అన్వేషించండి

NEET PG: కటాఫ్ తగ్గింపుతో అర్హత సాధించినవారు రిజిస్ట్రేషన్ చేసుకోండి, అభ్యర్థులకు కేంద్రం సూచన!

నీట్ పీజీ కటాఫ్ మార్కుల తగ్గింపు అనంతరం అడ్మిషన్లకు అర్హత సాధించిన అభ్యర్థులు ఫ్రెష్ రిజిస్ట్రేషన్ చేయించుకొని, మాప్ అప్ రౌండ్ కౌన్సెలింగ్ లో పాల్గొనాలని కేంద్ర ఆరోగ్యశాఖ కోరింది.

నీట్ పీజీ మెడికల్ కోర్సుల్లో అడ్మిషన్లకు సంబంధించిన కటాఫ్ మార్కులను తగ్గిస్తున్నట్లు కేంద్ర సర్కారు ప్రకటించిన సంగతి విదితమే. అన్ని కేటగిరిల వారికి కటాఫ్ మార్కులను 25 శాతం చొప్పున తగ్గించినట్లు వెల్లడించింది. జనరల్ కేటగిరి అభ్యర్థులకు 25 శాతం, జనరల్ కేటగిరిలోని దివ్యాంగులకు 20 శాతం,  ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు,ఈ విభాగాల్లోని  దివ్యాంగులకు 15 శాతం మేర కటాఫ్ మార్కులను తగ్గించినట్లు తెలిపింది.  ఈమేరకు కటాఫ్ మార్కుల తగ్గింపు అనంతరం నీట్ పీజీ మెడికల్ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం అర్హత సాధించేందుకు జనరల్ కేటగిరి అభ్యర్థులు 24.28 శాతం, ఎస్సీ,ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులు 14.29 శాతం, దివ్యాంగులు 19.29 శాతం చొప్పున మార్కులు పొందితే సరిపోతుంది.
NEET PG: కటాఫ్ తగ్గింపుతో అర్హత సాధించినవారు రిజిస్ట్రేషన్ చేసుకోండి, అభ్యర్థులకు కేంద్రం సూచన!

ఈనేపథ్యంలో కటాఫ్ మార్కుల తగ్గింపు అనంతరం అడ్మిషన్లకు అర్హత సాధించిన అభ్యర్థులు ఫ్రెష్ రిజిస్ట్రేషన్ చేయించుకొని, మాప్ అప్ రౌండ్ కౌన్సెలింగ్ లో పాల్గొనాలని కేంద్ర ఆరోగ్యశాఖ కోరింది. అర్హత సాధించిన అభ్యర్థులందరికీ దీనిపై సమాచారాన్ని అందించింది. గత  సెషన్ లో జరిగిన పీజీ మెడికల్ కోర్సుల కౌన్సెలింగ్ లో 1400 సీట్లు భర్తీ కాలేదు. ఇలా మిగిలిపోతున్న సీట్లను భర్తీ చేసే ఉద్దేశంతోనే కటాఫ్ మార్కులను తగ్గించినట్లు తెలుస్తోంది. ఇక రెండోవిడత కౌన్సెలింగ్ కు ఎంపికైన అభ్యర్థుల జాబితాను అక్టోబరు 19న విడుదల చేశారు. మూడో విడత కౌన్సెలింగ్ అక్టోబరు 31 నుంచి నవంబరు 4 వరకు జరగనుంది. 

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

 

:: Also Read ::

యాజమాన్య కోటా ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ ప్రవేశాలకు నోటిఫికేషన్‌ జారీ, ఆన్‌లైన్‌ దరఖాస్తు షెడ్యూలు ఇదే!
తెలంగాణలో ప్రైవేటు వైద్య, దంత కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో యాజమాన్య కోటా సీట్ల ప్రవేశాలకు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం అక్టోబర్ 19న నోటిఫికేషన్ విడుదల చేసింది. నీట్-2022లో అర్హత సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు అక్టోబర్ 20న ఉదయం 10 గంటల నుంచి అక్టోబరు 27 సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలో అభ్యర్థులు తమ విద్యార్హత ధ్రువపత్రాలను స్కాన్‌ చేసి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం అర్హుల తుది జాబితాను విడుదల చేస్తారు.
నోటిఫికేషన్, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..

