(Source: ECI/ABP News/ABP Majha)
JEE Main Paper 2 Results: జేఈఈ మెయిన్ పేపర్-2 ఫలితాలు విడుదల - సత్తా చాటిన తెలుగు రాష్ట్రాల విద్యార్థులు
దేశంలోని ఉన్నత విద్యాసంస్థల్లో బీఆర్క్, బీప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్ పేపర్-2 (JEE మెయిన్) పరీక్షల ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) మే 19న విడుదల చేసింది.
JEE Mains 2024 Paper 2 Results: దేశంలోని ఉన్నత విద్యాసంస్థల్లో బీఆర్క్, బీప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్ పేపర్-2 (JEE మెయిన్) పరీక్షల ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) మే 19న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. పరీక్షకు హాజరైన విద్యార్థులు తమ అప్లికేషన్ నెంబరు, పుట్టినతేదీ వివరాలను నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు.
ఫలితాల్లో రెండు విభాగాల్లో (బీఆర్క్, బీప్లానింగ్) ఇద్దరు చొప్పున విద్యార్థులు 100 మంది పర్సంటైల్ సాధించారు. ఇందులో ఒకరు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థి కావడం విశేషం. పరీక్ష రాసిన విద్యార్థులు ఎన్‌టీఏ అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.ac.inలో తమను చూడవచ్చు. ఏప్రిల్ 12న జేఈఈ మెయిన్ పేపర్-2 పరీక్షను దేశవ్యాప్తంగా 291 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించిన సంగతి తెలిసిందే. బీఆర్క్ పరీక్షకు 36,707 మంది, బీప్లానింగ్ పరీక్షకు 16,228 మంది విద్యార్థులు. 73,362 మంది విద్యార్థులు బీఆర్‌కు, 38,105 మంది బీప్లానింగ్ పరీక్షకు రిజిస్టర్ చేసుకున్నారు.
జేఈఈ మెయిన్ సెషన్-2 బీఆర్క్ పరీక్ష ఫలితాల్లో జార్ఖండ్‌కు చెందిన సులగ్న బసాక్, తమిళనాడు విద్యార్థి ముత్తు 100 పర్సంటైల్ సాధించారు. ఇక ఏపీకి చెందిన యాయవరం శ్రవణ్ రామ్, తెలంగాణ విద్యార్థులు వివేక్‌జిత్ దాస్, బోడ ప్రభంజన్ జాదవ్, బానోత్ రిత్వక్ 99కి పైగా పర్సంటైల్ స్కోర్ సాధించారు. అదేవిధంగా బీప్లాన్‌లో కర్ణాటకకు చెందిన అరుణ్ రాధాక్రిష్ణ, ఏపీకి చెందిన కొలసాని సాకేత్ ప్రణవ్ 100 పర్సంటైల్ సాధించారు. మరో ఏపీ విద్యార్థి కాలిగాట్ల దేవీప్రసాద్ 99.99 పర్సంటైల్ సాధించాడు.
జేఈఈ మెయిన్ 2024 పేపర్-2 ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి..
➥ ఫలితాల కోసం విద్యార్థులు మొదట ఎన్‌టీఏ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి - https://jeemain.nta.ac.in/
➥ అక్కడ హోంపేజిలో కనిపించే ''JEE(Main) 2024 Session-2(Paper-2): Click Here to Access the Score Card JEE (Main) B.Arch B.Planning session'' లింక్ మీద క్లిక్ చేయాలి.
➥ ఆ తర్వాత వచ్చే పేజీలో అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ, సెక్యూరిటీ పిన్ వివరాలు నమోదు చేసి SUBMIT చేయాలి.
➥ జేఈఈ మెయిన్ 2024 సెషన్ 2 (పేపర్-2) ఫలితాలు కంప్యూటర్ స్క్రీన్ మీద కనిపిస్తాయి.
➥ విద్యార్థులు ర్యాంకు కార్డు డౌన్‌లోడ్ చేసుకోవాలి. ప్రింట్ తీసి భవిష్యత్ అవసరాల కోసం భద్రపరచుకోవాలి.
జేఈఈ మెయిన్ 2024 - బీఆర్క్ టాపర్లు..
కేటగిరీ | అప్లికేషన్ నెంబర్ | రాష్ట్రం | రాష్ట్రం | పర్సంటైల్ |
జనరల్ | 240310081759 | జార్ఖండ్ | సులగ్న బసాక్ | 100 |
జనరల్/ఈడబ్ల్యూఎస్ | 240310370693 | ఆంధ్రప్రదేశ్ | యయవరం శ్రవణ్‌రామ్ | 99.96704 |
ఓబీసీ (NCL) | 240310258231 | తమిళనాడు | ఆర్. ముత్తు | 100 |
ఎస్సీ | 240310305192 | తెలంగాణ | వివేక్‌జిత్ దాస్ | 99.94958 |
ఎస్టీ | 240310104121 | తెలంగాణ | బోడ ప్రభంజన్ జాదవ్ | 99.87978 |
ఎస్టీ | 240310190239 | తెలంగాణ | బానోత్ రిత్వక్ | 99.87978 |
జేఈఈ మెయిన్ 2024 - బీప్లానింగ్ టాపర్లు..
కేటగిరీ | అప్లికేషన్ నెంబర్ | రాష్ట్రం | రాష్ట్రం | పర్సంటైల్ |
జనరల్ | 240310871799 | కర్ణాటక | అరుణ్ రాధాక్రిష్ణన్ | 100 |
జనరల్/ఈడబ్ల్యూఎస్ | 240310196703 | ఆంధ్రప్రదేశ్ | కొలసాని సంకేత్ ప్రణవ్ | 100 |
ఓబీసీ (NCL) | 240320029414 | తమిళనాడు | నాగుల్ ప్రశాంత్ సుబ్రమణి వడివేల్ | 99.99384 |
ఓబీసీ (NCL) | 240310152942 | ఆంధ్రప్రదేశ్ | కాలిగట్ల దేవీప్రసాద్ | 99.99384 |
ఎస్సీ | 240310195582 | ఉత్తర్ ప్రదేశ్ | అంకుశ్ | 99.91156 |
ఎస్టీ | 240310600480 | తమిళనాడు | ఎం. జొనాథన్ సింకం సంగ్మా | 99.06951 |
ALSO READ:
జేఈఈ అడ్వాన్స్‌డ్ అడ్మిట్ కార్డులు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
దేశంలోని ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో బీటెక్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు. జూన్ 4న నిర్వహించనున్న ఈ పరీక్షకు ఐఐటీ గువాహటి అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది.
అడ్మిట్ కార్డుల కోసం క్లిక్ చేయండి..