NIOS Halltickets: ఎన్‌ఐవోఎస్ టెన్త్, ఇంటర్ పరీక్షల హాల్‌టికెట్లు విడుదల, పరీక్షలు ఎప్పటినుంచంటే?
NIOS: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ పదోతరగతి(సెకండరీ), 12వ తరగతి(సీనియర్ సెకండరీ) పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు.
NIOS 10, 12 Class Halltickets: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (NIOS) పదోతరగతి(సెకండరీ), 12వ తరగతి(సీనియర్ సెకండరీ) పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో విద్యార్థుల హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు. విద్యార్థులు తమ ఎన్‌రోల్‌మెంట్ నెంబరు, పరీక్ష వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల హాల్‌టికెట్లను ప్రింట్ తీసుకోవాలి. పరీక్షకు హాజరయ్యేవారు తప్పనిసరిగా హాల్‌టికెట్ వెంటతీసుకెళ్లాల్సి ఉంటుంది. హాల్‌టికెట్ లేనిదే పరీక్ష రాసేందుకు అనుమతి ఉండదు. అడ్మిట్ కార్డులో విద్యార్థుల పేరు, రూల్ నెంబరు, పరీక్ష కేంద్రం, పరీక్ష తేదీ సయమం వివరాలు ఉంటాయి. ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యాసంస్థల్లో మాత్రమే పరీక్షలు నిర్వహించనున్నారు.
ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ 6 నుంచి మే 22 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు ఎన్‌ఐఓఎస్ ప్రాంతీయ సంచాలకులు పి.సుబ్రమణ్యం మార్చి 31న ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు పరీక్ష తేదీలకు సంబంధించిన షెడ్యూల్‌తో పాటు హాల్‌టికెట్లను ఎన్‌ఐఓఎస్ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. విద్యార్థులు థియరీ పరీక్షలకు 30 నిమిషాల ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని ఆయన సూచించారు. పూర్తి వివరాల కోసం 040-24752859, 24750712 నంబర్లను సంప్రదించాలని సుబ్రమణ్యం తెలిపారు.
NIOS 10, 12వ తరగతి పరీక్షల హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..
పరీక్షల షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..
➥ తెలంగాణ ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ ఎగ్జామ్స్ షెడ్యూలు విడుదల - టైమ్ టేబుల్ ఇదే!
తెలంగాణ ఓపెన్ స్కూల్ పది, ఇంటర్ పరీక్షల షెడ్యూలును అధికారులు మార్చి 16న విడుదల చేశారు. అధికారిక వెబ్‌సైట్‌లో పరీక్షల టైమ్ టేబుల్‌ను అందుబాటులో ఉంచారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ 25 నుంచి మే 2 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయాతేదీల్లో రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్; మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండో సెషన్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక మే 3 నుంచి 10 వరకు ఇంటర్ జనరల్, ఒకేషనల్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో నిర్వహించే పదోతరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల హాల్‌టికెట్లు పరీక్షలకు వారం ముందునుంచి అందుబాటులో ఉంచనున్నారు. అధికారిక వెబ్‌సైట్‌లో టెన్త్, ఇంటర్ పరీక్షల హాల్‌టికెట్లను అందుబాటులో పెడతారు. విద్యార్థులు వారిపేరుతోపాటు వారు చదివే స్కూల్ వివరాలు, జిల్లా వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
పదోతరగతి పరీక్షల షెడ్యూలు ఇలా..
➥ 25.04.2024
ఉదయం సెషన్: తెలుగు, కన్నడ, తమిళం, మరాఠి.
మధ్యాహ్నం సెషన్: సైకాలజీ.
➥ 26.04.2024
ఉదయం సెషన్: ఇంగ్లిష్.
మధ్యాహ్నం సెషన్: ఇండియన్ కల్చర్ & హెరిటేజ్.
➥ 27.04.2024
ఉదయం సెషన్: మ్యాథమెటిక్స్.
మధ్యాహ్నం సెషన్: బిజినెస్ స్టడీస్.
➥ 29.04.2024
ఉదయం సెషన్: సైన్స్ & టెక్నాలజీ.
మధ్యాహ్నం సెషన్: హిందీ.
➥ 30.04.2024
ఉదయం సెషన్: సోషల్ స్టడీస్.
మధ్యాహ్నం సెషన్: ఉర్దూ.
➥ 01.05.2024
ఉదయం సెషన్: ఎకనామిక్స్.
మధ్యాహ్నం సెషన్:హోంసైన్స్.
➥ 02.05.2024
ఉదయం సెషన్: వొకేషనల్ సబ్జెక్టులు.
మధ్యాహ్నం సెషన్: వొకేషనల్ సబ్జెక్టులు (ప్రాక్టికల్స్)
ఇంటర్ పరీక్షల షెడ్యూలు ఇలా..
➥ 25.04.2024
ఉదయం సెషన్: తెలుగు/ఉర్దూ/హిందీ.
మధ్యాహ్నం సెషన్: అరబిక్.
➥ 26.04.2024
ఉదయం సెషన్: ఇంగ్లిష్.
మధ్యాహ్నం సెషన్: సోషియాలజీ.
➥ 27.04.2024
ఉదయం సెషన్: పొలిటికల్ సైన్స్.
మధ్యాహ్నం సెషన్: కెమిస్ట్రీ, పెయింటింగ్.
➥ 29.04.2024
ఉదయం సెషన్: కామర్స్/బిజినెస్ స్టడీస్.
మధ్యాహ్నం సెషన్: సైకాలజీ, ఫిజిక్స్.
➥ 30.04.2024
ఉదయం సెషన్: హిస్టరీ.
మధ్యాహ్నం సెషన్: మ్యాథమెటిక్స్, జియెగ్రఫీ.
➥ 01.05.2024
ఉదయం సెషన్: ఎకనామిక్స్, మాస్ కమ్యూనికేషన్.
మధ్యాహ్నం సెషన్: బయాలజీ, అకౌంటెన్సీ, హోంసైన్స్.
➥ 02.05.2024
ఉదయం సెషన్: వొకేషనల్ సబ్జెక్టులు (థియరీ).
మధ్యాహ్నం సెషన్: ఎలాంటి పరీక్ష లేదు.
ప్రాక్టికల్ పరీక్షలు..
జనరల్ & వొకేషనరల్ సబ్జెక్టులు: 03.05.2024 - 10.05.2024.