Degree Courses: డిగ్రీలో కొత్త కోర్సులు, వచ్చే ఏడాది నుంచి అమల్లోకి!
తెలంగాణలోని యూనివర్సిటీల్లో మూస విద్యావిధానానికి స్వస్తి పలకాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. వచ్చే ఏడాదికల్లా కొలువులిచ్చే కోర్సుల రూపకల్పనకు చర్యలు చేపట్టింది. ఇందుకోసం ముగ్గురు వైస్‌చాన్స్‌లర్లతో త్రిసభ్య కమిటీని నియమించింది. శాతవాహన వర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ ఎస్‌.మల్లేశ్‌ చైర్మన్‌గా, ఉస్మానియా వీసీ ప్రొఫెసర్‌ డి.రవీందర్‌, మహత్మాగాంధీ వర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ గోపాల్‌రెడ్డి సభ్యులుగా కమిటీ వేసింది.
కోర్సుల వివరాల కోసం క్లిక్ చేయండి..


Cyber Security: సైబర్‌ సెక్యూరిటీ కోర్సుల్లో శిక్షణ, అర్హతలివే!

కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని 'నేషనల్ అకాడమీ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ' సైబర్ సెక్యూరిటీ కోర్సుల్లో శిక్షణను దరఖాస్తులు కోరుతోంది. సైబర్ సెక్యూరిటీ ఆఫీసర్, డిప్లొమా, పీజీ డిప్లొమా ఇన్ సైబర్ సెక్యూరిటీ మేనేజ్‌మెంట్, సైబర్ సెక్యూరిటీ ఎథికల్ హ్యాకింగ్, సర్టిఫికెట్‌ ఇన్ సైబర్ సెక్యూరిటీ కోర్సుల్లో శిక్షణ ఇస్తారు. ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసినవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆసక్తి ఉన్నవారు అక్టోబ‌రు 27 లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు 7893141797 ఫోన్ నంబ‌రులో సంప్రదించవచ్చు. 
కోర్సుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TDP vs Janasena: టీడీపీ, జనసేన నేతల మధ్య పెరుగుతున్న విభేదాలు - చంద్రబాబు, పవన్ ఏం చేస్తున్నారో!
టీడీపీ, జనసేన నేతల మధ్య పెరుగుతున్న విభేదాలు - చంద్రబాబు, పవన్ ఏం చేస్తున్నారో!
Telangana Politics: రేవంత్‌ను  మార్చేస్తారా ?  బీజేపీ ఎల్పీ నేతకే ఆ సీక్రెట్ ఎలా తెలిసింది ?
రేవంత్‌ను మార్చేస్తారా ? బీజేపీ ఎల్పీ నేతకే ఆ సీక్రెట్ ఎలా తెలిసింది ?
Nara Lokesh: న్యూయార్క్‌ ట్రాఫిక్‌లో ఇరుక్కున్న లోకేష్‌- కాలినడకన వెళ్లి బ్యాంక్ ఆఫ్ అమెరికా వైస్ ఛైర్మన్‌తో భేటీ
న్యూయార్క్‌ ట్రాఫిక్‌లో ఇరుక్కున్న లోకేష్‌- కాలినడకన వెళ్లి బ్యాంక్ ఆఫ్ అమెరికా వైస్ ఛైర్మన్‌తో భేటీ
Matka Trailer: వరుణ్ తేజ్ గట్టిగా కొట్టేలా ఉన్నాడే... మట్కా ట్రైలర్ వచ్చిందిరోయ్, చూశారా?
