News
News
X

Mana Ooru Mana Badi: గంభీరావుపేట 'కేజీ టూ పీజీ' క్యాంపస్‌ను ప్రారంభించిన మంత్రులు కేటీఆర్, సబితా!

తెలంగాణలో 'మన ఊరు-మన బడి'లో భాగంగా సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో నిర్మించిన కేజీ టూ పీజీ క్యాంపస్‌ను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్‌ ఫిబ్రవరి 1న ప్రారంభించారు.

FOLLOW US: 
Share:

తెలంగాణలో 'మన ఊరు-మన బడి'లో భాగంగా సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో నిర్మించిన కేజీ టూ పీజీ క్యాంపస్‌ను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్‌ ఫిబ్రవరి 1న ప్రారంభించారు. అనంతరం ఇరువురు నేతలు అత్యాధునిక వసతులతో ఏర్పాటు చేసిన డిజిటల్ లైబ్రరీతోపాటు వివిధ విభాగాలను పరిశీలించారు. సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 22 పాఠశాలలను కూడా ప్రారంభించనున్నారు. ‘మన ఊరు- మన బడి’లో భాగంగా రాష్ట్రంలోనే తొలి కేజీ టూ పీజీ క్యాంపస్‌ గంభీరావుపేటలో రూపుదిద్దుకుంది.

గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఒకే చోట కేజీ టూ పీజీ వరకు నాణ్యమైన ఉచిత విద్యను అందిస్తామన్న సీఎం కేసీఆర్‌ హామీ మేరకు మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక చొరవ, కార్పొరేట్‌ సంస్థల సహకారంతో గంభీరావుపేటలో ఆరెకరాల విస్తీర్ణంలో ఆధునిక సముదాయం నిర్మాణమైంది. రహేజా కార్ప్‌ ఫౌండేషన్‌, మైండ్‌స్పేస్‌ రిట్‌, యశోద హాస్పిటల్‌, ఎమ్మార్‌ఎఫ్‌, డీవీస్‌ ల్యాబ్‌, గివ్‌ తెలంగాణ, గ్రీన్‌కో సహకారంతో 3కోట్లతో సకల వసతులతో దీనిని నిర్మించారు. మొత్తం 70 తరగతి గదుల్లో 3500 మంది తెలుగు, ఇంగ్లిష్‌, ఉర్దూ మీడియంలో అభ్యసించేందుకు ఆధునిక హంగులతో ఎడ్యుకేషన్‌ హబ్‌లా నిర్మాణాలు పూర్తి చేశారు.

250 మంది చిన్నారులకు సరిపడేలా అంగన్‌వాడీ కేంద్రం.. చిన్నారులకు ప్రీ ప్రైమరీ, క్రీడా మైదానంతో పాటు ప్రైమరీ, ఉన్నత పాఠశాల, జూనియర్‌ కళాశాల, డిగ్రీ కళాశాలతో పాటు పీజీ కళాశాలకు అనుగుణంగా భవన సముదాయాలు సిద్ధం చేశారు. అంతే కాకుండా ప్రాంగణంలో డిజిటల్‌ లైబ్రరీ, కంప్యూటర్‌ ల్యాబ్‌, స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ కేంద్రం, వెయ్యి మంది ఒకే సారి కూర్చొని తినేలా డైనింగ్‌ హాల్‌ ఏర్పాటు చేశారు.


ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి వసతులు: మంత్రి హరీశ్ రావు 
‘మన ఊరు -మనబడి’ కార్యక్రమంలో భాగంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, ప్రగతి నగర్‌‌లో ఆధునిక వసతులతో రూపుదిద్దుకున్న మండల పరిషత్ ప్రైమరీ పాఠశాలలను ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ప్రారంబించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే వివేకానంద, పాఠశాల విద్యా కమిషనర్ దేవసేన, మేయర్ నీలా గోపాల్ రెడ్డి, అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి వసతులు ఉండాలని సీఎం కేసీఆర్ మన ఊరు- మన బడి ప్రారంబించారు. 700 ప్రభుత్వ పాఠశాలలో  ఒకే రోజు అభివృద్ధి పనులు ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది. పిల్లలకు ఆంగ్ల మాధ్యమంలో బోధనను ఇప్పటికే ప్రారంభించాం. పిల్లలు ఎంతో నేర్చుకునేందుకు డిజిటల్ తరగతులు ఉపయోగపడుతాయన్నారు.

