Nobel Prize Facts: నోబెల్ శాంతి బహుమతికి గాంధీ ఎన్నిసార్లు నామినేట్ అయ్యారు? ఎక్కువసార్లు అందుకున్నదెవరు?
Nobel Prize Facts: 1901 నుంచి 2021 వరకు 102 నోబెల్ శాంతి బహుమతులు ప్రదానం చేశారు. 19 ఏళ్ల పాటు అవార్డును ఇవ్వలేదు.
Nobel Prize Facts: ప్రపంచ శాంతి కోసం ప్రయత్నించిన వారికి, దేశాల మధ్య యుద్ధాలను నిరోధించి సౌభ్రాతృత్వం కోసం శాంతియుత పోరాటం చేసిన వాళ్లకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని ఆల్ఫ్రెడ్ నోబెల్ చివరి కోరిక. ఇదే విషయాన్ని 27 నవంబర్ 1895న నోబెల్ తన చివరి వీలునామాపై సంతకం చేసి కన్నుమూశారు. తన సంపదలో అత్యధిక భాగాన్ని నోబెల్ బహుమతులకు ఇవ్వాలని చెప్పారు. నోబెల్ వీలునామాలో వివరించినట్లుగా శాంతి సమావేశాలు నిర్వహించేవారికి, ప్రోత్సహించేవారికి, అత్యంత ఉత్తమమైన పనిని చేసిన వారికి బహుమతి అందజేస్తున్నారు. 1901 నుంచి 2021 వరకు నోబెల్ శాంతి బహుమతి గురించి చాలా ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి.
1901 నుంచి 2021 వరకు 102 నోబెల్ శాంతి బహుమతులు ప్రదానం చేశారు. 19 ఏళ్ల పాటు మాత్రం 1914-1916, 1918, 1923, 1924, 1928, 1932, 1939-1943, 1948-19615, 1965, 1965 నోబెల్ బహుమతి ఎవరికీ ఇవ్వలేదు.
19 ఏళ్లు శాంతి పురస్కారాలు ఎందుకు ఇవ్వలేదు?
నోబెల్ ఫౌండేషన్ రాజ్యాంగంలో ఉన్నట్టు రూల్స్‌కు సరిపడా ఎంట్రీలు లేకపోతే అవార్డును నిలిపివేస్తారు. బహుమతిగా ఇచ్చే నగదును తదుపరి సంవత్సరానికి రిజర్వ్ చేస్తారు. ఒకవేళ ఆ తర్వాత ఏడాది కూడా అవార్డుకు ఎవరూ ఎంపిక కాకపోతే... ఆ మొత్తాన్ని ఫౌండేషన్‌కు చెందిన రిస్ట్రిక్టెడ్ ఫండ్స్‌లో జమ చేశారు. మొదటి, రెండో ప్రపంచ యుద్ధాల టైంలో తక్కువ నోబెల్ అవార్డులు అందజేశారు.
69సార్లు వ్యక్తులు, లేదా సంస్థలు ఒక్కొక్కరుగానే నోబెల్ శాంతి పురస్కారం అందుకుంటే... 31సార్లు రెండు సంస్థలు, లేదా ఇద్దరు వ్యక్తులు లేదా సంస్థ, వ్యక్తి ఉమ్మడిగా బహుమతి అందుకున్నారు. ముగ్గురు వ్యక్తులకు ఉమ్మడిగా రెండు సార్లు బహుమతి ప్రదానం జరిగింది. 1994లో యాసర్ అరాఫత్, షిమోన్ పెరెస్, యిట్జాక్ రాబిన్, 2011లో ఎల్లెన్ జాన్సన్ సిర్లీఫ్, లేమా గ్బోవీ, తవకోల్ కర్మన్‌కు బహుమతి అందజేశారు.
అవార్డు మొత్తాన్ని రెండు సంస్థలు, ఇద్దరు వ్యక్తులు, ఒక సంస్థ, వ్యక్తికి ఇవ్వొచ్చని నోబెల్ రాజ్యాంగం చెబుతోంది. ఇలా పంచినప్పుడు బహుమతిని వారికి సంయుక్తంగా ప్రదానం చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ముగ్గురు కంటే ఎక్కువ వ్యక్తుల మధ్య విభజించకూడదన్నది నోబెల్ రాజ్యాంగం రూల్.