వరుణ్ తేజ్ గట్టిగా కొట్టేలా ఉన్నాడే... మట్కా ట్రైలర్ వచ్చిందిరోయ్, చూశారా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Kithampeta Village No Diwali Celebrations |  70ఏళ్లుగా దీపావళి పండుగకు దూరమైన కిత్తంపేట | ABP DesamKTR Padayatra Announced | పాదయాత్ర చేస్తానన్న కేటీఆర్..గులాబీ పార్టీ కొత్త అధినేతగా అడుగులు | ABP DesamEngland Players Not Retained by IPL Franchises | ఇంగ్లండ్ ప్లేయర్లకు ఫ్రాంచైజీలు ఝలక్ | ABP Desamఇజ్రాయేల్‌లో భారీ సైరన్‌ల మోత, వెంటనే పేలుళ్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TDP vs Janasena: టీడీపీ, జనసేన నేతల మధ్య పెరుగుతున్న విభేదాలు - చంద్రబాబు, పవన్ ఏం చేస్తున్నారో!
టీడీపీ, జనసేన నేతల మధ్య పెరుగుతున్న విభేదాలు - చంద్రబాబు, పవన్ ఏం చేస్తున్నారో!
Telangana Politics: రేవంత్‌ను  మార్చేస్తారా ?  బీజేపీ ఎల్పీ నేతకే ఆ సీక్రెట్ ఎలా తెలిసింది ?
రేవంత్‌ను మార్చేస్తారా ? బీజేపీ ఎల్పీ నేతకే ఆ సీక్రెట్ ఎలా తెలిసింది ?
Nara Lokesh: న్యూయార్క్‌ ట్రాఫిక్‌లో ఇరుక్కున్న లోకేష్‌- కాలినడకన వెళ్లి బ్యాంక్ ఆఫ్ అమెరికా వైస్ ఛైర్మన్‌తో భేటీ
న్యూయార్క్‌ ట్రాఫిక్‌లో ఇరుక్కున్న లోకేష్‌- కాలినడకన వెళ్లి బ్యాంక్ ఆఫ్ అమెరికా వైస్ ఛైర్మన్‌తో భేటీ
Matka Trailer: వరుణ్ తేజ్ గట్టిగా కొట్టేలా ఉన్నాడే... మట్కా ట్రైలర్ వచ్చిందిరోయ్, చూశారా?
వరుణ్ తేజ్ గట్టిగా కొట్టేలా ఉన్నాడే... మట్కా ట్రైలర్ వచ్చిందిరోయ్, చూశారా?
TamilNadu Politics: విజయ్‌తో పొత్తు కోసం అన్నాడీఎంకే రెడీ - కొత్త  పొలిటికల్ స్టార్ నిర్ణయం ఎలా ఉంటుంది?
విజయ్‌తో పొత్తు కోసం అన్నాడీఎంకే రెడీ - కొత్త పొలిటికల్ స్టార్ నిర్ణయం ఎలా ఉంటుంది?
Gold Vs Diamond: బంగారం లేదా వజ్రం - ఎందులో పెట్టుబడితో ఎక్కువ లాభం?
బంగారం లేదా వజ్రం - ఎందులో పెట్టుబడితో ఎక్కువ లాభం?
Traffic Diverts For Sadar Sammelan: సదర్ ఉత్సవాలకు సిద్ధమైన హైదరాబాద్‌-  ఈ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ ఆంక్షలు
సదర్ ఉత్సవాలకు సిద్ధమైన హైదరాబాద్‌- ఈ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ ఆంక్షలు
Lucky Bhaskar Collection Day 2: బాక్సాఫీస్ బరిలో రెండో రోజూ 'లక్కీ భాస్కర్' జోరు... 2 డేస్ కలెక్షన్స్ ఎంతంటే?
బాక్సాఫీస్ బరిలో రెండో రోజూ 'లక్కీ భాస్కర్' జోరు... 2 డేస్ కలెక్షన్స్ ఎంతంటే?
Embed widget