9000 వేల మంది ఉపాధ్యాయులకు ప్రమోషన్ల ఇవ్వబోతున్నము. ఇది పూర్తి కాగానే భర్తీ ప్రక్రియ చేపట్టబోతున్నాము. బస్తీలో వైద్యం కోసం బస్తీ దవాఖానలు ప్రారంభించాం. బస్తీ ప్రజల నీటి గోసను సీఎం తొలగించారు. కరెంట్ కోతలు లేకుండా చేశారు. ఇప్పుడు బస్తీ వాసుల పిల్లల కోసం కార్పొరేట్ స్థాయి వసతులతో ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేస్తున్నామని తెలిపారు. స్కూల్ పిల్లలకు శానిటేషన్ కిట్స్ ఇవ్వబోతున్నము. వారం పది రోజుల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోబోతున్నాం. మన ఊరు -మన బడి వల్ల ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్లు పెరుగుతాయి. బలోపేతం అవుతాయనే నమ్మకం ఉంది. మొదటి దశలో భాగంగా రూ.3497 కోట్లతో 9000 పాఠశాలల్లో ఆధునిక వసతులు కల్పిస్తామని చెప్పారు. ఉపాధ్యాయులు పిల్లలకు సామాజిక అంశాలపై అవగాహన పెంచాలి. ఆర్థిక మంత్రిగా, సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మన ఊరు మన బడి కార్యక్రమానికి పూర్తి మద్దతు అందిస్తాం. ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులు ఐఐటీ ర్యాంకులు సాధించాలి.. ఎంబీబీఎస్ సీట్లు పొందాలి.. అత్యున్నత స్థాయికి ఎదగాలని మంత్రి హరీశ్ రావు ఆకాంక్షించారు.

ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుస్తున్న మన బస్తీ-మన బడి: మంత్రి తలసాని
మన ఊరు/బస్తీ-మన బడి కార్యక్రమంతో రాష్ట్రంలోని ప్రభుత్వ బడుల రూపురేఖలు మారుతున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్పొరేట్‌ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసిందని తెలిపారు. మన ఊరు/బస్తీ-మన బడి మొదటి దశలో భాగంగా రూ.7,289 కోట్లతో 9123 సర్కారు బడులను మెరుగుపరిచామన్నారు. హైదరాబాద్‌ సనత్‌నగర్‌, కంటోన్మెట్‌ నియోజకవర్గాల్లో మన బస్తీ-మన బడి నిధులతో అభివృద్ధి చేసిన ప్రాథమిక పాఠశాలలను మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంతో రాష్ట్రంలోని 26,095 సర్కార్ బడుల రూపురేఖలు మారనున్నాయని చెప్పారు.

నాణ్యమైన బోధన, భోజనం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ సర్కార్‌ అని వెల్లడించారు. ప్రైవేటు స్కూళ్లకు వెళ్లే పిల్లలు సైతం గవర్నమెంటు బడికి వచ్చేలా సకల వసతులు కల్పించామన్నారు. గురుకుల స్కూళ్లలో ఒక విద్యార్థిపై రూ.లక్ష 25 వేలు ఖర్చుచేస్తున్నామని తెలిపారు. విదేశీ విద్యకోసం వెళ్లే విద్యార్థులకు ప్రోత్సాహకాలు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనని స్పష్టం చేశారు. స్కూళ్లలో సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు క్రీడలపై సిబ్బంది దృష్టిపెట్టాలని సూచించారు. వచ్చే విద్యా సంవత్సరంలో సర్కారు బడుల్లో ప్రవేశాల సంఖ్య పెరిగేలా సిబ్బంది నాణ్యమైన విద్యా బోధన చేయాలన్నారు

