NEET UG Counselling 2025: నీట్ యూజీ కౌన్సెలింగ్ రౌండ్ 2 సీట్ల కేటాయింపు ఇలా చెక్ చేసుకోండి, పూర్తి ప్రక్రియ ఇదే
మెడికల్ కాలేజీలలో ప్రవేశాల కోసం NEET UG 2025 కౌన్సెలింగ్ రౌండ్ 2 సీట్ల కేటాయింపు ఫలితాలు అధికారిక వెబ్‌సైట్ mccnicinలో చెక్ చేసుకోవాలని అధికారలు సూచించారు.

వైద్య కళాశాల (Medical Colleges)లో ప్రవేశం పొందాలని కలలు కంటున్న విద్యార్థులకు కీలక అప్డేడ్ వచ్చింది. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET UG) 2025 కౌన్సెలింగ్ ప్రక్రియ రెండో రౌండ్ ఇప్పుడు కీలక దశకు చేరుకుంది. మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) సెప్టెంబర్ 17, 2025న రౌండ్-2 సీట్ల కేటాయింపు ఫలితాలను విడుదల చేస్తుంది. సీట్ల కేటాయింపు ఫలితాలు MCC అధికారిక వెబ్‌సైట్ mcc.nic.inలో అందుబాటులో ఉంటాయి. ఈ రౌండ్‌లో దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు తమ Seat Allotment Status ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవచ్చు.
విద్యార్థులకు ఉపశమనం
మొదటి రౌండ్‌లో సీటు పొందలేని విద్యార్థులకు రెండో రౌండ్ సీట్ల కేటాయింపు ఫలితాలు ఊరటనిస్తాయి. ఇప్పుడు వారికి మెడికల్ కాలేజీలలో ప్రవేశం పొందే అవకాశం ఉంది. ఈసారి కూడా సీటు రాకపోతే నిరాశ చెందాల్సిన అవసరం లేదు. చివరిదైన మూడో రౌండ్ కూడా ఉంటుంది. అందులోనూ విద్యార్థులకు కాలేజీల సీట్లు అలాట్ అవుతాయి. కాబట్టి, విద్యార్థులు MCC వెబ్‌సైట్‌ను క్రమం తప్పకుండా చెక్ చేస్తూ ఉండాలి. ప్రతి అప్‌డేట్‌ను గమనిస్తూ ఉండటం చాలా ముఖ్యం.
ఫలితాలను చెక్ చేయడానికి ఇలా చేయండి
- ముందుగా మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ అధికారిక వెబ్‌సైట్ mcc.nic.in కి వెళ్లండి
- అందులో UG కౌన్సెలింగ్ విభాగానికి వెళ్లండి.
- నీట్ యూజీ రౌండ్-2 కేటాయింపు ఫలితం లింక్‌పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీ NEET రోల్ నంబర్, పాస్‌వర్డ్ ఎంటర్ చేసి అందులోకి లాగిన్ అవ్వండి.
- మీకు సీటు కేటాయింపు జరిగితే, ఆ లేఖను డౌన్‌లోడ్ చేసుకోండి. కాలేజీలో ప్రవేశం పొందే సమయంలో ఇదే ముఖ్యమైన సర్టిఫికటె్ అవుతుంది.
తదుపరి ప్రక్రియ ఏంటి..
- 10వ, 12వ తరగతి మార్కుల మోమోలు సిద్ధంగా ఉంచుకోవాలి
- NEET స్కోర్‌కార్డ్, ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్ ఉండాలి
- ఏదౌనా ఒక ఫోటో గుర్తింపు కార్డు (Photo ID)
- పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు
- ఇతర అవసరమైన సర్టిఫికెట్లు (అవరసరమైన వారు కేటగిరీ సర్టిఫికెట్ వంటివి)
అన్ని పత్రాల ఒరిజనల్, జిరాక్స్ రెండూ తీసుకురావడం అవసరమని విద్యార్థులు గుర్తుంచుకోవాలి.
ముఖ్యమైన తేదీలను గుర్తుంచుకోండి
- బుధవారం, సెప్టెంబర్ 17, 2025 – రౌండ్-2 సీటు కేటాయింపు ఫలితాలు విడుదల.
- గురువారం, సెప్టెంబర్ 18 నుండి 25, 2025 – కేటాయించిన కాలేజీలో రిపోర్టింగ్, ఎంట్రన్స్ ప్రక్రియ.
- సెప్టెంబర్ 27, 2025 – మూడవ, చివరి రౌండ్ కౌన్సెలింగ్ కోసం రిజిస్ట్రేషన్ ప్రారంభం.
విద్యార్థులు ఏ విషయాలను గుర్తుంచుకోవాలి
- సీటు కేటాయింపు లేఖ (Seat Allotment Letter)ను ఎల్లప్పుడూ మీ దగ్గర ఉంచుకోండి, దీని ఆధారంగానే మీకు కాలేజీలో సీటు ఇస్తారు.
- కేటాయించిన సీటు, కేటగిరీ వివరాలను జాగ్రత్తగా చెక్ చేసుకోండి
- నిర్ణయానికి సమయానికి కళాశాలలో రిపోర్ట్ చేయాలి. లేకపోతే మీ కేటాయించిన సీటు రద్దు చేసే అవకాశాలున్నాయి.






















