News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

NEET UG 2023: నీట్ (యూజీ)-2023 దరఖాస్తుకు నేటి నుంచి 13 వరకు అవకాశం, పరీక్ష వివరాలు ఇలా!

దేశవ్యాప్తంగా నీట్ యూజీ 2023 దరఖాస్తు గడువు ఏప్రిల్ 6తో ముగిసిన సంగతి తెలిసిందే. అయితే అభ్యర్థుల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ఎన్టీఏ ఏప్రిల్ 11 నుంచి 13 వరకు మరోసారి దరఖాస్తుకు అవకాశం కల్పించింది.

FOLLOW US: 
Share:

దేశవ్యాప్తంగా నీట్ యూజీ 2023 దరఖాస్తు గడువు ఏప్రిల్ 6తో ముగిసిన సంగతి తెలిసిందే. అయితే అభ్యర్థుల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ఎన్టీఏ ఏప్రిల్ 11 నుంచి 13 వరకు మరోసారి దరఖాస్తుకు అవకాశం కల్పించింది. అభ్యర్థులు ఏప్రిల్ 11న ఉదయం 11.30 గంటల నుంచి ఏప్రిల్ 13న రాత్రి 11.30 వరకు దరఖాస్తు చేసుకోవాలి, అలాగే రాత్రి 11.59 గంటల వరకు ఫీజు చెల్లించవచ్చని ఎన్టీఏ ఒక ప్రకటనలో తెలిపింది. వాస్తవానికి నీట్ రిజిస్ట్రేషన్ గడువు ఏప్రిల్ 6 తోనే ముగిసింది. అయితే, పలు సమస్యల వల్ల సకాలంలో దరఖాస్తు చేయలేకపోయామని అభ్యర్థులు చేసిన విజ్ఞప్తిని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) పరిగణనలోకి తీసుకుంది. అటు, ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నవారు తమ అప్లికేషన్లలో పొరపాట్లను సవరించుకునేందుకు ఎన్టీఏ తాజాగా కరెక్షన్ విండోను అందుబాటులోకి తీసుకువచ్చింది.

దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్) యూజీ పరీక్షకు మార్చి 6న నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. అదేరోజు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. అయితే ఏప్రిల్ 6తో దరఖాస్తు గడువు ముగియనుంది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేని అభ్యర్థులు వెంటనే తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.

నీట్ యూజీ పరీక్షను మే 7న నిర్వహించనున్నట్లు ఇప్పటికే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంగ్లిష్, హిందీ, తెలుగుతో పాటు మొత్తం 13 భాషల్లో ఈ పరీక్షను పెన్ను, పేపర్ విధానంలో నిర్వహించనున్నారు. అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్, పరీక్ష కేంద్రాలకు సంబంధించిన సమాచారాన్ని ఎన్‌టీఏ వెబ్‌సైట్‌లో వెల్లడించనున్నారు. నీట్ పరీక్ష మే 7న (ఆదివారం) మధ్యాహ్నం 2గంటల నుంచి 5.20 గంటల మధ్య జరగనుంది.

కోర్సుల వివరాలు..

ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్, ఎంఎస్, బీయూఎంఎస్, బీహెచ్‌ఎంఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏటా ఈ పరీక్ష నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. గత ఐదేళ్లుగా ఈ పరీక్ష రాసేవారి సంఖ్య ఏటా పెరుగుతోంది. గతేడాది 17.64 లక్షల మంది నీట్ యూజీ పరీక్ష రాయగా.. ఈ ఏడాది 18లక్షల మంది రాసే అవకాశం ఉందని ఓ అంచనా. 

అర్హతలు..
➥ 50 శాతం మార్కులతో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ/బయోటెక్నాలజీ సంబంధిత గ్రూపులతో 10+2/ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/దివ్యాంగుల అభ్యర్థులకు 40 శాతం మార్కులు తప్పనిసరి.

➥ విదేశాల్లో ఎంబీబీస్ పూర్తిచేసి ఇండియాలో ఉద్యోగం చేసేందుకు సిద్ధమయ్యే భారతీయ విద్యార్థులు, విదేశీ విద్యార్థులు కూడా నీట్ క్వాలిఫై అవ్వటం తప్పనిసరి.