విద్యావ్యవస్థను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి సత్యవతి
రాష్ట్ర ప్రభుత్వం మనసుపెట్టి ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేస్తున్నదని మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. విద్యా వ్యవస్థను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. మన ఊరు-మన బడి మొదటి విడుతలో ప్రతి మండలానికి నాలుగు పాఠశాలలను మోడల్ స్కూళ్లుగా అభివృద్ధి చేశామన్నారు. రానున్న మూడేండ్లలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సకల వసతులు కల్పిస్తామని తెలిపారు. ములుగు జిల్లా గోవిందరావుపేటలో మన ఊరు-మన బడిలో భాగంగా అభివృద్ధిచేసిన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను మంత్రి ప్రారంభించారు. విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించేందుకు తాగునీటి వసతితోపాటు మరుగుదొడ్లు, కిచెన్ షెడ్‌ల నిర్మాణాన్ని చేపట్టిందన్నారు. విద్యతోపాటు విద్యార్థులకు మంచి భోజనాన్ని అందిస్తున్న ప్రభుత్వం తెలంగాణ సర్కార్‌ అని చెప్పారు.

సర్కారు బడుల అభివృద్ధికి ప్రభుత్వం రూ.7200 కోట్లు మంజూరు చేసి అభివృద్ధి చేసిందని వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చేందుకు మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు. సామాన్య, మధ్యతరగతి పేద విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.

Published at : 01 Feb 2023 01:34 PM (IST) Tags: KTR Education News in Telugu Mana Ooru- Mana Badi’ programme Mana Ooru- Mana Badi’ Schools in Telangana Minister Sabitha reddy 680 schools in Telangana

సంబంధిత కథనాలు

ఏపీ ప్రభుత్వ హైస్కూల్స్‌లో 5388 'నైట్ వాచ్‌మెన్' పోస్టులు,  ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

ఏపీ ప్రభుత్వ హైస్కూల్స్‌లో 5388 'నైట్ వాచ్‌మెన్' పోస్టులు, ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

సీయూఈటీ (పీజీ) పరీక్ష షెడ్యూలు వెల్లడి, ముఖ్యమైన తేదీలివే!

సీయూఈటీ (పీజీ) పరీక్ష షెడ్యూలు వెల్లడి, ముఖ్యమైన తేదీలివే!

AP ICET 2023 Application: ఏపీ ఐసెట్ - 2023 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఇదే!

AP ICET 2023 Application: ఏపీ ఐసెట్ - 2023 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఇదే!

IITD Admissions: ఐఐటీ ఢిల్లీలో పీజీ, పీహెచ్‌డీ కోర్సులు, వివరాలు ఇలా!

IITD Admissions: ఐఐటీ ఢిల్లీలో పీజీ, పీహెచ్‌డీ కోర్సులు, వివరాలు ఇలా!

NSI Admissions: నేషనల్ షుగర్ ఇన్‌స్టిట్యూట్‌లో పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు, అర్హతలివే!

NSI Admissions: నేషనల్ షుగర్ ఇన్‌స్టిట్యూట్‌లో పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు, అర్హతలివే!

టాప్ స్టోరీస్

KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం

KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం

Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!

Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!

బాలయ్య మంచి మనసు - తారకరత్న పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని కీలక నిర్ణయం, సెల్యూట్ చేస్తున్న ఫ్యాన్స్

బాలయ్య మంచి మనసు - తారకరత్న పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని కీలక నిర్ణయం, సెల్యూట్ చేస్తున్న ఫ్యాన్స్

KTR Vs Revanth : కేటీఆర్‌కు నోటిసివ్వకపోతే హైకోర్టుకు వెళ్తా - సిట్ తీరుపై రేవంత్ రెడ్డి ఫైర్ !

KTR Vs Revanth :  కేటీఆర్‌కు నోటిసివ్వకపోతే హైకోర్టుకు వెళ్తా - సిట్ తీరుపై రేవంత్ రెడ్డి ఫైర్ !