దీనిప్రకారం..
▶ బయాలజీ (బోటనీ & జువాలజీ), కెమిస్ట్రీ, ఫిజిక్స్‌లో ఎక్కువ మార్కులు/పర్సెంటైల్ స్కోర్ ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటంది.
▶ అన్ని సబ్జెక్టులలో మార్కులు ఒకేలా ఉంటే, తక్కువ ప్రశ్నలకు ప్రయత్నించిన విద్యార్థులకు ఎక్కువ ర్యాంక్ ఇవ్వబడుతుంది, తరువాత బయాలజీ, కెమిస్ట్రీ మరియు ఫిజిక్స్‌లలో తక్కువ తప్పులు చేసినవారికి ప్రాధాన్యమిస్తారు.
▶ ఈ మార్కులన్నీ కూడా సరిపోలితే, వయసులో ఎక్కువ వయస్సు ఉన్న అభ్యర్థులకు ఎక్కువ ర్యాంక్ ఇవ్వబడుతుంది.
▶ ఒకవేళ అభ్యర్థులు తమ పుట్టినరోజును పరిగణనలోకి తీసుకుంటే, ముందుగా నీట్ పరీక్షకు దరఖాస్తు చేసిన అభ్యర్థికి ఎక్కువ ర్యాంకు లభిస్తుంది.
మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..
LAWCET: లాసెట్ సీట్ల కేటాయింపు, తొలి విడతలో 5912 మందికి ప్రవేశాలు
CSIR UGC NET 2023: సీఎస్ఐఆర్-యూజీసీ నెట్ (డిసెంబరు) 2023 దరఖాస్తు గడువు పొడిగింపు - ఎప్పటివరకంటే?
JEE Main 2024: జేఈఈ మెయిన్ దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
AP Govt Holidays: వచ్చేఏడాది 20 సాధారణ సెలవులు, జాబితా ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
జేఈఈ మెయిన్ దరఖాస్తుకు ముగుస్తోన్న గడువు, వెంటనే దరఖాస్తు చేసుకోండి
Telangana Exit Poll Results 2023: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లకు, కార్యకర్తలకు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి, ఏంటంటే!
Telangana Elections 2023: స్వల్ప ఉద్రిక్తతలతో ముగిసిన తెలంగాణ ఎన్నికలు, 70 దాటిన పోలింగ్ శాతం
Vijay Rashmika: ఒకే తరహా డ్రెస్‌లో రష్మిక, విజయ్ దేవరకొండ - దొరికిపోయారుగా!
Anasuya Bharadwaj: రౌండ్ కళ్లద్దాలతో రంగమత్త - భలే బాగుంది కదూ!
/body>