అన్వేషించండి

UGC NET Application: యూజీసీ నెట్ (జూన్) - 2024 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?

UGC NET 2024: దేశంలోని యూనివర్సిటీలలో లెక్చరర్‌షిప్ (అసిస్టెంట్ ప్రొఫెసర్), జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ కోసం యూజీసీ నెట్ (జూన్)-2024 నోటిఫికేషన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) విడుదల చేసింది.

UGC NET June 2024 Application: దేశంలోని యూనివర్సిటీలలో లెక్చరర్‌షిప్ (అసిస్టెంట్ ప్రొఫెసర్), జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ కోసం యూజీసీ నెట్ (జూన్)-2024 నోటిఫికేషన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) విడుదల చేసింది. కనీసం 55 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 50 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. పీజీ చివరి సంవత్సరం పరీక్షలకు హాజరయ్యేవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. యూజీసీ నెట్ జూన్ - 2024 దరఖాస్తు ప్రక్రియ మే 20న ప్రారంభమైంది. సరైన అర్హతలు కలిగిన అభ్యర్థులు మే 10 వరకు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అయితే మే 12న రాత్రి 11.50 గంటల వరకు ఫీజు చెల్లించవచ్చు. దరఖాస్తు ఫీజుగా జనరల్-రూ.1150; ఈడబ్ల్యూఎస్/ఓబీసీ(నాన్-క్రిమిలేయర్)-రూ.600; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్స్-రూ.325 చెల్లించాలి.

ప్రకటించిన షెడ్యూలు ప్రకారం  జూన్ 16న యూజీసీ నెట్-2024 పరీక్షలను ఆన్‌లైన్ విధానంలో, రెండు షిఫ్టుల్లో పరీక్ష నిర్వహించనున్నారు. మొదటి షిఫ్టులో ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, రెండో షిఫ్టులో మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు. హిందీ, ఇంగ్లిష్ మాధ్యమాల్లో ప్రశ్నలు అడుగుతారు.
వివరాలు..

* యూజీసీ నెట్ - జూన్ 2024

అర్హత: కనీసం 55 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 50 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. పీజీ చివరి సంవత్సరం పరీక్షలకు హాజరయ్యేవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా నాలుగేళ్ల డిగ్రీ లేదా ఎనిమిది సెమిస్టర్ల డిగ్రీ ప్రోగ్రామ్‌లో 75 శాతం మార్కులు లేదా సమానమైన గ్రేడ్‌లను సాధించినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ (నాన్ క్రిమీ లేయర్), దివ్యాంగులు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు, ఇతర వర్గాలకు చెందిన వారికి 5శాతం మార్కులు/గ్రేడ్‌లలో సడలింపు ఉంటుంది.

వయోపరిమితి: 01.06.2024 నాటికి జేఆర్‌ఎఫ్ పోస్టులకు 30 సంవత్సరాలకు మించకూడదు. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఎలాంటి వయోపరిమితి లేదు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: ప్రవేశపరీక్ష ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: జనరల్-రూ.1150; ఈడబ్ల్యూఎస్/ఓబీసీ(నాన్-క్రిమిలేయర్)-రూ.600; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్స్-రూ.325 చెల్లించాలి.

పరీక్ష విధానం..

➥ ఆన్‌లైన్ (సీబీటీ) విధానంలో నిర్వహించే ఈ పరీక్షలో మొత్తం 2 పేపర్లు ఉంటాయి. రెండు పేపర్లకు కలిపి మూడు గంటల సమయం ఉంటుంది.

➥ పేపర్-1కు గంట, పేపర్-2 కు రెండు గంటల సమయం ఉంటుంది. పేపర్-1 లో 100 మార్కులకుగాను 50 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు. రీజనింగ్ ఎబిలిటీ, రీడింగ్ కాంప్రహెన్షన్, డైవర్‌జెంట్ థింకింగ్, జనరల్ అవేర్‌నెస్ నుంచి ప్రశ్నలు అడుగుతారు.

➥ పేపర్-2లో 200 మార్కులకుగాను 100 ప్రశ్నలు అడుగుతారు. ఇందులో అభ్యర్థికి సంబంధించిన సబ్జెక్టు నుంచి ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు. అభ్యర్థుల ఆప్షనల్ సబ్జెక్టు నుంచి ప్రశ్నలు ఉంటాయి. హిందీ, ఇంగ్లిష్ మాధ్యమాల్లో ప్రశ్నలు అడుగుతారు.

తెలంగాణలో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, సికింద్రాబాద్, హయత్‌నగర్, జనగాం, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మేడ్చల్, నల్గొండ, నిజామాబాద్, సంగారెడ్డి, సిద్ధిపేట, సూర్యాపేట, వరంగల్. 

ఏపీలో పరీక్ష కేంద్రాలు: అమరావతి, అనంతపురం, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, మచిలీపట్నం, మంగళగిరి, నంద్యాల, నర్సరావుపేట, నెల్లూరు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, సూరంపాలెం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.

ఇలా దరఖాస్తు చేసుకోండి..

➥ అధికారిక వెబ్‌సైట్‌ ఓపెన్ చేయాలి. - ugcnet.nta.nic.in.  

➥ అక్కడ హోంపేజీలో కనిపించే UGC NET June - 2024 లింక్ పై క్లిక్ చేయాలి.

➥ స్క్రీన్‌పై వచ్చిన పేజీలో వివరాలను నింపి, సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి. దాంతో రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది.

➥ ఆ తరువాత, మీ అకౌంట్‌లోకి లాగిన్ అవ్వాలి. UGC NET June 2024 అప్లికేషన్ ఫామ్‌ను ఫిల్ చేయాలి.