➥ జనరల్ కేటగిరి విద్యార్థులు వరుసగా 9 ఏళ్ళు హాజరయ్యే అవకాశం ఉంది. రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులు గరిష్టంగా 15 ఏళ్లు హాజరవ్వొచ్చు.

వయోపరిమితి: 31.12.2023 నాటికి అభ్యర్థుల వయసు 17 సంవత్సరాలు నిండి ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/దివ్యాంగుల అభ్యర్థులకు 5 సంవత్సరాలపాటు వయో సడలింపు ఉంటుంది. ఈ అభ్యర్థుల గరిష్థ వయసు 25 సంవత్సరాలకు మించకూడదు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. నీట్‌కు దరఖాస్తు చేసుకున్న తర్వాత కన్ఫర్మేషన్ పేజీని డౌన్‌లోడ్ చేసుకొని భద్రపరచుకోండి. అలాగే, అప్‌లోడ్ చేసిన ఫొటో కాపీని సైతం మీ వద్దే ఉంచుకోండి. ఆ డాక్యుమెంట్లు తర్వాత అవసరమవుతాయి.

ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: జనరల్ కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుం రూ.1700 కాగా, జనరల్ ఈడబ్ల్యూఎస్/ఓబీసీ-ఎన్‌సీఎల్ అభ్యర్థులకు రూ.1600, ఎస్సీ, ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/థర్డ్ జండర్ అభ్యర్థులకు రూ.100 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఇతర దేశాలకు చెందిన అభ్యర్థులైతే దరఖాస్తు రుసుం రూ.9500లుగా నిర్ణయించారు. 

నీట్ యూజీ పరీక్ష విధానం..
➥ నీట్ ప్రవేశ పరీక్ష పూర్తి ఆఫ్‌లైన్‌ (పెన్, పేపర్) విధానంలో నిర్వహించబడుతుంది. మూడు గంటల 20 నిముషాల నిడివితో జరిగే ఈ పరీక్షలో ప్రతి సబ్జెక్టు నుండి గరిష్టంగా 45 ప్రశ్నలు చెప్పున మొత్తం 180 ఆబ్జెక్టివ్ టైపు ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ప్రశ్నలు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ మరియు జూవాలాజీ సబ్జెక్టులకు సంబంధించి ఉంటాయి.

➥ ఒక్కో సబ్జెక్టు నుంచి రెండు సెక్షన్ల (సెక్షన్-ఎ, బి) వారీగా 50 ప్రశ్నలు ఇస్తారు. సెక్షన్-ఎ నుంచి 35 ప్రశ్నలు, సెక్షన్-బి నుంచి 15 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఇస్తారు. సెక్షన్-బి లోని 15 ప్రశ్నల్లో 10 ప్రశ్నలకు మాత్రమే సమాధానం రాయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి అభ్యర్థి సమాధానం చేసిన మొదటి 10 ప్రశ్నలను మాత్రమే లెక్కింపు సమయంలో పరిగణలోకి తీసుకుంటారు.

➥ ప్రతి ప్రశ్న మల్టిఫుల్ ఛాయస్ పద్దతిలో నాలుగు ఆప్షనల్ సమాధానాలు కలిగి ఉంటుంది. అందులో ఒక సరైన సమాధానాన్ని గుర్తించవలసి ఉంటుంది. సరైన సమాధానం చేసిన ప్రతి ప్రశ్నకు 4 మార్కులు. తప్పు సమాధానం ఇచ్చిన ప్రశ్నకు మైనస్ 1 మార్కు ఇవ్వబడుతుంది.

➥ మొత్తం 720 మార్కులకు జరిగే ఈ పరీక్షలో 10+2/ఇంటర్మీడియట్ స్థాయిలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ (బోటనీ, జువాలాజీ) లకు సంబంధించిన సిలబస్ నుండి ప్రశ్నలు ఇస్తారు. ప్రశ్న పత్రాలు దాదాపు అన్ని ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు...