నోబెల్ శాంతి బహుమతి గ్రహీతల సంఖ్య
ఇప్పటి వరకు నోబెల్ శాంతి బహుమతులు 137 అందజేశారు. ఇందులో 109 మంది వ్యక్తులు ఉంటే 28 సంస్థలు ఉన్నాయి. అంతర్జాతీయ రెడ్‌క్రాస్ కమిటీ మూడుసార్లు, యునైటెడ్ నేషన్స్ హైకమిషనర్ ఆఫ్ రెఫ్యూజీస్ కార్యాలయం రెండుసార్లు అవార్డు అందుకున్నారు.
అతి చిన్న వయసులో అవార్డు పొందిన వ్యక్తి
మలాలా యూసఫ్‌జాయ్ ఇప్పటి వరకు అవార్డు అందుకున్న చిన్న వయస్కురాలు. 2014 శాంతి బహుమతి పొందేనాటికి ఆమెకు 17 సంవత్సరాలు.
పెద్ద వయసులో అవార్డు పొందిన వ్యక్తి
ఇప్పటి వరకు నోబెల్ శాంతి బహుమతిగ్రహీతల్లో అత్యంత పెద్ద వయసు వ్యక్తి జోసెఫ్ రోట్‌బ్లాట్. 1995లో అతనికి బహుమతి లభించేనాటికి అతని వయస్సు 87 సంవత్సరాలు.
మహిళా నోబెల్ శాంతి బహుమతి గ్రహీతలు
నోబెల్ శాంతి బహుమతి పొందిన 109 మందిలో 18 మంది మహిళలు. 1905లో బెర్తా వాన్ సట్నర్ నోబెల్ శాంతి బహుమతి పొందిన తొలి మహిళగా రికార్డు సృష్టించారు.
1905 - బెర్తా వాన్ సట్నర్
1931 - జేన్ ఆడమ్స్
1946 - ఎమిలీ గ్రీన్ బాల్చ్
1976 - బెట్టీ విలియమ్స్
1976 - మైరెడ్ కొరిగన్
1979 - మదర్ థెరిసా
1982 - అల్వా మిర్డాల్
1991 - ఆంగ్ సాన్ సూకీ
1992 – రిగోబెర్టా మెంచు తుమ్
1997 - జోడీ విలియమ్స్
2003 - షిరిన్ ఎబడి
2004 – వంగరి మాతై
2011 - ఎల్లెన్ జాన్సన్ సర్లీఫ్
2011 - లేమా గ్బోవీ
2011 – తవకోల్ కర్మన్
2014 - మలాలా యూసఫ్‌జాయ్
2018 - నదియా మురాద్
2021 - మరియా రెస్సా
ఎక్కువసార్లు నోబెల్ శాంతి బహుమతి అందుకున్న వాళ్లు
ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ ది రెడ్‌క్రాస్ (ICRC) అత్యధికంగా మూడు సార్లు నోబెల్ బహుమతి అందుకుంది. ICRC స్థాపకుడు, హెన్రీ డునాంట్ 1901లో మొదటిసారి నోబెల్ శాంతి బహుమతి స్వీకరించారు.
లినస్ పాలింగ్‌కు రెండుసార్లు వివిధ విభాగాల్లో నోబెల్ బహుమతి వచ్చింది. 1954న రసాయన శాస్త్రంలో 1962న శాంతి విభాగంలో అవార్డు వరించింది. ICRCకి 1917, 1944, 1963లో అవార్డు ప్రదానం చేశారు. UNHCRకు 1954, 1981లో నోబెల్ వచ్చింది.
నోబెల్ శాంతి బహుమతి తిరస్కరించింది
వియత్నాం రాజకీయ నాయకుడు లే డక్ థో అమెరికా విదేశాంగ మంత్రి హెన్రీ కిస్సింగర్‌తో కలిసి 1973 నోబెల్ శాంతి బహుమతి తీసుకునేందుకు నిరాకరించారు. నోబెల్ శాంతి బహుమతిని తిరస్కరించిన ఏకైక వ్యక్తి ఆయనే. వియత్నాం శాంతి ఒప్పందంపై చర్చలు జరిపినందుకు వారిద్దరికీ బహుమతి లభించింది. కానీ వియత్నాంలోని పరిస్థితులు కారణంగా తాను నోబెల్ బహుమతిని స్వీకరించే స్థితిలో లేనని లె డక్ థో చెప్పారు.