➥ అవసరమైన డాక్యుమెంట్లను అప్ లోడ్ చేసి, ఆన్‌లైన్‌లో ఫీ చెల్లించాలి.

➥ అప్లికేషన్ ఫామ్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, ప్రింట్ తీసుకుని పెట్టుకోవాలి.

ముఖ్యమైన తేదీలివే..

➥ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 20.04.2024.

➥ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: 10.05.2024 (11.50 PM).

➥ ఫీజు చెల్లించడానికి చివరితేది: 12.05.2024 (11:50 P.M).

➥ దరఖాస్తుల సవరణకు అవకాశం: 13 - 15.05.2024 (11.50 PM) 

➥ ఎగ్జామ్ సిటీ వివరాల వెల్లడి: తర్వాత వెల్లడిస్తారు.

➥ అడ్మిట్‌కార్డు డౌన్‌లోడ్: తర్వాత వెల్లడిస్తారు.

➥ యూజీసీ నెట్ (జూన్)- 2024 పరీక్షలు: 16.06.2024.

➥ ఆన్సర్ కీ వెల్లడి: తర్వాత తెలియజేస్తారు.

Notification

Online Application

Website

UGC NET Application: యూజీసీ నెట్ (జూన్) - 2024 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి.. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KCR Latest News: అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
Actor Posani Latest News : గుంటూరు జైలు నుంచి నటుడు పోసాని కృష్ణమురళి విడుదల 
గుంటూరు జైలు నుంచి నటుడు పోసాని కృష్ణమురళి విడుదల 
Delimitation JAC Meeting in Chennai:మరో 25 ఏళ్లు డీలిమిటేషన్ వద్దు- చెన్నై సమావేశంలో  తీర్మానించిన పార్టీలు 
మరో 25 ఏళ్లు డీలిమిటేషన్ వద్దు- చెన్నై సమావేశంలో  తీర్మానించిన పార్టీలు 
KTR on Delimitation: భారత్ సూపర్ పవర్ కావాలంటే దక్షిణాదిని ప్రోత్సహించాలి, లేదంటే అంతా ఏకమవుతాం: చెన్నైలో కేటీఆర్
భారత్ సూపర్ పవర్ కావాలంటే దక్షిణాదిని ప్రోత్సహించాలి, లేదంటే అంతా ఏకమవుతాం: చెన్నైలో కేటీఆర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

డీలిమిటేషన్ పై దక్షిణాది యుద్ధంమేము రాజకీయంగా నష్టపోతాంIPL 2025 Captain's Meet | రేపటి నుంచే ఐపీఎల్ మహా సంగ్రామం ప్రారంభం | ABP DesamHyderabad to host Miss World pageant |  మే 7-31 వరకూ తెలంగాణ వేదిక మిస్ ఇండియా పోటీలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR Latest News: అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
Actor Posani Latest News : గుంటూరు జైలు నుంచి నటుడు పోసాని కృష్ణమురళి విడుదల 
గుంటూరు జైలు నుంచి నటుడు పోసాని కృష్ణమురళి విడుదల 
Delimitation JAC Meeting in Chennai:మరో 25 ఏళ్లు డీలిమిటేషన్ వద్దు- చెన్నై సమావేశంలో  తీర్మానించిన పార్టీలు 
మరో 25 ఏళ్లు డీలిమిటేషన్ వద్దు- చెన్నై సమావేశంలో  తీర్మానించిన పార్టీలు 
KTR on Delimitation: భారత్ సూపర్ పవర్ కావాలంటే దక్షిణాదిని ప్రోత్సహించాలి, లేదంటే అంతా ఏకమవుతాం: చెన్నైలో కేటీఆర్
భారత్ సూపర్ పవర్ కావాలంటే దక్షిణాదిని ప్రోత్సహించాలి, లేదంటే అంతా ఏకమవుతాం: చెన్నైలో కేటీఆర్
Stalin On Delimitation:  జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ ను అడ్డుకుందాం, దక్షిణాది రాష్ట్రాలు ఏకమై పోరాడాలని స్టాలిన్ పిలుపు
జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ ను అడ్డుకుందాం, దక్షిణాది రాష్ట్రాలు ఏకమై పోరాడాలని స్టాలిన్ పిలుపు
Grama Palana officers: నిరుద్యోగులకు గుడ్ న్యూస్ - 10,954 గ్రామ రెవెన్యూ అధికారుల పోస్టులు మంజూరు, ఉత్తర్వులు జారీ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్ - 10,954 గ్రామ రెవెన్యూ అధికారుల పోస్టులు మంజూరు, ఉత్తర్వులు జారీ
Sharmila on Delimitation:  సొమ్ము సౌత్ ది.. సోకు నార్త్ ది, డీలిమిటేషన్ అన్యాయంపై చంద్రబాబు, జగన్ నోరు విప్పాలి: షర్మిల
సొమ్ము సౌత్ ది.. సోకు నార్త్ ది, డీలిమిటేషన్ అన్యాయంపై చంద్రబాబు, జగన్ నోరు విప్పాలి: షర్మిల
KTR in Chennai: డీలిమిటేషన్ వల్ల ప్రాంతీయ విభేదాలు, దక్షిణాది రాష్ట్రాలకు మరింత అన్యాయం: చెన్నైలో కేటీఆర్
డీలిమిటేషన్ వల్ల ప్రాంతీయ విభేదాలు, దక్షిణాది రాష్ట్రాలకు మరింత అన్యాయం: చెన్నైలో కేటీఆర్
Embed widget