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం 06.03.2023

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 06.04.2023. (11.04.2023 - 13.04.2023 వరకు మరోసారి అవకాశం)

➥ నీట్ యూజీ-2023 పరీక్ష తేదీ: 07.05.2023.

Website 

Correction Window

Public Notice
Information Broucher

                               

Published at : 11 Apr 2023 01:13 PM (IST) Tags: Education News in Telugu NEET UG 2023 Registration NEET UG 2023 Notification NEET UG 2023 Application NEET UG 2023 Exam Date

ఇవి కూడా చూడండి

World University Rankings 2024: వరల్డ్‌ యూనివర్సిటీ ర్యాంకుల్లో 91 భారతీయ విశ్వవిద్యాలయాలకు చోటు

World University Rankings 2024: వరల్డ్‌ యూనివర్సిటీ ర్యాంకుల్లో 91 భారతీయ విశ్వవిద్యాలయాలకు చోటు

TS TET: తెలంగాణ 'టెట్' పేప‌ర్-1లో 36.89 శాతం, పేప‌ర్‌-2లో 15.30 శాతం ఉత్తీర్ణత

TS TET: తెలంగాణ 'టెట్' పేప‌ర్-1లో 36.89 శాతం, పేప‌ర్‌-2లో 15.30 శాతం ఉత్తీర్ణత

Telangana Group 1 : గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దు ఖాయం - ప్రభుత్వ అప్పీల్‌ను కొట్టేసిన తెలంగాణ హైకోర్టు !

Telangana Group 1 :    గ్రూప్ 1 ప్రిలిమ్స్  రద్దు ఖాయం   - ప్రభుత్వ అప్పీల్‌ను కొట్టేసిన తెలంగాణ హైకోర్టు !

TS TET 2023 Results: తెలంగాణ 'టెట్‌' ఫలితాలు విడుదల, రిజల్ట్స్ లింక్ ఇదే

TS TET 2023 Results: తెలంగాణ 'టెట్‌' ఫలితాలు విడుదల, రిజల్ట్స్ లింక్ ఇదే

TS TET 2023 Results: 27న తెలంగాణ 'టెట్‌' ఫలితాలు, రిజల్ట్స్ వెల్లడి సమయమిదే!

TS TET 2023 Results: 27న తెలంగాణ 'టెట్‌' ఫలితాలు, రిజల్ట్స్ వెల్లడి సమయమిదే!

టాప్ స్టోరీస్

Skanda Review Review - 'స్కంద' రివ్యూ : యాక్షన్ విధ్వంసం - రామ్, బోయపాటి సినిమా ఎలా ఉందంటే?

Skanda Review Review - 'స్కంద' రివ్యూ : యాక్షన్ విధ్వంసం - రామ్, బోయపాటి సినిమా ఎలా ఉందంటే?

Chandramukhi 2 Review: చంద్రముఖి 2 రివ్యూ: రజనీ సినిమా సీక్వెల్‌లో రాఘవ లారెన్స్ భయపెట్టాడా? నవ్వించాడా?

Chandramukhi 2 Review: చంద్రముఖి 2 రివ్యూ: రజనీ సినిమా సీక్వెల్‌లో రాఘవ లారెన్స్ భయపెట్టాడా? నవ్వించాడా?

Telangana Election 2023: ఎన్నికల ప్రచారానికి తెలంగాణ బీజేపీ షెడ్యూల్‌-వచ్చే నెలలో 30 నుంచి 40 సభలు

Telangana Election 2023: ఎన్నికల ప్రచారానికి తెలంగాణ బీజేపీ షెడ్యూల్‌-వచ్చే నెలలో 30 నుంచి 40 సభలు

AP News : కాగ్ అభ్యంతరాలు - కోర్టుల్లో పిటిషన్లు ! గ్రామ, వార్డు సచివాలయాలు రాజ్యాంగ వ్యతిరేకమా ?

AP News : కాగ్ అభ్యంతరాలు - కోర్టుల్లో పిటిషన్లు !  గ్రామ, వార్డు సచివాలయాలు రాజ్యాంగ వ్యతిరేకమా ?