జైల్లో ఉండి అవార్డు తీసుకున్న వ్యక్తులు
జర్మన్ శాంతిదూత, పాత్రికేయుడు కార్ల్ వాన్ ఒసిట్జ్కీ జైల్లో ఉన్న టైంలోనే అవార్డు ప్రకటించారు. బర్మా రాజకీయవేత్త ఆంగ్ సాన్ సూకీకి కూడా జైల్లో ఉన్నప్పుడే నోబెల్ వరించింది. చైనా మానవ హక్కుల కార్యకర్త లియు జియాబో కూడా అరెస్టైన టైంలో నోబెల్ ప్రకటించారు.
మరణానంతరం నోబెల్ ప్రకటించిన వ్యక్తులు
1961లో డాగ్ హమర్స్క్‌జోల్డ్‌కు మరణానంతరం నోబెల్ శాంతి బహుమతి ఇచ్చారు. 1974 నుంచి రూల్స్ మార్చారు. మరణానంతరం బహుమతిని ప్రదానం చేయరాదని నిర్ణయించారు. 1974కి ముందు నోబెల్ బహుమతిని మరణానంతరం ఎరిక్ ఆక్సెల్ కార్ల్‌ఫెల్డ్ సాహిత్యంలో 1931లో పొందారు.
సర్‌ప్రైజ్ నోబెల్ శాంతి అందుకున్న వ్యక్తులు
విన్‌స్టన్ చర్చిల్‌కు నోబెల్ శాంతి బహుమతి లభించిందని చాలా మంది భావించారు. కానీ 1953 సాహిత్యంలో నోబెల్ బహుమతి లభించింది. ఆ ఏడాది ఆయన సాహిత్య, శాంతి విభాగాల్లో నామినేట్ అయ్యారు.
నామినేట్ చేసిన నేటికీ నోబెల్ బహుమతి రాని వ్యక్తులు
నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయిన ప్రముఖులు- అడాల్ఫ్ హిట్లర్, మహాత్మా గాంధీ, జోసెఫ్ స్టాలిన్. ఇలా చాలామంది ప్రపంచవ్యాప్తంగా నామినేషన్ లిస్ట్‌లో ఉన్నారు. కానీ వారికి వివిధ కారణాలతో బహుమతి వరించలేదు.
1937, 1938, 1939, 1947లో మహాత్మాగాంధీ ఈ అవార్డు కోసం నామినేట్ అయ్యారు. కానీ ఆయనకు అవార్డు రాలేదు. జనవరి 1948లో హత్యకు కొన్ని రోజుల ముందు ఆయనను నామినేట్ చేశారు. నోబెల్ కమిటీలోని సభ్యులు దీనిపై బహిరంగంగా విచారం వ్యక్తం చేశారు. 1989లో దలైలామాకు శాంతి బహుమతి ప్రదానం చేసినప్పుడు... కమిటీ ఛైర్మన్ ఇది "మహాత్మా గాంధీ జ్ఞాపకార్థం పాక్షికంగా నివాళి" అని అన్నారు. అయితే, గాంధీకి ఎందుకు బహుమతి ఇవ్వలేదనే ఊహాగానాలపై కమిటీ ఎప్పుడూ స్పందించలేదు.
ఒకరిని నోబెల్ కోసం ఎన్నిసార్లు నామినేట్ చేయవచ్చు?
జాన్ ఆడమ్స్ 1916 నుంచి 1931 వరకు 91 సార్లు నామినేట్ అయ్యారు. చివరకు 1931లో నోబెల్ శాంతి బహుమతి లభించింది. కానీ ఎమిలీ గ్రీన్ బాల్చ్, ఫ్రిడ్ట్‌జోఫ్ నాన్సెన్, థియోడర్ రూజ్‌వెల్ట్ నామినేట్ చోసిన మొదటి సంవత్సరంలోనే నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నారు.
నోబెల్ శాంతి బహుమతి పతకం
నోబెల్ శాంతి బహుమతి పతకాన్ని నార్వే శిల్పి గుస్తావ్ విగెలాండ్ రూపొందించారు. ఆల్ఫ్రెడ్ నోబెల్ ఇతర పతకాల కంటే కొంచెం భిన్నంగా ఉంటుందీ పతకం.